నీట్(NEET).. ఓ జాతీయ ప్రవేశ పరీక్ష. మెడికల్ (Medical) విద్యార్థులు(Students) ఈ పరీక్షకు అటెండ్ అవుతారు.ఇది జాతీయ ప్రవేశ పరీక్షే అయినప్పటికీ మన తెలుగు రాష్ట్రాల్లో(Telugu States) అనేక మంది విద్యార్థులు ఈ పరీక్షకు పోటీపడుతుంటారు. ఈ పరీక్షలో మంచి మార్కులు(Marks) తెచ్చుకునేందుకు చాలా రోజులుగా ప్రిపేర్(Prepare) అవుతూ ఉంటారు. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకులు, మనం స్కోర్(Score) చేసిన మార్కుల ఆధారంగానే విద్యార్థులకు మెడికల్ సీట్లను(Medical Seats) అలాట్ చేస్తుంది కేంద్రప్రభుత్వం. అందుకోసమే నీట్ లో మంచి ర్యాంకు తెచ్చుకునేందుకు అందరూ తెగ ట్రై చేస్తుంటారు.
నీట్ 2021 ఫలితాలను విశ్లేషిస్తే 8.7 లక్షల మంది విద్యార్థులు ఈ ఎంట్రన్స్ పరీక్షను రాస్తే అందులో ర్యాంకు పొందిన దాదాపు 66 శాతం మంది విద్యార్థులు ఆయా రాష్ట్రాల స్టేట్ బోర్డులకు చెందిన వారే కావడం గమనార్హం. పాతరోజుల్లో నీట్ ప్రశ్నాపత్రం మొత్తం సీబీఎస్ఈ సిలబస్ లోనే ఉండేది. దీని వలన స్టేట్ బోర్డు స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు ఎదుర్కొనేవారు. కానీ ప్రస్తుతం స్టేట్ బోర్డుల సిలబస్ ను కూడా నీట్ ప్రశ్నాపత్రంలో పొందుపర్చారు.అయితే, మన తెలుగు రాష్ట్రాల్లోసీబీఎస్ఈ సిలబస్‌నే అమలు చేస్తున్నందునవిద్యార్థులు గాబరాపడాల్సిన అవసరం లేదు. కాగా, సబ్జెక్ట్‌ల వారీగాచక్కగా పర్ఫార్మ్చేసేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
LIC Recruitment 2022: టెన్త్ పాసైనవారికి ఎల్ఐసీలో జాబ్స్... త్వరలో ముగియనున్న దరఖాస్తు గడువు
ఈ పరీక్షలో మనం విజయం సాధించాలంటే భాష మీద పట్టు ఉండడం చాలా అవసరం. మొదట్లో ఈ ప్రవేశపరీక్షను కేవలం ఇంగ్లిష్, హిందీ భాషల్లో మాత్రమే కండక్ట్ చేసేవారు. కానీ ప్రస్తుతం ఆ రెండు భాషలతో పాటుగా 11 లోకల్ లాంగ్వేజిల్లో కూడా కండక్ట్ చేస్తున్నారు. ఇందులో తెలుగు కూడా ఉంది.
ప్రిపరేషన్ విధానం చాలా ముఖ్యం.మొక్కుబడిగా కాకుండామనం చదివిన వాటిల్లో ఇంపార్టెంట్ అనిపించిన పాయింట్స్ ను సెపరేట్‌గా నోట్ చేసుకుంటే చాలా హెల్ప్ ఫుల్ గా ఉంటుంది. ఇలా చేయడం చాలా మంచి లక్షణం.
TCS Jobs: పీజీ పాసైనవారికి టీసీఎస్‌లో ఉద్యోగాలు... ఇలా అప్లై చేయండి
నీట్ ప్రవేశ పరీక్షకు ప్రిపేర్ అయ్యేవారు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వంటి సబ్జెక్టుల మీద పూర్తి పట్టు సాధించాలి. క్లాస్ 11కి సంబంధించిన ఈ సబ్జెక్టుల సిలబస్ ను పూర్తిగా వడపోయాలి. ఈ సబ్జెక్టుల మీద టోటల్ గ్రిప్ సాధిస్తే పరీక్షలో సక్సెస్ కావడం చాలా సులభమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Exams, NEET, NEET 2022