Home /News /jobs /

NEET 2022 ADMIT CARD WHEN WHERE AND HOW TO DOWNLOAD KNOW FULL DETAILS HERE GH VB

NEET 2022: త్వరలో జారీ కానున్న నీట్ 2022 అడ్మిట్ కార్డ్స్.. ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షగా ‘నీట్’ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 17న మెడికల్ ఎంట్రెన్స్ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్వహించనుంది.

అండర్ గ్రాడ్యుయేట్(Under Graduate) మెడికల్(Medical) సీట్ల భర్తీ కోసం ప్రవేశ పరీక్షగా ‘నీట్(NEET)’ ఎగ్జామ్ నిర్వహిస్తారు. ఈ ఏడాది జూలై 17న మెడికల్ ఎంట్రెన్స్(Medical Entrance) పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్వహించనుంది. ఇప్పటికే దరఖాస్తు(Application), ఎడిటింగ్(Editing) విండో ప్రక్రియలు ముగిశాయి. త్వరలోనే అడ్మిట్ కార్డులను(Admit Cards) జారీ చేయనున్నారు. అయితే ఏ తేదీ నుంచి ఇవి అందుబాటులోకి రానున్నాయో ఇప్పటివరకు ఎన్‌టీఏ ప్రకటించలేదు. అడ్మిట్ కార్డు విడుదలైన తరువాత neet.nta.nic.in వెబ్ సైట్(Website) నుంచి అభ్యర్థులు వాటిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

సాధారణంగా నీట్ యూజీ అడ్మిట్ కార్డ్‌లు పరీక్షకు 10 నుంచి 15 రోజుల ముందు జారీ చేస్తారు. ఈ ఏడాది జూలై 17న నీట్ జరగనుంది. కాబట్టి త్వరలోనే అడ్మిట్ కార్డ్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో నీట్ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ ప్రాసెస్ ఏంటో తెలుసుకుందాం.

స్టెప్-1: ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్ neet.nta.nic.inను సందర్శించాలి.

స్టెప్-2: NEET UG 2022 అడ్మిట్ కార్డ్ అనే లింక్‌పై క్లిక్ చేయండి

స్టెప్-3: అప్లికేషన్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి

స్టెప్-4: నీట్-2022 అడ్మిట్ కార్డు స్క్రీన్‌పై కనిపిస్తుంది.

స్టెప్-5: అడ్మిట్ కార్డులోని వివరాలను సమీక్షించండి.

స్టెప్-6: చివరగా అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకుని ఫ్రింట్ ఔట్ తీసుకోండి.

నీట్-2022 పరీక్ష ద్వారా ఎంబీబీఎస్ సీట్లు 92,065, బీడీస్ 26,949 సీట్లు, ఆయుష్ స్టేజ్- 8 సీట్లు 52,720, BVSc 525 సీట్లతో పాటు ఏహెచ్ సీట్లకు ప్రవేశాలు కల్పించనున్నారు.

Modi@8: రాజకీయాల్లో మోదీ గురు మంత్రాన్ని అనుసరిస్తున్నాను: న్యూస్18తో యూపీ ఎంపీ వినోద్ సోంకర్..!


నీట్ పరీక్ష విధానం
NEET UG - 2022 పరీక్ష 13 భాషల్లో పెన్ అండ్ పేపర్ మోడ్‌లో నిర్వహించనున్నారు. నీట్ పరీక్ష వ్యవధి మూడు గంటల 20 నిమిషాలు. మొత్తం 200 ప్రశ్నలకు నీట్ పరీక్ష ఉంటుంది. వీటిలో అభ్యర్థులు 180 ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు నాలుగు మార్కులు ఉంటాయి. తప్పు సమాధానాలకు 1 మార్కును తీసివేయనున్నారు.

మరోవైపు అనేక మంది ఔత్సాహిక అభ్యర్థులు నీట్ యూజీ పరీక్షను వాయిదా వేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ ప్రారంభంలో ఈ పరీక్ష నిర్వహించాలని ఎన్‌టీఏకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇతర పరీక్షలతో నీట్ క్లాష్ అవుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. సీబీఎస్‌ఈ బోర్డు పరీక్షలు జూన్ 15 ముగుస్తున్నాయని... దీంతో నీట్ కోసం సన్నద్ధం కావడానికి కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉందని విద్యార్థులు వాపోతున్నారు. అలాగే సీయూఈటీ-2022 కూడా జూలై మొదటి లేదా రెండో వారంలో జరిగే అవకాశం ఉంది. ఆ తరువాత కేవలం వారం రోజుల సమయం మాత్రమే నీట్ కోసం ఉంటుందని, దీంతో తాము చాలా ఒత్తిడిని ఎదుర్కొవాల్సి ఉంటుందని విద్యార్థులు అంటున్నారు. విద్యార్థుల డిమాండ్లకు NTA తలొగ్గి, పరీక్ష తేదీని వాయిదా వేస్తే అడ్మిట్ కార్డ్ కూడా ఆలస్యంగా జారీ చేయనున్నారు.
Published by:Veera Babu
First published:

Tags: Admit cards, Career and Courses, NEET, NEET 2022, Neet exam

తదుపరి వార్తలు