NEET 2022 BIOLOGY STUDY PLAN IF YOU READ LIKE THIS YOU WILL SCORE 360 MARKS IN EXAM GH EVK
NEET 2022 Study Plan: నీట్-2022 బయాలజీ స్టడీ ప్లాన్: ఇలా చదివితే 360 మార్కులు ఎక్కడికీ పోవు..
(ప్రతీకాత్మక చిత్రం)
NEET 2022 Study Plan | నీట్‌ను తొలి ప్రయత్నంలోనే అధిగమించాలనుకుంటే బయాలజీ (Biology)పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ మొత్తం 720 మార్కులకు ఉంటే అందులో బయాలజీ వాటా 360. ఏ సబ్జెక్ట్‌లో ఏ టాపిక్స్ చదవాలో తెలుసుకోండి.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) ప్రవేశ పరీక్షను తొలి ప్రయత్నంలోనే క్రాక్ చేయాలని డాక్టర్ (Doctor) అవ్వాలనుకుంటున్న ప్రతి ఒక్కరికీ ఆశగా ఉంటుంది. అంతేకాకుండా దేశంలో ఎంబీబీఎస్ (MBBS) చదవాలనుకునే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతూనే ఉంది. దాంతో ఈ ఎగ్జామ్‌ను మరింత కఠినంగా నిర్వహిస్తున్నారు. నీట్ (NEET)ను తొలి ప్రయత్నంలోనే అధిగమించాలనుకుంటే బయాలజీ (Biology)పై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఎగ్జామ్ మొత్తం 720 మార్కులకు ఉంటే అందులో బయాలజీ వాటా 360. అయితే సరైన ప్రిపరేషన్ లేకుండా ఇందులో మార్కులు సాధించడం చాలా కష్టం. అంతేకాకుండా 2021లో జరిగిన నీట్లో బయాలజీని.. బోటనీ (Botany), జువాలజీ (Zoology) లుగా విభజించి పరీక్ష నిర్వహించారు. ఈ ఏడాది కూడా అదే విధంగా నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో బయాలజీలో మంచి స్కోరు సాధించడం కోసం ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో తెలుసుకుందాం.
ఎగ్జామ్ ప్యాట్రన్‌పై దృష్టి పెట్టండి..
ఎంట్రన్స్ టెస్టుకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ముందుగా ఆ ఎగ్జామ్ ప్యాట్రన్‌పై అవగాహన తెచ్చుకోవాలి. ఏ సబ్జెక్ట్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.. ఈ విభాగానికి ఎక్కువ వెయిటేజ్ ఇచ్చారు.. అనే బేసిక్స్ (Basics) ను ముందుగా తెలుసుకోవాలి. నీట్ విషయానకి వస్తే 2021 ముందు వరకు కూడా బయాలజీని సింగిల్ సబ్జెక్ట్‌గా ఇచ్చారు. అదే విధంగా చాయిస్ ఆప్షన్ లేదు. అయితే 2021 నుంచి ఈ పద్ధతి మారింది. బయాలజీని బోటనీ, జువాలజీలుగా విభజించారు. ఈ సారి కూడా అదే విధంగా ఉండొచ్చు.
ఏ పుస్తకాలు చదవాలి?
నీట్ కోసం మార్కెట్లలో కుప్పలు తెప్పలుగా పుస్తకాలు లభిస్తున్నాయి. 30 రోజుల్లో నీట్‌ను క్రాక్ చేయండి అంటూ కొన్ని పుస్తకాలు కనిపిస్తూనే ఉంటాయి. అయితే కనిపించిన ప్రతి పుస్తకాన్ని చదవొద్దు. మీరు 2021 నీట్ పరీక్షను పరిశీలిస్తే ఎన్సీఆర్టీ (NCRT) పుస్తకాల నుంచే ఎక్కువగా ప్రశ్నలు వచ్చినట్లు అర్థం అవుతుంది.
ముందు ఎన్సీఆర్టీ ఓరియంటెడ్‌గా ప్రిపేర్ (Prepare) అవ్వండి. అనంతరం మరింత డీప్‌గా విశ్లేషించడానికి మార్కెట్లో ఉన్న పుస్తకాల్లోంచి సబ్జెక్ట్ (Subject) కు ఒకటి చొప్పున ఎంపిక చేసుకోండి. అంతేకాకుండా చదివిన వాటిని పేపర్‌పై పెట్టడం చాలా ముఖ్యం. ఇందుకోసం మీరు తరచూ ప్రాక్టీస్ (Practice) చేయాలి. అంతేకాకుండా నీట్ శాంపిల్ టెస్టులను రాస్తూ ఉండండి. అప్పుడే సమయాన్ని సరిగ్గా ఎలా వినియోగించుకోవాలో అర్థం అవుతుంది.
బోటనీలో చదవాల్సిన చాప్టర్లు
1. ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్
2. మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్
3. సెల్ బయాలజీ
4. బయోటెక్నాలజీ
5. హ్యూమన్ ఫిజియాలజీ
6. డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి.
జువాలజీ లో చదవాల్సిన చాప్టర్లు
1. హ్యూమన్ ఫిజియాలజీ
2. ఎకాలజీ
3. జెనిటిక్స్
4. ఎవల్యూషన్ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి.
(గమనిక: ఇదంతా గత ప్రశ్నా పత్రాలను దృష్టిలో ఉంచుకొని విద్యార్థుల అవగాహన కోసం ఇవ్వడం జరిగింది. ప్రతి ఏడాది సిలబస్, ఎగ్జామ్ ప్యాట్రన్ మారే అవకాశం ఉంటుంది. నోటిఫికేషన్ విడుదలయ్యాక దానిని పూర్తిగా చదివి ప్రిపేర్ అవ్వాలి.)
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.