హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022 Free Coaching: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ యాప్ లో ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్.. తెలుసుకోండి

NEET 2022 Free Coaching: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. ఈ యాప్ లో ఫ్రీ కోచింగ్, స్టడీ మెటీరియల్, మాక్ ఎగ్జామ్స్.. తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నీట్(NEET 2022) కు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు Affinity Education App గుడ్ న్యూస్ చెప్పింది. ఆ యాప్ ద్వారా ఉచితంగా కోచింగ్ పొందడంతో పాటు మాక్ టెస్ట్స్, ఫ్రీగా స్టడీ మెటీరియల్ పొందే అవకాశం ఉంది.

దేశంలోనే అత్యంత పేరొందిన పోటీ పరీక్షల్లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (NEET) ఒకటి. మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఈ ఎగ్జామ్ (Exam) కు పోటీ విపరీతంగా ఉంటుంది. అయితే డాక్టర్ కావాలన్న కలతో లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు ఏళ్ల పాటు ప్రిపేర్ (NEET Preparation) అవుతూ ఉంటారు. చాలా మంది లక్షలు ఖర్చు చేసి కోచింగ్ తీసుకుంటూ ఉంటారు. అయితే.. అనేక మంది పేద విద్యార్థులు కోచింగ్ కోసం డబ్బులు ఖర్చు చేసే స్తోమత లేక ఇంట్లోనే ఉండి సొంతంగా ప్రిపేర్ అవుతూ ఉంటారు. ఆన్లైన్లో అందుబాటులో ఉన్న స్టడీ మెటీరియల్, ఇతర పుస్తకాలతో వారు ప్రిపరేషన్ సాగిస్తారు. అయితే అలాంటి విద్యార్థులకు ఓ గుడ్ న్యూస్. కేవలం ఓ స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు నీట్ ఎగ్జామ్ కు ఇంట్లో నుంచే ఉచితంగా కోచింగ్ పొందే అవకాశం ఉంది. Affinity Education App మీకు ఆ అవకాశాన్ని కల్పిస్తుంది.

ఈ యాప్ ద్వారా ఉచితంగా క్లాసులను వినడమే కాకుండా.. మాక్ టెస్ట్ పేపర్లను కూడా అటెంప్ట్ చేయొచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ తదితర సబ్జెక్టుల క్లాసులను ఎలాంటి ఫీజు లేకుండా ఈ యాప్ ద్వారా వినొచ్చు. అనుభవం ఉన్న టీచర్లు మీకు ఆ క్లాసుల ద్వారా నీట్ కు కావాల్సిన అంశాలను బోధిస్తారు. కేవలం క్లాసులు మాత్రమే కాదు ఉచితంగా స్టడీ మెటీరియల్, డౌట్ సెషన్స్, మాక్ టెస్ట్స్ తో ఇతర అనేక సదుపాయాలు ఈ యాప్ ద్వారా ఉచితంగా పొందొచ్చు.

NEET 2022: నీట్-2022 పరీక్షకు సిద్ధమవుతున్నారా? టాపర్స్ సిఫార్సు చేసిన పుస్తకాలు ఇవే!

ఇంకా.. మెడికల్ ప్రొఫెషనల్స్ కూడా వెబినార్ల ద్వారా సలహాలు, సూచనలు అందిస్తారని యాప్ సీఈఓ విష్ణు తిరుపతి వెల్లడించారు. అయితే.. అనేక ప్రభుత్వాలు సైతం నీట్ కు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తున్నాయి. ఢిల్లీ ప్రభుత్వం ‘‘జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభ వికాస్ యోజన’’ (Jai Bhim Mukyamantri Pratibha VikasYojana) పథకం కింద నీట్ తో పాటు వివిధ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న 1500 మంది విద్యార్థులకు ఉచితంగా శిక్షణ అందిస్తోంది.

NEET 2021: నీట్‌ ఎగ్జామ్ అటెంప్టింగ్ ట్రిక్స్, ప్రిపరేషన్ స్ట్రాటజీ.. బెంగళూరు టాపర్ ఇస్తున్న సూచనలివే!

ఉత్తర ప్రదేశ్ (Uttar Pradesh) ప్రభుత్వం సైతం నీట్ కు సన్నద్ధమవుతున్న పేద వర్గాలకు చెందిన విద్యార్థులకు అండగా నిలుస్తోంది. ‘‘సూపర్ 100’’ స్కీమ్ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తోంది. ఇంకా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) సైతం నీట్ కు సన్నద్ధమవుతున్న విద్యార్థులకు సహాయం అందించేందుకు అనేక వీడియోలను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచింది.

First published:

Tags: Career and Courses, Exams, NEET

ఉత్తమ కథలు