Home /News /jobs /

NEET 2022 CHECK REPORTING TIME OMR SHEET AVAILABILITY AND OTHER RULES UMG GH

NEET Admit Card: నీట్ ఎగ్జామ్‌కు రెడీ అవుతున్నారా..? రిపోర్టింగ్ టైమ్, OMR షీట్ అవైలబిలిటీ, ఇతర రూల్స్ చెక్ చేయండి..!

నీట్‌కి ప్రిపేర్ అవుతున్నారా..? ఇవి ఫాలో అవ్వండి

నీట్‌కి ప్రిపేర్ అవుతున్నారా..? ఇవి ఫాలో అవ్వండి

మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌కు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో విద్యార్థులు తుది సన్నాహకాలపై దృష్టి సారించారు. NEET 2022 రాసేవారి సంఖ్య పెరగడంతో, ప్రిపరేషనన్‌తో పాటు పరీక్ష రాసే విధానం కూడా ఫలితాలకు కీలకం కానుందని నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌కు ఇంకా 10 రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో విద్యార్థులు తుది సన్నాహకాలపై దృష్టి సారించారు. NEET 2022 రాసేవారి సంఖ్య పెరగడంతో, ప్రిపరేషనన్‌తో పాటు పరీక్ష రాసే విధానం కూడా ఫలితాలకు కీలకం కానుందని నిపుణులు చెబుతున్నారు. ఈ సంవత్సరం మెడికల్ ప్రవేశ పరీక్షలకు 18 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. నీట్ 2022 జూలై 17న జరగాల్సి ఉంది. పరీక్షను వాయిదా వేయాలనే డిమాండ్లు కొనసాగుతున్నప్పటికీ, ఈ సంవత్సరంలో అతిపెద్ద ప్రవేశ పరీక్షగా నీట్‌ను నిర్వహించడానికి అధికారులు సిద్ధమయ్యారు. నీట్ 2022 ఎగ్జామ్‌ను దేశవ్యాప్తంగా 546 నగరాల్లో, భారతదేశం బయట 14 నగరాల్లో నిర్వహించనున్నారు. పరీక్ష మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు జరుగుతుంది.

ఈ ఏడాది ఎగ్జామ్ కోసం విద్యార్థులకు 20 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఈ అదనపు సమయం గేమ్-ఛేంజర్‌గా మారనుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పరీక్షలో ప్రతి ప్రశ్నకు సమాధానమివ్వడానికి విద్యార్థులకు ఒక నిమిషం మాత్రమే సమయం ఇవ్వడం వల్ల విద్యార్థులపై ఒత్తిడి పెరిగింది. ఈ నేపథ్యంలో ప్రశ్నల సంఖ్యను పెంచకుండా 20 నిమిషాలు అదనంగా ఇస్తున్నారు. దీంతో ఈ టైమ్‌ను సద్వినియోగం చేసుకోవడంపై విజయాలు ఆధారపడి ఉంటాయి.

 ఇదీ చదవండి: ప్రతిభకు మార్కులు కొలమానం కాదు.. ఈ ఐఏఎస్ అధికారే ప్రత్యక్ష సాక్ష్యం.. టెన్త్‌లో ఈయనకు ఎన్ని మార్కులో తెలుసా..?


* ఈ రూల్స్ చెక్ చేయండి..
NTA అందించిన సమాచారం ప్రకారం, విద్యార్థులు మధ్యాహ్నం 1:30 గంటలలోపు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒక విద్యార్థి మతపరమైన దుస్తులు ధరిస్తే, ఎగ్జామ్ హాల్ లోపలికి అనుమతించరు. మతపరమైన జ్యువెలరీ వంటివి ధరించేవారు సరైన తనిఖీ కోసం కనీసం రెండు గంటల ముందు ఎగ్జామ్ సెంటర్లో రిపోర్ట్ చేయాలని నిబంధనల్లో ఉంది.

“అభ్యర్థులు ఆర్టికల్స్ లేదా విశ్వాసానికి సంబంధించిన వస్తువులు (ఆచార/సాంస్కృతిక/మతపరమైన) ధరించిన అభ్యర్థులు రిపోర్టింగ్ టైమ్‌కు కనీసం రెండు గంటల ముందు పరీక్ష కేంద్రంలో రిపోర్టు చేయాలి. తద్వారా అభ్యర్థికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా సరైన పరిశీలన కోసం తగినంత సమయం ఉంటుంది. అభ్యర్థి అలాంటి విశ్వాసం ఉన్న వస్తువులో అనుమానిత డివైజ్‌లు తీసుకువెళుతున్నట్లు స్క్రీనింగ్‌లో గుర్తిస్తే, దాన్ని పరీక్ష హాలులోకి అనుమతించరు" అని అడ్మిట్ కార్డ్ గైడ్‌లైన్స్‌లో ఉంది.



NTA గైడ్‌లైన్స్ ప్రకారం, అభ్యర్థులను మధ్యాహ్నం 1:30 తర్వాత పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు. మధ్యాహ్నం 1:15 గంటలకు సీటింగ్ అనుమతిస్తారు. పరీక్షకు సంబంధించిన అన్ని సూచనలను మధ్యాహ్నం 1:20 నుంచి 1:45 వరకు తెలియజేస్తారు. మధ్యాహ్నం 2 నుంచి 5:20 గంటల వరకు పరీక్ష జరగనుంది. విద్యార్థులు పరీక్ష హాలుకు చేరుకునేటప్పుడు టైమ్ డిస్ట్రిబ్యూషన్ గుర్తుంచుకోవాలి. అడ్మిట్ కార్డ్‌లో ఇతర నిబంధనలతో పాటు ఈ వివరాలు పేర్కొంటారు. నీట్ అడ్మిట్ కార్డ్స్ త్వరలో విడుదల కానున్నాయి. అడ్మిట్ కార్డులు neet.nta.ac.inలో అందుబాటులో ఉంటుంది. ప్రస్తుతానికి ఎగ్జామ్ రాసే నగరాలకు సంబంధించిన ఇన్‌ఫర్మేషన్ స్లిప్‌ను ఎన్టీఏ విడుదల చేసింది.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, Medical, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు