హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2022: నీట్‌కు ప్రిపేరయ్యే వారికి అలర్ట్.. గతేడాది టాపర్స్ సూచిస్తున్న బుక్స్, ప్రిపరేషన్ టిప్స్ ఇవే..

NEET 2022: నీట్‌కు ప్రిపేరయ్యే వారికి అలర్ట్.. గతేడాది టాపర్స్ సూచిస్తున్న బుక్స్, ప్రిపరేషన్ టిప్స్ ఇవే..

నీట్ కోసం సన్నద్ధం కావటానికి  సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. గతేడాది నీట్‌లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్న వారి అనుభవాలు, సిలబస్‌లో భాగంగా ఏయే పుస్తకాలు చదివారిలో తెలుసుకుందాం.

నీట్ కోసం సన్నద్ధం కావటానికి సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. గతేడాది నీట్‌లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్న వారి అనుభవాలు, సిలబస్‌లో భాగంగా ఏయే పుస్తకాలు చదివారిలో తెలుసుకుందాం.

నీట్ కోసం సన్నద్ధం కావటానికి సిలబస్‌పై పూర్తి అవగాహన ఉండాలి. గతేడాది నీట్‌లో టాప్ ర్యాంకులు సొంతం చేసుకున్న వారి అనుభవాలు, సిలబస్‌లో భాగంగా ఏయే పుస్తకాలు చదివారిలో తెలుసుకుందాం.

దేశ‌వ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో(Medical College) ప్రవేశాలను నీట్ ద్వారా భర్తీ చేయనున్నారు. జూలై రెండో వారంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఈ ఏడాది గరిష్ట వయోపరిమితిని తొలగించడంతో.. దరఖాస్తు చేసే ఔత్సాహికుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మరోవైపు నీట్(NEET) కోసం సన్నద్ధం కావటానికి సిలబస్‌పై(Syllabus) పూర్తి అవగాహన ఉండాలి. గతేడాది నీట్‌లో టాప్ ర్యాంకులు(Top Ranks) సొంతం చేసుకున్న వారి అనుభవాలు, సిలబస్‌లో(Syllabus) భాగంగా ఏయే పుస్తకాలు(Books) చదివారిలో తెలుసుకుందాం.

నీట్ టాప్ ర్యాంకర్ మృణాల్ కుట్టేరి

హైదరాబాద్‌కు చెందిన ఈ విద్యార్థి, మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్‌లో ఫస్ట్ ర్యాంకు సాధించాడు. ప్రధానంగా NCERT పుస్తకాలతో ప్రిపేర్ అయ్యాడు. అదేవిధంగా గత సంవత్సరం నీట్‌తోపాటు AIIMS ప్రశ్నాపత్రాలను ప్రాక్టీస్ చేసినట్లు అతను వెల్లడించాడు. నీట్, 12వ తరగతి బోర్డు పరీక్షల సిలబస్ వనరులు ఒకేలా ఉన్నప్పటికీ పరీక్ష ప్రయత్న వ్యూహాలు భిన్నంగా ఉంటాయని.. ప్రిపరేషన్‌లో సొంత వ్యూహాన్ని కనుగొనేలా అభ్యర్థులను ప్రోత్సహించాలని మృణాల్ చెబుతున్నాడు. ‘నేను ప్రిపరేషన్ సమయం మొదట్లో రొటీన్‌ పద్దతులను అనుసరించాను. కానీ నిర్మాణాత్మక విధానంతో ఎలాంటి ప్రయోజనం ఉండదని గ్రహించి ప్రయోగాలు చేయడానికి సిద్ధపడ్డాను. ఎవరికి వారు తమకు అనువైన విధానంలో ప్రిపేర్ కావడం ఉత్తమైన మార్గం.’’ అని మృణాల్ కుట్టేరి తెలిపాడు.

NEET 2022: ప్రిపరేషన్‌కు తగినంత సమయం లేదు.. నీట్ ఎగ్జామ్‌ను వాయిదా వేయాలని అభ్యర్థుల డిమాండ్


నీట్ 4వ ర్యాంకర్ అమన్ కుమార్ త్రిపాఠి

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఈ విద్యార్థి NEET 2021లో 720 మార్కులకు 716 మార్కులు సాధించి 4వ ర్యాంక్‌ను సొంతం చేసుకున్నాడు. అమన్ కూడా ప్రిపరేషన్‌లో ఎక్కువగా NCERTపై దృష్టి సారించాడు. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రానికి సంబంధించిన మాడ్యూల్స్ నుండి ప్రశ్నలను ప్రాక్టీస్ చేసినట్లు తెలిపాడు. అతని రోజుకు ఎన్ని గంటల ప్రిపేర్ అవ్వడం దాని కన్నా ఎన్ని టాపిక్‌లు పూర్తి చేశాను అనేదానికి ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. "నేను రోజుకు కొన్ని టాపిక్‌లను సెట్ చేసేవాడిని. ఎంత సమయం తీసుకున్నా సరే, ఆ రోజే పూర్తి చేసేలా షెడ్యూల్ ఏర్పాటు చేసుకున్నాను.’’ అని అమన్ తెలిపారు.

నీట్-2021 4వ ర్యాంకర్ హృతుల్ ఛాగ్

గుజరాత్‌కు చెందిన హ్రుతుల్ NEET 2021లో 720 మార్కులకు 715 మార్కులు సాధించాడు. ఇతను కూడా ప్రిపరేషన్ వనరుల్లో ఎక్కువగా NCERT పుస్తకాల అధ్యయనానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. “ఎన్‌సీఈఆర్‌టీ పుస్తకాలపై దృష్టి పెట్టండి. చాలా మంది విద్యార్థులు సరిగ్గా చదవరు. NCERT నుండి తగినంత మొత్తంలో ప్రశ్నలను ప్రాక్టీస్ చేయండి. పట్టుదలతో కష్టపడి చదవండి. నీట్‌ను సాధిస్తారు’’ అని విద్యార్థులకు సూచన చేశారు హృతుల్ ఛాగ్.

నీట్ - 2021 23వ ర్యాంకర్ పవిత్ సింగ్

నీట్ ప్రిపరేషన్ కోసం కఠినమైన షెడ్యూల్ రూపొందించుకోలేదని పవిత్ సింగ్ తెలిపారు. ప్రతి రోజూ 3 నుండి 4 గంటల విశ్రాంతితో పాటు 7 నుండి 8 గంటలు నిద్రపోయానని.. మిగిలిన సమయంలోనే నీట్ కోసం సన్నద్ధం అయినట్లు ఆమె తెలిపింది. ఎక్కువగా NCERT పుస్తకాలను ప్రిపేర్ అయ్యానని పవిత్ తెలిపింది. నీట్ కోసం అపారమైన మెటీరియల్ ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉందని.. విద్యార్థులు పెద్ద కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలో చేరాల్సిన అవసరం లేదని సూచించారు. ఆన్‌లైన్ తరగతులు పరీక్షలకు సిద్ధం కావడానికి సహాయపడతాయని ఆమె పేర్కొంది.

Published by:Veera Babu
First published:

Tags: Career and Courses, NEET, NEET 2022

ఉత్తమ కథలు