Home /News /jobs /

NEET 2022 ASPIRANTS HERE IS STRATEGY TO CRACK MEDICAL ENTRANCE IN ONE MONTH UMG GH

NEET 2022: జూలై 17న నీట్.. మంచి స్కోర్ కోసం ఈ నెల రోజులు ఇలా ప్రిపేర్ అవ్వండి..!

నీట్‌కి ఇలా ప్రిపేర్ అవ్వండి.

నీట్‌కి ఇలా ప్రిపేర్ అవ్వండి.

దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS ) కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్’(NEET)ను నిర్వహిస్తారు. జూలై 17న నీట్ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఈ ఏడాది నీట్‌కు భారీగా పోటీ ఉంటు

ఇంకా చదవండి ...
దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్(MBBS), బీడీఎస్(BDS ) కోర్సుల్లో ప్రవేశాల కోసం అర్హత పరీక్షగా ‘నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్’(NEET)ను నిర్వహిస్తారు. జూలై 17న నీట్ ఎగ్జామ్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించనుంది. ఈ ఏడాది నీట్‌కు భారీగా పోటీ ఉంటుంది. దాదాపు 15 లక్షల మందికిపైగా ఔత్సాహిక అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.

ఈ మెడికల్ పరీక్షకు కేవలం ఒక నెల మాత్రమే సమయం ఉంది. దీంతో ఔత్సాహిక అభ్యర్థులు ప్రిపరేషన్‌లో నిమగ్నమయ్యారు. మెడికల్ సీటుకు అర్హత సాధించడానికి ప్రిపరేషన్‌లో సరైన వ్యూహాన్ని అవలంభించాలి. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా స్టడీ ప్లాన్ సిద్ధం చేసుకోవాలి. ఎప్పటికప్పుడు రివిజన్‌లను పూర్తి చేయాలి. 11, 12 తరగతుల NCERT సిలబస్‌పై పట్టు సాధించాలి. అలాగే మునుపటి సంవత్సరాల ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఇటీవల ముగిశాయి. దీంతో ఇప్పుడు నీట్ కోసం అభ్యర్థులు సమర్థవంతంగా సన్నద్ధం కావడానికి అవకాశం ఉంది. ఒక నెలలోపు మెడికల్ పరీక్షకు ఎలా సిద్ధం కావాలనే దానిపై కొన్ని ప్రభావవంతమైన చిట్కాలు ఉన్నాయి. వాటిని పరిశీలిద్దాం.

ఇదీ చదవండి: ఆ వయస్సు దాటాక ముస్లిం యువతి తనకు నచ్చిన వ్యక్తిని పెళ్లాడొచ్చు.. పంజాబ్, హర్యానా హైకోర్టు సంచనల నిర్ణయం


రివిజన్‌‌
ప్రిపరేషన్ చివరి నెలలో ఏదైనా కొత్త చాప్టర్ ఎంచుకొని సమయాన్ని వృథా చేయకూడదు. ఇప్పటికే విస్తృతంగా చదివిన వాటిని రివిజన్ చేయండి. ప్రిపరేషన్ సమయంలో రాసుకున్న నోట్స్‌ను మరోసారి తిరగేయండి. రివైజ్ చేస్తున్నప్పుడు బయాలజీని నిర్లక్ష్యం చేయవద్దు. మీ స్కోర్‌ను పెంచడంలో ఇది కీలకం కానుంది. కెమిస్ట్రీలో ఇన్‌ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ కెమిస్ట్రీ సబ్జెక్టుల కోసం వేర్వేరు రివిజన్ విధానాలను పాటించాలి. ఫార్ములాలను అనుసరించి అవసరమైన రియాక్షన్స్ నేర్చుకోవడం ప్రారంభించండి. ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలను ఒకే విధంగా రెండుసార్లు రివైజ్ చేయండి. ఆపై మునుపటి సంవత్సరం పేపర్‌లకు సంబంధించిన ప్రాబ్లమ్స్‌ను సాల్వ్ చేయడానికి ప్రయత్నించండి.

ఇదీ చదవండి: జేఈఈ అడ్మిట్ కార్డ్స్ ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి.. ఇంకా ఏమేం చెక్ చేసుకోవాలంటే..?


లక్ష్యాలను సరిగ్గా నిర్దేశించుకోండి
ప్రిపరేషన్ చివరి రోజుల్లో.. మీ నాలెడ్జ్‌ను తప్పనిసరిగా పరీక్షించుకోవాలి. ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ MCQలను ప్రాక్టీస్ చేయండి. మీరు ఆన్సర్ చేయలేని అంశాలను విశ్లేషించి, వాటిని మళ్లీ రివిజన్ చేయడం ప్రారంభించండి. MCQలను సాల్వ్ చేయడం వలన, మీరు పరీక్షకు వెళ్లే ముందు రివిజన్ అంశాల ప్రాధాన్యత చెక్‌లిస్ట్‌ను రూపొందించడంలో ఇది మీకు సహాయపడుతుంది. మీ బ్రెయిన్‌కు మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల సమయంలో గరిష్టంగా పనిచేసేలా శిక్షణ ఇవ్వడం కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే ఆ సమయంలోనే నీట్ పరీక్ష జరగనుంది.

ఇదీ చదవండి: విద్యార్థులకు సువర్ణావకాశం.. స్కాలర్‌షిప్, ఫెలోషిప్‌లకు దరఖాస్తుల ఆహ్వానం


పేపర్ అటెమ్టింగ్ స్ట్రాటజీ
పరీక్ష అటెమ్ట్ విషయంలో చాలామంది విద్యార్థులు టైమ్ మేనేజ్‌మెంట్‌‌ చేసుకోలేక ఇబ్బందులు పడుతుంటారు. పరీక్షలో మీరు వేగంగా నిర్ణయం తీసుకోవాలంటే, ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయం వృథా చేయకుండా ఉండటం కీలకం. మీకు ఆన్సర్ తెలియకపోతే, వెంటే ఇతర ప్రశ్నలపై దృష్టిసారించాలి. టైమ్ మేనేజ్‌మెంట్‌ను అర్థం చేసుకోవడానికి, మీరు వీలైనన్ని మాక్ ప్రశ్న పత్రాలను ప్రాక్టీస్ చేయడం ముఖ్యం.

మంచి ఆహారం.. సరైన నిద్ర
మీ బ్రెయిన్ ప్రాసెస్ చేసిన డేటాను నిలుపుకోవడంలో సహాయపడటానికి రోజుకు కనీసం ఆరు గంటలు నిద్రపోండి. మీరు శక్తివంతంగా, ఆరోగ్యంగా ఉండేందుకు సరైన వ్యవధిలో క్రమం తప్పకుండా భోజనం చేయండి. శరీరం, మనస్సు రిలాక్డ్స్‌గా ఉంటే పరీక్షను ఏకాగ్రతతో ఎదుర్కొవచ్చు.ఇతర విషయాలను పట్టించుకోవద్దు
ఏకాగ్రత పొందడానికి డిజిటల్ గాడ్జెట్‌లు, గేమింగ్, సోషల్ మీడియాను వినియోగించుకోవద్దు. అయితే నిరంతరం పుస్తకాల్లో మునిగిపోవద్దు. రెగ్యులర్ బ్రేక్ తీసుకోవడం ముఖ్యం. మిమ్మల్ని మీరు ఉత్సాహపరిచేందుకు శారీరక శ్రమకు ప్రాధాన్యత ఇవ్వండి.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, Jee, JOBS, NEET 2022

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు