Home /News /jobs /

NEET 2022 BOOKS RECOMMENDED BY TOPPERS TO GET GOOD RANK IN NEET ENTRANCE NS GH

NEET 2022: నీట్-2022 పరీక్షకు సిద్ధమవుతున్నారా? టాపర్స్ సిఫార్సు చేసిన పుస్తకాలు ఇవే!

NEET 2022 Books: చాలా మంది విద్యార్థులు 12వ తరగతిలో చేరగానే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ (NEET 2022) ఎప్పుడు నిర్వహిస్తారా అని రోజులను లెక్కిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం నీట్ 2022 కోసం 2021 టాపర్లు రికమండ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ వివరాలు ఇవే..

NEET 2022 Books: చాలా మంది విద్యార్థులు 12వ తరగతిలో చేరగానే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ (NEET 2022) ఎప్పుడు నిర్వహిస్తారా అని రోజులను లెక్కిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం నీట్ 2022 కోసం 2021 టాపర్లు రికమండ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ వివరాలు ఇవే..

NEET 2022 Books: చాలా మంది విద్యార్థులు 12వ తరగతిలో చేరగానే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ (NEET 2022) ఎప్పుడు నిర్వహిస్తారా అని రోజులను లెక్కిస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం నీట్ 2022 కోసం 2021 టాపర్లు రికమండ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ వివరాలు ఇవే..

ఇంకా చదవండి ...
వైద్య రంగాన్ని కెరీర్‌గా ఎంచుకోవాలనుకునే విద్యార్థులు 11వ తరగతి నుంచే నీట్ ఎగ్జామ్‌కు ప్రిపేర్ అవుతుంటారు. 12వ తరగతి చేరగానే వైద్య విద్య ప్రవేశ పరీక్ష నీట్‌ ఎప్పుడు నిర్వహిస్తారా అని రోజులను లెక్కిస్తుంటారు. ఈసారి నీట్ పరీక్ష సంవత్సరానికి రెండుసార్లు నిర్వహించే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి. అయితే ఈ పరీక్ష ఏడాదిలో ఒకటి లేదా రెండుసార్లు జరిగినా, విద్యార్థులు పరీక్షకు సిద్ధం కావాల్సిన సమయం ఇది. ఈ నేపథ్యంలో నీట్ 2022 కోసం 2021 టాపర్లు (NEET 2021 Topper) రికమండ్ చేసిన కొన్ని ఇంపార్టెంట్ బుక్స్ ఏవో చూద్దాం.

నీట్ 2021 ఫస్ట్ ర్యాంకర్ మృణాల్ కుట్టేరి
మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో నూటికి నూరు శాతం మార్కులతో ఆలిండియా ప్రథమ ర్యాంకు సాధించిన హైదరాబాద్ కుర్రాడు మృణాల్ NCERT పుస్తకాలతో ప్రిపరేషన్ ప్రారంభించాడు. తరువాత NEET, AIIMS పరీక్షల గత సంవత్సరం ప్రశ్నపత్రాలతో కుస్తీపట్టాడు. అభ్యర్థులు తమ సొంతంగా స్ట్రాటజీ క్రియేట్ చేసుకోవాలని మృణాల్ సూచించాడు. సరైన ఎగ్జామ్స్ స్ట్రాటజీతో నీట్‌లో మంచి మార్కులు సాధించవచ్చని తెలిపాడు.
NEET 2021: నీట్‌ ఎగ్జామ్ అటెంప్టింగ్ ట్రిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ.. బెంగళూరు టాపర్ ఇస్తున్న సూచనలివే!

నీట్ 2021 ఫోర్త్ ర్యాంకర్ అమన్ కుమార్ త్రిపాఠి
ఉత్తరప్రదేశ్‌కు చెందిన అమన్ కుమార్ త్రిపాఠి నీట్ 2021లో 720 మార్కులకు 716 మార్కులతో 4వ ర్యాంక్‌ను సాధించాడు. అమన్ కూడా ఎక్కువగా ఎన్‌సీఈఆర్‌టీ (NCERT) పుస్తకాలను చదివాడు. ఫిజిక్స్, కెమిస్ట్రీ కోసం మోడల్ పేపర్స్ లోని ప్రశ్నలను ప్రాక్టీస్ చేశాడు. ప్రతిరోజూ ఇన్ని గంటలు చదవాలి అనే టార్గెట్ కాకుండా రోజూ ఎన్ని సబ్జెక్టులు, టాపిక్స్ కవర్ చేయాలో నిర్ణయించుకుని దానికి అనుగుణంగా ప్రిపేర్ అయ్యాడు. "నేను రోజుకు కొన్ని టాపిక్‌లను ఎంపిక చేసుకునే వాడిని. ఎంత సమయం తీసుకున్నా ఆ టాపిక్స్ ఆ రోజే పూర్తి చేసేలా కృషి చేశాను" అని అమన్ తెలిపాడు.
NEET Exam: ఇకపై ఏడాదికి రెండుసార్లు నీట్ ఎగ్జామ్​పై ఆరోగ్య, విద్యా శాఖల అభిప్రాయం ఇదేనా..

నీట్ 2021 5వ ర్యాంకర్ హృతుల్ ఛాగ్
గుజరాత్‌కు చెందిన హృతుల్ నీట్ 2021లో 720 మార్కులకు 715 మార్కులు సాధించాడు. నీట్ పరీక్షకు ఎన్‌సీఈఆర్‌టీ చదవడం అత్యంత ముఖ్యమని హృతుల్ చెబుతున్నాడు. "ఎన్‌సీఈఆర్‌టీ చదివి దానిపై దృష్టి పెట్టండి. చాలా మంది విద్యార్థులు సరిగ్గా చదవరు. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల్లోని వీలైనంత ఎక్కువ ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. ఎవరైనా నీట్ 2021ని క్లియర్ చేయలేక పోతే, డీలా పడకుండా కష్టపడి చదవండి. కచ్చితంగా విజయం సాధిస్తారు" అని హృతుల్ తెలిపాడు.

నీట్ 2021 23వ ర్యాంకర్ పవిత్ సింగ్
పవిత్ నీట్ 2021 కోసం ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాల బాగా చదివింది. ఆమె ఆన్‌లైన్ లెర్నింగ్ మెటీరియల్‌ లేదా కోచింగ్ మెటీరియల్‌ని కూడా ఉపయోగించింది. “ఇప్పుడు విద్యార్థులు నీట్ కోసం సిద్ధం కావడానికి సహాయపడే మెటీరియల్ ఆన్‌లైన్‌లోనే అందుబాటులో ఉంది. విద్యార్థులు పెద్ద కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా ఆన్‌లైన్ క్లాసులు పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడుతున్నాయి" అని ఆమె వెల్లడించింది.

నీట్ 2021 ర్యాంక్ 794 అనిరుద్ధ దాస్
బెంగళూరుకు చెందిన అనిరుద్ధ దాస్ మెడికల్ ప్రవేశ పరీక్షలో 99 పర్సంటైల్ సాధించాడు. అతను 720కి 681 మార్కులతో ఆల్ ఇండియా 794 ర్యాంకు సాధించాడు. దాస్ ఫిజిక్స్ ప్రిపరేషన్‌ కోసం డీసీ పాండే ఆబ్జెక్టివ్ ఫిజిక్స్ వాల్యూమ్‌-1, వాల్యూమ్‌-2 చదివాడు. కెమిస్ట్రీ, బయాలజీ కోసం ‘ఎంటీజీ ఎన్‌సీఈఆర్‌టీ ఎట్ యువర్ ఫింగర్‌టిప్స్ (MTG NCERT at Your Fingertips)’ని ఉపయోగించాడు. ఎంటీజీ NEET/AIPMT ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ బ్యాంక్‌ను కూడా సాల్వ్ చేశాడు. ఇందులో 1988 నుంచి 2020 వరకు ప్రశ్నలు ఉన్నాయి. ఈ పుస్తకాన్ని అతడు మూడు సబ్జెక్టులకు ఉపయోగించాడు.
Published by:Nikhil Kumar S
First published:

Tags: Exams, NEET, NEET 2021

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు