Home /News /jobs /

NEET 2022 CANDIDATES DEMAND POSTPONEMENT OF NEET EXAM LETTER TO NTA WITH TENS OF THOUSANDS OF SIGNATURES GH VB

NEET 2022: నీట్ ఎగ్జామ్ వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్.. పదివేల మంది సంతకాలతో NTAకి లేఖ..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌పై వివాదం కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ ప్రవేశ పరీక్ష(నీట్)ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ 10వేల మందికిపైగా ఎంబీబీఎస్ అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి లేఖ రాశారు.

ఇంకా చదవండి ...
జాతీయ స్థాయిలో నిర్వహించే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్‌పై(NEET) వివాదం కొనసాగుతుంది. అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate) మెడికల్ ప్రవేశ పరీక్ష(NEET)ను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ 10వేల మందికిపైగా ఎంబీబీఎస్ అభ్యర్థులు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA)కి లేఖ రాశారు. షెడ్యూల్‌ ప్రకారం NEET పరీక్ష తేదీ ఇతర పోటీ పరీక్షలకు చాలా దగ్గరగా ఉందన్న విషయాన్ని లేఖలో ప్రధానంగా ప్రస్తావించారు. కాగా, నీట్ పరీక్ష ఈ ఏడాది జూలై 17న జరగాల్సి ఉంది.

గతేడాది పరీక్షలకు సంబంధించిన కౌన్సిలింగ్ పూర్తికాక ముందే ఈ ఏడాది నీట్ పరీక్ష తేదీలను ప్రకటించిన విషయాన్ని అభ్యర్థులు హైలైట్ చేస్తున్నారు. చాలా మంది ఔత్సాహికులు మెడికల్ సీటు పొందాలనే లక్ష్యంతో NEET- 2021 కౌన్సెలింగ్ మాప్-అప్ రౌండ్ వరకు వేచి ఉన్నారు. అయితే ఒక్కరు కూడా సీటు పొందలేదు. మాప్ అప్ రౌండ్ ఏప్రిల్ మొదటి వారంలో ముగిసింది. చాలా రాష్ట్రాలు ఇప్పటికీ తమ కౌన్సెలింగ్ ప్రక్రియను పూర్తి చేయలేదని విద్యార్థులు లేఖలో ప్రస్తావించారు.



నీట్- 2021 కౌన్సెలింగ్‌ సందర్భంగా రిజర్వేషన్ విధానంలో మార్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ఈ ఏడాది చాలా మంది విద్యార్థులు సీటు పొందే అవకాశం తక్కువగా ఉంటుందని పలువురు అభ్యర్థులు అభిప్రాయపడుతున్నారు. నీట్ కోసం సన్నద్ధం కావడానికి డ్రాపర్లు, ఫ్రెషర్లకు తగినంత సమయం లేదని, దీంతో వారు తీవ్రంగా నష్టపోతారని పేర్కొంటూ నీట్‌ను వాయిదా వేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

CUET పరీక్ష జూలై ఫస్ట్ లేదా సెకండ్ వీక్‌లో, JEE మెయిన్స్ రెండో అటెంమ్‌ట్ జూలై 21న నిర్వహించనున్నారు. ఈ పరీక్షల మధ్యలో జూలై 17న NEET నిర్వహించడంతో తాము ఎంతో నష్టపోతామని విద్యార్థులు వాపోతున్నారు. ‘‘MBBS అభ్యసించడం లక్షలాది మంది విద్యార్థుల కల. ఇది భావోద్వేగంతో ముడిపడి ఉన్న అంశం. అయితే ముందస్తు తేదీల ప్రకటన కారణంగా చాలా మంది అభ్యర్థులు నిరాశలో ఉన్నారు. దయచేసి వారికి తగిన సమయాన్ని కేటాయించండి. దీంతో వారు పరీక్షకు బాగా సిద్ధం అవుతారు.’’ అని ఔత్సాహిక అభ్యర్థులు లేఖలో పేర్కొంటూ కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.



NEET అభ్యర్థులు చాలా మంది ఈ విషయంపై స్పందిస్తున్నారు. ట్విట్టర్‌లో #PostponeNEETUG2022, #ReschduleNEETUG2022 వంటి హ్యాష్‌ట్యాగ్స్‌‌ను వైరల్ చేస్తున్నారు. ఓ అభ్యర్థి ఇలా స్పందించారు.. ‘జేఈఈ అభ్యర్థులకు ఎక్కువ అటెమ్ట్స్ ఉన్నా, పరీక్షను వాయిదా వేస్తూ పొడిగింపు ఇస్తున్నారు. కానీ NEET అభ్యర్థులకు ఏడాదికి ఒక్క అవకాశం మాత్రమే ఉంది. అలాగే బోర్డు పరీక్షలు, నీట్ ఎగ్జామ్ మధ్య ఒక నెల గ్యాప్ మాత్రమే ఉంటుంది. దీంతో మేం తీవ్రంగా నష్టపోతాం. తప్పనిసరిగా ఒక నెల పొడిగింపు ఉండాలి.’ అంటూ ట్వీట్ చేశారు. కాగా, ఈ ఏడాది నీట్ కోసం వయోపరిమితిని ఎత్తేయడంతో పోటీ తీవ్రంగా ఉండనుంది. అదేవిధంగా ఈసారి పరీక్ష కోసం 20 నిమిషాలను అదనంగా పెంచనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు