హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET Exam: ఏడాది రెండు సార్ల నీట్‌.. విద్యా, ఆరోగ్యశాఖ యోచ‌న‌

NEET Exam: ఏడాది రెండు సార్ల నీట్‌.. విద్యా, ఆరోగ్యశాఖ యోచ‌న‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET Exam: మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) నిర్వ‌హించే మెడిక‌ల్ ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ప‌రీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET). ఈ ప‌రీక్ష‌ను ఏటా రెండు సార్లు నిర్వ‌హించాల‌ని విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తున్నాయి. దీనిపై సాధ్యాసాధ్యాల‌ను ప‌రిశీలిస్తున్న‌ట్టు స‌మాచారం.

ఇంకా చదవండి ...

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) నిర్వ‌హించే మెడిక‌ల్ ప్ర‌వేశాల కోసం నిర్వ‌హించే ప‌రీక్ష నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET). ప్ర‌తీ ఏటా ఈ ప‌రీక్ష ఉత్తీర్ణ‌త‌కు ఎంతో మంది పోటీ ప‌డుతుంటారు. మెరుగైన మెడికల్ క‌ళాశాల‌ (Medical Colleges) లో చేరేందుకు నీట్ ఒక్క‌టే మార్గం. ఈ నేప‌థ్యంలో నీట్ ప‌రీక్ష‌ణు ఏడాదికి రెండు సార్లు నిర్వ‌హించాల‌ని విద్యా మంత్రిత్వ శాఖ మరియు ఆరోగ్య మంత్రిత్వ శాఖ యోచిస్తున్నాయి. . ఈ అంశంపై త ఏడాది విద్యాశాఖ మాజీ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ నేతృత్వంలో ఈ విషయం మొదట చర్చించారు. అనంత‌ర దీనిపై ఏకాభిప్రాయం రాలేదు. ఎంతో ముఖ్య‌మైన ప‌రీక్ష కావ‌డంతో రెండు సార్లు నిర్వ‌హిచ‌డం విద్యార్థుల‌కు ఉప‌యుక్తంగా ఉంటుంద‌ని డిమాండ్లు (Demands) వ‌స్తున్నాయి.

దేశంలో ప్ర‌స్తుతం నెల‌కొన్న ప‌రిస్థితులు విద్యార్థుల సామాజిక, ఆర్థిక కార‌ణాల‌ను దృష్టిలో పెట్టుకొని నీట్ నిర్వ‌హ‌ణలో మార్ప‌లు అవ‌స‌రంగా భావిస్తున్నారు. నీట్ (NEET) ప‌రీక్ష వ‌ల్ల పిల్లల్లో ఒత్తిడి పెరుగుతుంద‌ని కొంద‌రు కొన్ని రాష్ట్రాలు ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌ను వ‌ద్దంటున్నాయి. ఈ నేప‌థ్యంలో రెండు సార్లు ప‌రీక్ష నిర్వ‌హిస్తే మెర‌గ్గా ఉంటుంద‌ని నిర్వ‌హ‌ణ క‌మిటీ పేర్కొంది.

రెండు సార్ల‌తో స‌మ‌స్య‌లు..

పరీక్షను అనేకసార్లు నిర్వహించేందుకు అన్ని వ‌ర్గాల నుంచి మ‌ద్ద‌తు ఉన్న‌ప్ప‌టికీ.. కొన్ని అనుమానాలు ఉన్నాయి. ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌, కేసులు, ప్ర‌శ్నాప‌త్రాల్లో త‌ప్పులు వంటివి విద్యార్థులను ఇబ్బంది పెడ‌తాయ‌నే వాద‌న ఉంది.

RRB Grou-D: ఆర్ఆర్‌బీ-గ్రూప్‌డీ అభ్య‌ర్థుల‌కు గుడ్ న్యూస్‌.. అప్లికేష‌న్‌కు మ‌రో అవ‌కాశం


ఈ ప‌రీక్ష నిర్వ‌హ‌ణ‌పై రెండు మంత్రిత్వ శాఖ‌లు ఒక అవ‌గాహ‌న‌కు రావాల్సి ఉంది. అయితే దీనికి సంబంధించి పూర్తిస్థాయి స‌మావేశం ఇంకా జరుగ‌లేదు.   ఏడాదికి రెండుసార్లు మెడికల్ ప్రవేశ పరీక్ష నిర్వహించేందుకు విద్యా మంత్రిత్వ శాఖ సానుకూలంగా ఉందని గతంలో వార్తలు వచ్చాయి. అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు. గత సమావేశం తర్వాత జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసి) ఏర్పాటుతో వైద్య విద్య కోసం అపెక్స్ బాడీ కూడా మారిపోయింది.

నీట్ కౌన్సెలింగ్‌పై ఎంసీసీ మార్గ‌ద‌ర్శ‌కాలు


మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) త్వరలో తన అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. నీట్ 2021లో ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. అయితే కౌన్సెలింగ్ (Counselling) ఎప్పుడు నిర్వ‌హిస్తారో స్ప‌ష్ట‌మైన తేదీలు ప్ర‌క‌టించ‌న‌ప్ప‌టికీ అభ్య‌ర్థుల కోసం ప‌లు స‌ల‌హాల‌ను ఎంసీసీ (MCC) విడుద‌ల చేసింది. ఈ మార్గద‌ర్శ‌కాల‌లో (Guidelines) నీట్ అభ్య‌ర్థులు నకిలీ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేష‌న్ (Registration) ప్ర‌క్రియ కోసం ఏజెంట్‌ (Agent)ను నియమించుకోకుండా అభ్య‌ర్థులే స్వ‌యంగా ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్తి చేసుకోవాల‌ని సూచించింది.

First published:

Tags: EDUCATION, Exams, NEET, NEET 2021

ఉత్తమ కథలు