Home /News /jobs /

NEET 2022 EXAM DATE REGISTRATION SCHEDULE COMING SOON LEARN HOW TO FILL APPLICATION FORM GH VB

NEET 2022: నీట్ 2022 ఎగ్జామ్ డేట్, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ త్వరలోనే విడుదల.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 (NEET 2022)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ నెలలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా ఎన్టీఏ (NTA) నీట్ 2022 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ని ప్రకటించనుంది.

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ 2022 (NEET 2022)ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) జూన్ నెలలో కండక్ట్ చేసే అవకాశం ఉంది. అంతకంటే ముందుగా ఎన్టీఏ (NTA) నీట్ 2022 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్ షెడ్యూల్ ని ప్రకటించనుంది. విశ్వసనీయ వర్గాల ప్రకారం, ఎన్టీఏ నీట్ 2022 పరీక్షను ఈ ఏడాది జులై 25న నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో నీట్ 2022 పరీక్ష తేదీ, రిజిస్ట్రేషన్ తేదీ, నీట్ 2022 అర్హత ప్రమాణాలు, విదేశాల నుంచి ఎంబీబీఎస్ (MBBS) చదవడానికి సంబంధించిన వయోపరిమితి నిబంధనలు, neet.nta.nic.inలో అప్లికేషన్ ఫారంను ఎలా ఫిల్ చేయాలి వంటి విషయాలు తెలుసుకుందాం.

ఇండియాలో ఎంబీబీఎస్, బీడీఎస్ (BDS) కోర్సులలో ప్రవేశానికి విద్యార్థులు తప్పనిసరిగా నీట్ (Neet) ఎగ్జామ్ లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది. ఈ పరీక్షను NTA నిర్వహిస్తే, కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. నీట్ 2022 స్కోర్ దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్, డీమ్డ్ యూనివర్సిటీలు... ఇలా అన్ని మెడికల్, డెంటల్ కాలేజీలలో ప్రవేశానికి ఉపయోగపడుతుంది. MBBS లేదా BDS చదవడానికి విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులకు కూడా నీట్ తప్పనిసరి. వీరు నీట్ పరీక్షలో కనీసం 50 శాతం స్కోరు సాధించాల్సి ఉంటుంది.

నీట్ సాధారణంగా జూన్ నెలలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను పెన్, పేపర్ విధానంలో కండక్ట్ చేస్తారు. ఈ సంవత్సరం నీట్ 2022ని మళ్లీ జూన్‌లో నిర్వహించవచ్చని భావిస్తున్నారు. నీట్ పరీక్ష తేదీపై అధికారిక నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉంది. నీట్ 2022 పరీక్ష జూన్ 25, 2022న నిర్వహించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరీక్ష తేదీని మార్చి నెలలోగా ప్రకటించే అవకాశం ఉంది. ఏప్రిల్ 1 నుంచి రిజిస్ట్రేషన్ ప్రారంభం అవుతుందని అంచనా.

CBSE 12th CLASS: సీబీఎస్‌ఈ 12వ తరగతి టర్మ్1 ఫలితాలపై అభ్యంతరాలు ఉన్నాయా..? ఇలా ఫిర్యాదు చేయండి..


పరీక్షకు హాజరు కావాలనుకునే విద్యార్థులు అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inలో ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఫారమ్ లో అభ్యర్థులు తమ వ్యక్తిగత, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వివరాలను సబ్ మిట్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఫొటోగ్రాఫ్, సంతకాన్ని అప్‌లోడ్ చేయడంతోపాటు ఫీజు పేమెంట్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఫీజు చెల్లించకుండా దరఖాస్తు ప్రక్రియ పూర్తి కాదు.

* నీట్ 2022 అర్హత
ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీలో 12వ తరగతి లేదా 12వ తరగతి సమానమైన పరీక్షను పూర్తి చేసిన అభ్యర్థులు పరీక్షకు హాజరు కావడానికి అర్హులు. రెగ్యులర్ స్కూల్ ఎడ్యుకేషన్ విద్య తప్పనిసరి. ఓపెన్ స్కూల్ నుంచి ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు నీట్ పరీక్షకు హాజరయ్యేందుకు అనర్హులు. ఈ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులకు 17 ఏళ్లు నిండి ఉండాలి. అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏదీ లేదు.

* నీట్ 2022 సిలబస్
నీట్ సిలబస్ 11, 12వ తరగతి విద్యార్థులకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీకి NCERT సూచించిన విధంగానే ఉంటుంది. ఇది కూడా సీబీఎస్ఈకి 11, 12వ తరగతికి నిర్దేశించిన సిలబస్‌తో సమానం.

* నీట్ 2022 దరఖాస్తు ఫారం - ఎలా పూరించాలి
విద్యార్థులు neet.nta.nic.inలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు ఫారమ్‌ ఫిల్ చేయాల్సి ఉంటుంది. పేరు, ఇంటి పేరు, కేటగిరి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వివరాలు, సాధించిన మార్కులు, అడ్రస్ మొదలైన వాటికి సంబంధించిన సమాచారం అందించాలి. విద్యార్థులు ఆల్ ఇండియా కోటా లేదా కేవలం రాష్ట్ర కోటా కోసం అప్లై చేస్తున్నారా అనేది తెలియజేయాలి. నీట్ 2022 కోసం దరఖాస్తు ఫారమ్‌లు ఇంకా విడుదల కాలేదు. అవి ఏప్రిల్ 1, 2022 నుంచి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇదే ఈ విషయమై త్వరలో NTA నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

CBSE Term 2: సీబీఎస్‌ఈ 12వ తరగతి విద్యార్థులకు ప్రిపరేషన్ టిప్స్.. ఇంగ్లీష్‌లో ఎక్కువ మార్కులకు ఇలా చేయండి..


* నీట్ 2022 ఎగ్జామ్ ప్యాట్రన్
పరీక్ష విధానంలో ఎలాంటి మార్పు లేదు. NTA నీట్ 2022ని ఒకే రోజు దేశవ్యాప్తంగా పెన్, పేపర్ ఫార్మాట్‌లో నిర్వహిస్తుంది. పరీక్ష 720 మార్కులతో మొత్తం 180 ప్రశ్నలు కలిగి ఉంటుంది. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ నుంచి 45 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి ప్రశ్నకు 4 మార్కులు, తప్పు సమాధానానికి 1 నెగిటివ్ మార్కు ఉంటుంది.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET, NEET 2022, Students

తదుపరి వార్తలు