దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్ల భర్తీని నీట్-2022 ద్వారా చేపట్టనున్నారు. పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.. నీట్‌కు(NEET) సంబంధించి దరఖాస్తు ప్రక్రియను మరోసారి పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. గతంలో ఇచ్చిన నోటిఫికేషన్(Notification) ప్రకారం దరఖాస్తు ప్రక్రియ మే 6నే ముగియగా, దాన్ని మే 15వరకు పొడిగించారు. ఇప్పుడు తాజాగా ఈ గడువును మే 20 వరకు పెంచారు. అయితే, పరీక్ష తేదీలో ఎలాంటి మార్పులు ఉండవని ఎన్‌టీఏ స్పష్టం చేసింది. జూలై 17, 2022 నీట్ జరగాల్సి ఉంది. మరోవైపు అభ్యర్థులు నీట్ పరీక్షను ఆగస్టు వరకు వాయిదా వేయాలని కోరుతుండడం గమనార్హం.
నీట్ రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపుపై NTA స్పందించింది. BSc నర్సింగ్ ఔత్సాహిక అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి మరింత సమయం ఇవ్వడం కోసమే గడువును పెంచినట్లు NTA తెలిపింది. గతంలో ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులకు మాత్రమే నీట్ నిర్వహించేవారు. ఇప్పుడు దీన్ని నర్సింగ్ కోర్సులకు కూడా విస్తరించారు. డైరెక్టర్ జనరల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ మెడికల్ సర్వీసెస్ కార్యాలయం నుండి వచ్చిన అభ్యర్థన మేరకు NEET (UG) - 2022 కోసం దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీని మరింత పొడిగించాల్సి వచ్చిందని NTA పేర్కొంది.
ఆరు సాయుధ దళాల వైద్య సేవల(AFMS) సంస్థలు NEET స్కోర్ ఆధారంగా ప్రవేశాలు కల్పించడం కోసం అంగీకారం తెలిపాయి. ఈ జాబితాలో AFMC పూణే, CH కోల్‌కతా, INHS ముంబై, AH న్యూఢిల్లీ, CH లక్నో, బెంగళూరుకు చెందిన కాలేజ్ ఆఫ్ నర్సింగ్ సంస్థలు ఉన్నాయి. ఈ ఇన్‌స్టిట్యూట్‌ల ద్వారా మొత్తం 220 సీట్లను భర్తీ చేయనున్నారు.
* టాప్ 25 మెడికల్ కాలేజీలు ఇవే..
మెడికల్ ఔత్సాహిక అభ్యర్థుల కోసం NIRF ర్యాంకింగ్స్ ప్రకారం దేశవ్యాప్తంగా ఉన్న టాప్ కాలేజీల జాబితా ఇలా ఉంది.
ర్యాంక్ 1: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
ర్యాంక్ 2: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్
ర్యాంక్ 3: క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు
ర్యాంక్ 4: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్, బెంగళూరు
ర్యాంక్ 5: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో
ర్యాంక్ 6: అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూరు
ర్యాంక్ 7: బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
ర్యాంక్ 8: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి
ర్యాంక్ 9: కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో
ర్యాక్ 10: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
ర్యాంక్ 11: శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం
ర్యాంక్ 12: ఇన్ స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్, న్యూఢిల్లీ
ర్యాంక్ 13: జాన్స్ మెడికల్ కాలేజ్, బెంగళూరు
ర్యాంక్ 14: శ్రీ రామచంద్ర ఇన్ స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై
ర్యాంక్ 15: అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ, అలీఘర్
ర్యాంక్ 16: మద్రాస్ మెడికల్ కాలేజ్ & గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై
ర్యాంక్ 17: మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ, ఢిల్లీ
ర్యాంక్ 18: వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ & సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, న్యూఢిల్లీ
ర్యాంక్ 19: DY పాటిల్ విద్యాపీఠ్, పూణే
ర్యాంక్ 20: RM ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై
ర్యాంక్ 21: శిక్ష ఓ అనుసంధన్, భువనేశ్వర్
ర్యాంక్ 22: లేడీ హార్డింజ్ మెడికల్ కాలేజ్, న్యూఢిల్లీ
ర్యాంక్ 23: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మంగళూరు
ర్యాంక్ 24: JSS మెడికల్ కాలేజ్, మైసూర్
ర్యాంక్ 25: జామియా హమ్దార్ద్, న్యూఢిల్లీ
* పరీక్ష విధానం
NEET -2022లో 200 బహుళ ఎంపిక ప్రశ్నలు ఉంటాయి. ఒక్కొక్క సరైన సమాధానం కోసం నాలుగు ఎంపికలు ఉంటాయి. వాటిలో సరైనదాన్ని ఎంపిక చేసుకోవాలి. పరీక్షను భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం ఇలా మూడు భాగాలుగా విభజించారు. ప్రతి సబ్జెక్టులో 50 ప్రశ్నలు ఉంటాయి. వీటిని తిరిగి రెండు విభాగాలుగా (A , B) విభజించారు. పరీక్ష వ్యవధి 200 నిమిషాలు. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 05:20 గంటల వరకు జరుగుతుంది. తప్పు సమాధానానికి ఒక మార్కు మైనస్ కానుంది. NEET క్లియర్ చేయాలంటే అభ్యర్థులు కనీసం 50 పర్సంటైల్ మార్కులు స్కోర్ సాధించాల్సి ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, NEET, NEET 2022