Home /News /jobs /

NEET 2021 WILL NOT BE POSTPONED NTA DG VINEET JOSHI NS

NEET 2021: నీట్ ఎగ్జామ్ వాయిదా పడుతుందా? క్లారిటీ ఇచ్చిన NTA.. వివరాలివే

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET Exams Update: నీట్ ఎగ్జామ్(NEET Exam) వాయిదా వేయాలంటూ విద్యార్థుల(Students) నుంచి వస్తున్న డిమాండ్ పై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) స్పందించింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనా నేపథ్యంలో వాయిదా పడిన అనేక పరీక్షలను ప్రస్తుతం నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ వ్యాప్తంగా అనేక ప్రవేశ పరీక్షలు ఇప్పటికే నిర్వహించగా.. మరి కొన్ని పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో నీట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు గతంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) షెడ్యూల్ విడుదల చేసింది. అయితే ఈ పరీక్షను వాయిదా వేయాలని విద్యార్థుల నుంచి విపరీతమైన డిమాండ్ వచ్చింది. దీంతో పరీక్ష వాయిదా పడడం ఖాయమన్న ప్రచారం కూడా సాగింది. ఈ అంశంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) డైరెక్టర్ జనరల్ స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ NEET 2021 పరీక్షను వాయిదా వేసే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు.

    అయితే విద్యార్థులు మాత్రం పరీక్షను వాయిదా వేయాల్సిందేనని కోరుతున్నారు. నీట్ పరీక్షకు దగ్గరలో అనేక పరీక్షలు షెడ్యూల్ కావడంతో ఈ డిమాండ్ వస్తుంది. నీట్ 2021 పరీక్ష తేదీకి సమీపంలో ఉన్న వివిధ ఎగ్జామ్స్ ఇవే..
    -నీట్(NEET): సెప్టెంబర్ 12
    NEET 2021: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. OMR షీట్ల విషయంలో NTA కీలక సూచనలు.. తెలుసుకోండి

    -CBSE Class 12 ఇంప్రూవ్ మెంట్, కంపార్ట్మెంట్ పరీక్షలు: ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 25 వరకు
    -ICAR AIEEA 2021 UG: సెప్టెంబర్ 7, 8, 13
    -Karnataka CoMEDK: సెప్టెంబర్ 14
    -Odisha JEE: సెప్టెంబర్ 6 నుంచి 18
    NEET, JEE అభ్యర్థులకు అలర్ట్.. ఈ సారి ర్యాంకుల కేటాయింపు విధానంలో మార్పులు చేసిన NTA.. వివరాలివే

    ఇందులో ముఖ్యంగా ఐసీఏఆర్(ICAR) పరీక్ష సెప్టెంబర్ 13న అంటే నీట్ ఎగ్జామ్ మరుసటి రోజు ఉంది. అయితే ICAR పరీక్ష రాసిన మరుసటి రోజే నీట్ ఎగ్జామ్ కు హాజరు కావడం ఇబ్బందిగా ఉంటుందని అభ్యర్థులు చెబుతున్నారు.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exams, NEET 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు