నీట్ 2022(NEET 2022) పరీక్ష జులై 17న జరగనుంది. పరీక్ష తేదీ (Exam Date)కి ఇంకా కొద్ది రోజుల సమయమే మిగిలి ఉంది. ఈ నేపథ్యంలో నీట్ అభ్యర్థులు తమ ప్రిపరేషన్ (Preparation)ను మరింత వేగవంతం చేశారు. ఈసారి లక్షల మంది అభ్యర్థులు పరీక్షలు రాస్తున్నారు. వీరందరినీ నెగ్గి మంచి ర్యాంకు తెచ్చుకోవాలంటే బెస్ట్ ప్రిపరేషన్ టిప్స్ (Preparation Tips) ఫాలో అవ్వాల్సి ఉంటుంది. ఇంకొద్ది రోజుల సమయమే మిగిలి ఉండగా ఈ సమయంలో ఉత్తమ ప్రిపరేషన్ టిప్స్ తెలుసుకోవడం చాలా ముఖ్యం. అయితే మీకోసం 2021 నీట్ టాపర్స్ (NEET Toppers) విలువైన ప్రిపరేషన్ టిప్స్‌తో పాటు తమ సక్సెస్‌కు సీక్రెట్స్ (Success Secrets) పంచుకున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* నిఖార్ బన్సాల్, నీట్ 2021, ర్యాంక్ 5
నీట్ 2021 ఆలిండియా 5వ ర్యాంకర్ నిఖార్ బన్సల్ 720 మార్కులకు 715 సాధించారు. నీట్ రాస్తున్నప్పుడు టైం మేనేజ్మెంట్ ముఖ్యమని నిఖార్ తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానం తెలిస్తే, మిగతా ఆప్షన్స్ చదవకుండా రెండో ప్రశ్నకు ఆన్సర్ చేశానని, అలా చాలా సమయం సేవ్ చేసుకోగలిగానని వివరించారు. నిఖార్ ఇలాంటి స్ట్రాటజీని ఫాలో అయి పరీక్షలో కేవలం ఒక ప్రశ్నకు మాత్రమే తప్పు ఆన్సర్ ఇచ్చారు. అనేక పుస్తకాలు చదవకుండా ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలు బాగా చదివితే చాలని నిఖార్ సలహా ఇచ్చారు. ఒకటే పుస్తకాన్ని చదివినా దాన్ని క్షుణ్ణంగా చదవడమే సక్సెస్‌కి సీక్రెట్ అన్నారు.
* మృణాల్ కుట్టేరి, నీట్ 2021, ర్యాంక్ 1
మృణాల్ అందరికీ భిన్నంగా నీట్ పరీక్షలో మొదట ఫిజిక్స్ ప్రశ్నలను ఆన్సర్ చేశారు. బయాలజీ చాలా సులభమని ఆ సబ్జెక్ట్ ప్రశ్నలను చివరికి ఆన్సర్ చేశారు. అయితే తన స్ట్రాటజీ అందరికీ మంచి ఫలితాలను ఇవ్వకపోవచ్చని మృణాల్ అన్నారు. టాపర్లు ఇంటర్వ్యూలలో చెప్పిన ప్రకారం తాను కొన్ని టైమ్‌టేబుల్స్, ప్రిపరేషన్ టిప్స్ ఫాలో అయ్యానని కానీ అవేమీ తనకు వర్కవుట్ కాలేదని చెప్పారు. చివరికి తన సొంత స్ట్రాటజీతో పరీక్షకు సన్నద్ధమయ్యానని చెప్పారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు చాలా సపోర్ట్ చేయడం వల్లే పరీక్షకు చక్కగా ప్రిపేర్ అవ్వగలిగానని తెలిపారు.
* హృతుల్ ఛాగ్, నీట్ 2021, ర్యాంక్ 5
గుజరాత్‌కు చెందిన హ్రుతుల్ ఛాగ్ నీట్ పరీక్ష కోసం చాలా క్రమశిక్షణగా ప్రిపేర్ అయ్యారు. హ్రుతుల్ నీట్ అభ్యర్థులకు ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) బుక్స్ చదవడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. NCERT బుక్స్ నుంచి తగినన్ని ప్రశ్నలను ప్రాక్టీస్ చేస్తే ఎక్కువ స్కోర్ చేయవచ్చని చెప్పారు. బాగా ప్రాక్టీస్ చేయడంతో పాటు పట్టుదల ఉంటే నీట్ పరీక్షలో మంచి ర్యాంకు తెచ్చుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు.
* అమన్ కుమార్ త్రిపాఠి, నీట్ 2021, ర్యాంక్ 4
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమన్ కుమార్ త్రిపాఠి NCERT, క్లాస్ నోట్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీకి సంబంధించిన మాడ్యూల్స్ లలోని ప్రాక్టీస్ ప్రశ్నలపై ఎక్కువగా ప్రాక్టీస్ చేశారు. ఈ టాపర్ నీటి పరీక్ష సమయంలో మొదటగా బయాలజీ, తర్వాత కెమిస్ట్రీ, చివరకు ఫిజిక్స్ ఆన్సర్ చేశారు. "2021 పరీక్షలో రెండు విభాగాలు ఉన్నందున, మొదట సెక్షన్ A నుంచి జువాలజీ, బోటనీ, కెమిస్ట్రీ, ఫిజిక్స్ నాలుగు సెక్షన్ ప్రశ్నలను ఆన్సర్ చేశాను. ఆ తరువాత నేను సెక్షన్ B ఆన్సర్ చేశాను. సెక్షన్ ఎ పూర్తి చేసిన తర్వాత దాదాపు 80 శాతం సమాధానాలు పూర్తయ్యాయి, దాంతో నేను కొంచెం రిలాక్స్ అయ్యాను. తదుపరి సెక్షన్‌ను పూర్తిచేసే శక్తిని పొందాను," అని అతను చెప్పారు.
* తన్మయ్ గుప్తా, నీట్ 2021, ర్యాంక్ 1
తన్మయ్ గుప్తా నీట్ పరీక్ష కోసం కోచింగ్ తీసుకున్నారు. సాయంత్రం నాలుగు నుంచి ఐదు గంటల పాటు సొంతంగా స్టడీ చేశారు. ఉదయం చిన్నపాటి టార్గెట్స్ పెట్టుకొని నాటికి వాటిని సాధించారు. రాత్రి 10 గంటలకు చదవడం ఆపేసి మళ్లీ ఉదయాన్నే యథావిధిగా చదివేవారు. చదువుపై బోర్ కొట్టినప్పుడు ఈత కొట్టేందుకు వెళ్లడమో, స్నేహితులను కలవడమో చేసేవారట. "స్విమ్మింగ్ చేయడం లేదా ఫ్రెండ్స్‌తో సరదాగా గడపడం నన్ను రిఫ్రెష్ చేసింది. అప్పుడు నేను మళ్లీ రెట్టింపు ఉత్సాహంతో పుస్తకాలను చదవగలను," అతను చెప్పారు. ప్రిపరేషన్ మధ్యలో ఒలింపిక్ స్పోర్ట్స్ కూడా చూశానని చెప్పారు.
* పవిత్ సింగ్, NEET 2021, ర్యాంక్ 23
పవిత్ సింగ్ నీట్ 2021లో 720కి 710 స్కోర్ చేశారు. తాను ప్రిపరేషన్‌కు కోచింగ్ మెటీరియల్‌ని ఉపయోగించానని, ఆన్‌లైన్ మెటీరియల్ కూడా ఫాలో అయ్యానని తెలిపారు. నీట్‌కి ప్రిపేర్ కావడానికి సహాయపడే అపారమైన మెటీరియల్ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉందన్నారు. విద్యార్థులు పెద్ద కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాల్సిన అవసరం లేదని, ఇప్పుడు చాలా ఆన్‌లైన్ క్లాసులు అందుబాటులో ఉన్నాయని.. ఇవన్నీ పరీక్షలకు ప్రిపేర్ కావడానికి సహాయపడతాయని ఆమె వెల్లడించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, JOBS, NEET 2022, Results