Home /News /jobs /

NEET 2022 ANSWER KEY RELEASE DATE HOW TO CALCULATE MARKS UMG GH

NEET 2022: నీట్ 2022 ఆన్సర్ కీ రిలీజ్ డేట్.. మార్కులను ఎలా లెక్కించాలి.. మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ తెలుసుకోవచ్చు..!

నీట్ 2022 అప్‌డేట్స్

నీట్ 2022 అప్‌డేట్స్

చాలా విద్యాసంస్థలు, ఏజెన్సీలు NEET UG 2022 అన్ అఫీషియల్ కీ విడుదల చేశాయి. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వీటి ఆధారంగా NEET స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. NTA త్వరలో neet.nta.nic.inలో ఫైనల్ ఆన్సర్ కీలను విడుదల చేయనుంది.

ఇంకా చదవండి ...
మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్- నీట్ గత వారం పూర్తయింది. ఈ పరీక్షకు సంబంధించిన ‘అఫీషియల్ ఆన్సర్ కీ’కి సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ఇంకా ఎలాంటి సమాచారాన్ని అందించలేదు. అయితే చాలా విద్యాసంస్థలు, ఏజెన్సీలు NEET UG 2022 అన్ అఫీషియల్ కీ విడుదల చేశాయి. ఇవి ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. అభ్యర్థులు వీటి ఆధారంగా NEET స్కోర్‌ను అంచనా వేసుకోవచ్చు. NTA త్వరలో neet.nta.nic.inలో ఫైనల్ ఆన్సర్ కీలను విడుదల చేయనుంది. అధికారిక ఆన్సర్ కీ అందుబాటులోకి వచ్చిన తర్వాత, అభ్యర్థులు తమ ఫైనల్ స్కోర్‌ లెక్కించుకోవచ్చు. వీటిపై ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఎన్‌టీఏ దృష్టికి తీసుకెళ్లవచ్చు. ఈ అభ్యంతరాలను అధికారిక ఇమెయిల్ అడ్రస్ లేదా ఏజెన్సీ ఆన్‌లైన్ పోర్టల్‌లో అందించిన లింక్ ద్వారా NTAకి సమర్పించవచ్చు.

* NEET UG 2022 స్కోర్‌ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి?

స్టెప్ 1: ట్యాలీ చేసే సమయంలో క్వశ్చన్ పేపర్‌కు కీ కోడ్స్‌ ప్రకారం ఆన్సర్ చేయండి.

స్టెప్ 2: క్వశ్చన్ పేపర్ సెట్, ఆన్సర్ కీ లాంగ్వేజ్ వంటివి ఆన్సర్ కీ, OMR షీట్ టాప్ ప్లేస్‌లో ఉంటాయి.

స్టెప్ 3: మీ కరెక్ట్ ఆన్సర్స్ రాసి, ఆ కౌంట్‌ను నాలుగుతో గుణించి, ఆ నెంబర్ రాయండి.

స్టెప్ 4: ఆ తర్వాత తప్పు సమాధానాలు ఇచ్చిన ప్రశ్నలను గుర్తించి, వాటిని కౌంట్ చేయండి.

NEET 2022 ఫైనల్ స్కోర్‌ను క్యాలిక్యులేట్ చేయడానికి ఫార్ములా:

NEET 2022 స్కోరింగ్ ఫార్ములా = [4*(సరైన ఆన్సర్ల సంఖ్య)] - [1*(తప్పు ఆన్సర్ల సంఖ్య)]



* గత ఏడాది ఇలా..
గతేడాది అన్‌రిజర్వ్‌డ్ కేటగిరీకి కటాఫ్ 50 పర్సంటైల్ కాగా, స్కోరు 138- 720 మార్కుల మధ్య ఉంది. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు కట్-ఆఫ్ స్కోరు 108 నుంచి 137 మార్కుల వరకు, పర్సంటైల్ 40గా ఉంది. అన్‌రిజర్వ్‌డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ (PH) వర్గాలకు చెందిన అభ్యర్థులకు మార్కులు 122 నుంచి 137 వరకు, పర్సంటైల్ 45 వరకు ఉన్నాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది పరీక్ష కఠినంగా ఉందని నిపుణులు చెబుతున్నారు. NTA ఈసారి స్టేట్‌మెంట్-బేస్డ్ ప్రశ్నల ఫ్రీక్వెన్సీని పెంచింది, వీటిని జాగ్రత్తగా చదవడం అవసరం. ఫిజిక్స్ విభాగంలో విద్యార్థులు ఎక్కువ క్యాలిక్యులేషన్ ఉండే ప్రశ్నలతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

నీట్ 2022 ఎగ్జామ్‌ను జులై 17న మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:20 గంటల వరకు నిర్వహించారు. 18,72,341 మంది అభ్యర్థులు పరీక్షకు నమోదు చేసుకోగా, వారిలో 8,07,541 మంది బాలురు, 10,64,791 మంది బాలికలు, 11 మంది ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. దేశంలోని 497 నగరాల్లో 3,570 కేంద్రాల్లో, విదేశాల్లోని 14 నగరాల్లో నీట్ ఎగ్జామ్‌ను నిర్వహించారు.
Published by:Mahesh
First published:

Tags: Career and Courses, JOBS, NEET, NEET 2022

తదుపరి వార్తలు