హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: ఈ ఏడాది నీట్‌కు రికార్టు స్థాయిలో అప్లికేషన్లు.. మెడికల్ సీట్లకు భారీగా పెరిగిన డిమాండ్..

NEET 2022: ఈ ఏడాది నీట్‌కు రికార్టు స్థాయిలో అప్లికేషన్లు.. మెడికల్ సీట్లకు భారీగా పెరిగిన డిమాండ్..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2022 కోసం 18.72 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 10.64 లక్షల మంది అభ్యర్థులు మహిళలు, 8.07 లక్షల మంది పురుషులు ఉన్నారు. మెడికల్ ప్రవేశ పరీక్షలో మహిళల సంఖ్య 10 లక్షలు దాటడం ఇటీవలి సంవత్సరాలలో ఇదే తొలిసారి.

ఇంకా చదవండి ...

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2022 కోసం 18.72 లక్షల మంది అభ్యర్థులు నమోదు చేసుకున్నారు. వీరిలో 10.64 లక్షల మంది అభ్యర్థులు మహిళలు, 8.07 లక్షల మంది పురుషులు ఉన్నారు. మెడికల్(Medical) ప్రవేశ పరీక్షలో మహిళల సంఖ్య 10 లక్షలు దాటడం ఇటీవలి సంవత్సరాలలో ఇదే తొలిసారి. రిజిస్ట్రేషన్ల(Registrations) సంఖ్య కూడా రికార్డు స్థాయిలో పెరిగింది. గత ఏడాది నీట్‌కు 15.44 లక్షల మంది అభ్యర్థులు హాజరుకాగా.. ఈ ఏడాది 2.5 లక్షలకు పైగా రిజిస్ట్రేషన్లు పెరిగాయి. ఈ ఏడాది నీట్‌కు గరిష్ఠ వయో పరిమితిని తొలగించారు. 25 ఏళ్లు పైబడిన వారు కూడా మెడికల్ ఎంట్రన్స్ (Medical Entrance) రాసేందుకు అర్హత కల్పించారు. ఇలాంటి కారణాల వల్ల NEET దరఖాస్తుల సంఖ్య పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. దీంతోపాటు రిపీటర్ల సంఖ్య కూడా పెరిగింది. కరోనా కారణంగా గతంలో చాలా మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాలేకపోయారు. ఇంకొంతమంది టెస్ట్‌లో మంచి మార్కులు సాధించలేకపోయారు. ఇలాంటి వారంతా ఈ ఏడాది ఎగ్జామ్‌కు అప్లై చేసుకున్నట్లు తెలుస్తోంది.

US Graduate Study: యూఎస్‌లో గ్రాడ్యుయేట్ కోర్సులతో ఎన్నో ప్రయోజనాలు.. విద్యార్థులు తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే..


“నీట్ ప్రిపరేషన్‌కు చాలా సమయం పడుతుంది, ఎక్కువసార్లు టెస్ట్ రాసేవారితో పోటీ పెరుగుతుంది. NEET అప్లికేషన్స్ మొదటిసారి 18 లక్షల మార్కును అధిగమించింది. అంటే పోటీ కచ్చితంగా పెరుగుతుంది. మహమ్మారి తర్వాత వైద్య సేవలకు ప్రాధాన్యం పెరిగింది. దీంతో రాబోయే సంవత్సరాల్లో పోటీ గట్టిగా ఉండే అవకాశం ఉంది. కోవిడ్-19 తర్వాత ఆరోగ్య రంగంలో అవకాశాలు పెరిగాయి. ఇదే సమయంలో ఇంజనీరింగ్‌ చదివేవారి సంఖ్య తగ్గుతోంది. దీంతో విద్యార్థులు మెడికల్ స్ట్రీమ్‌పై దృష్టి సారిస్తున్నారు. ఈ కెరీర్‌ ఆర్థికంగా మరింత భద్రత కల్పిస్తుందని విద్యార్థులు భావిస్తున్నారు." అని విద్యామందిర్ క్లాసెస్ చీఫ్ అకడమిక్ ఆఫీసర్ సౌరభ్ కుమార్ చెప్పారు.

అయితే అప్లై చేసిన 18 లక్షల మంది విద్యార్థులలో ప్రతి ఒక్కరూ పోటీ కాదని కుమార్ తెలిపారు. ‘25 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న దరఖాస్తుదారులు పెద్ద గేమ్ ఛేంజర్‌గా ఉండరు. ఎందుకంటే గత ట్రెండ్‌లు గరిష్ట వయోపరిమితికి సమీపంలో ఉన్న విద్యార్థులు ఎవరూ నీట్‌లో సక్సెస్ కాలేదని నిరూపిస్తున్నాయి. కాబట్టి ఎగ్జామ్‌కు అప్లై చేసే ప్రతి ఒక్కరు పోటీ కాదు.’ అని కుమార్ విశ్లేషించారు. నీట్‌కు పెరుగుతున్న పోటీని ఎలా తట్టుకోవాలనే విషయంపై కుమార్ విద్యార్థులకు సలహా ఇచ్చారు. సిలబస్‌ను కనీసం 3 నుంచి 4 సార్లు రివిజన్ చేయాలని సూచించారు.

Btech-Mtech Students: బీటెక్, ఎంటెక్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. నేషనల్ హైవే అందిస్తున్న ఆఫర్ ఇదే..


అభ్యర్థుల కష్టాలను తగ్గించడానికి నీట్ నిర్వహించే NTA తాజాగా పరీక్షలో కొన్ని మార్పులు చేసింది. గత సంవత్సరం మెడికల్ ప్రవేశ పరీక్షలో ప్రవేశపెట్టిన ఇంటర్నల్ ఆప్షన్స్‌ కొనసాగించడమే కాకుండా పరీక్ష వ్యవధిని కూడా పెంచింది. మెడికల్ ఎంట్రన్స్‌లో ప్రతి ప్రశ్నకు 1 నిమిషం చొప్పున సమయం పొందేందుకు 20 నిమిషాలు అదనంగా కేటాయించారు. ఇవన్నీ అభ్యర్థులకు సహాయపడతాయి.

First published:

Tags: Career and Courses, Medical, NEET 2022, Neet applications

ఉత్తమ కథలు