NEET 2022 CANDIDATES DEMAND POSTPONEMENT OF NEET EXAM CONCERN THAT THERE IS NOT ENOUGH TIME FOR PREPARATION GH EVK
NEET 2022: ప్రిపరేషన్‌కు తగినంత సమయం లేదు.. నీట్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్
ప్రతీకాత్మక చిత్రం
NEET 2022 | నీట్ పరీక్ష తేదీతో అభ్యర్థులు సంతృప్తి చెందట్లేదు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన సమయానికి, అసలు పరీక్ష నిర్వహణకు మధ్య కేవలం రెండు నెలల గ్యాప్ మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షను వాయిదా వేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నీట్ (NEET) పరీక్ష తేదీ ఖరారైంది. జూలై 17న నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA).. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2022ను నిర్వహించనుంది. అయితే నీట్ పరీక్ష తేదీతో అభ్యర్థులు సంతృప్తి చెందట్లేదు. ఎగ్జామ్ డేట్ అనౌన్స్ చేసిన సమయానికి, అసలు పరీక్ష నిర్వహణకు మధ్య కేవలం రెండు నెలల గ్యాప్ మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. పరీక్షను వాయిదా వేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
పరీక్షకు సన్నద్ధమయ్యేందుకు తగిన సమయం దొరకడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. NEET 2022 పరీక్ష తేదీలను మార్చాలని సోషల్ మీడియా, ట్విట్టర్ ద్వారా డిమాండ్ చేస్తున్నారు. కొన్ని హ్యాష్‌ట్యాగ్‌లను ట్రెండింగ్ చేస్తున్నారు. JEE మెయిన్‌కు సంవత్సరానికి రెండు అవకాశాలు ఉన్నప్పటికీ, ఈ ఇంజనీరింగ్ ప్రవేశ పరీక్షను NTA వాయిదా వేసిందని.. అందువల్ల NEETను కూడా వాయిదా వేయాలని అభ్యర్థులు వాదిస్తున్నారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌ను ఏడాదికి ఒకే ఒక్కసారి నిర్వహిస్తున్నారు.
NEET అభ్యర్థులు చాలా మంది ఈ విషయంపై స్పందిస్తున్నారు. కాస్త సమయం ఇచ్చి కొత్త పరీక్ష తేదీని ప్రకటించాలనే డిమాండ్‌తో ట్విట్టర్లో #PostponeNEETUG2022, #ReschduleNEETUG2022 వంటి హ్యాష్‌ట్యాగ్స్ ట్రెండ్ చేస్తున్నారు. ఇదే విషయాన్ని ఓ అభ్యర్థి చెబుతూ.. ‘జేఈఈ అభ్యర్థులకు ఎక్కువ అటెమ్ట్స్ ఉన్నా, పరీక్షను వాయిదా వేస్తూ పొడిగింపు ఇస్తున్నారు. కానీ NEET యూజీ అభ్యర్థులకు ఏడాదికి ఒక్క అవకాశం మాత్రమే ఉంది. అలాగే బోర్డు పరీక్షలు, నీట్ ఎగ్జామ్ మధ్య ఒక నెల గ్యాప్ మాత్రమే ఉంటుంది. దీనిని మేము సమర్థించలేం. తప్పనిసరిగా ఒక నెల పొడిగింపు ఉండాలి.’ అని ట్వీట్ చేశారు.
CUET, JEE మెయిన్‌తో సహా అనేక ఇతర పరీక్షల తేదీలు క్లాష్ అవుతున్నాయని కొంతమంది అభ్యర్థులు హైలైట్ చేశారు. కనీసం ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకొని అయినా NTA నీట్‌ను వాయిదా వేయాలని కోరుతున్నారు. ఇలా చాలామంది #RescheduleNEETUG2022, #postponeneetug2022, #neet2022, #neetug2022 హ్యాష్‌ట్యాగ్‌లతో ట్వీట్లు చేస్తున్నారు. ఈ విషయంపై కొంతమంది అభ్యర్థులు సోషల్ మీడియాలో పోల్స్ కూడా ప్రారంభించారు.
నీట్ షెడ్యూల్
నీట్ పరీక్ష షెడ్యూల్ neet.nta.nic.in అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంది. NEET 2022 రిజిస్ట్రేషన్ చివరి తేదీ మే 6, 2022 వరకు ఉంది. ఈ అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ పరీక్షకు ఈసారి 20 నిమిషాల వ్యవధిని పెంచారు. ఈసారి ఎన్టీఏ.. మెడికల్ ఎంట్రన్స్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు వయసుతో నిమిత్తం లేకుండా విద్యార్థులను అనుమతించింది. దీంతో ఎక్కువ మంది అభ్యర్థులు పరీక్ష రాసే అవకాశం ఉంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.