• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NEET 2021 UPDATES ON NEET EXAM DATE NOTIFICATION RELEASE DATE NUMBER OF ATTEMPTS NS

NEET 2021: నీట్ పరీక్ష అప్పుడేనా? తేదీల ప్రకటనపై ఆలస్యం ఎందుకు?.. పూర్తి వివరాలివే..

NEET 2021: నీట్ పరీక్ష అప్పుడేనా? తేదీల ప్రకటనపై ఆలస్యం ఎందుకు?.. పూర్తి వివరాలివే..

ప్రతీకాత్మక చిత్రం

NEET 2021: లాక్ డౌన్ అనంతరం అన్ని పరీక్షల తేదీలపై క్లారిటీ వచ్చినా.. ఇంకా నీట్ పరీక్ష తేదీల విషయం మాత్రం ఇంకా తేలడం లేదు. పరీక్ష తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారు? ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుంది? అన్న వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    లాక్ డౌన్ అనంతరం అన్ని పరీక్షల తేదీలపై క్లారిటీ వచ్చినా.. ఇంకా నీట్ పరీక్ష తేదీల విషయం మాత్రం ఇంకా తేలడం లేదు. ఇటీవల జేఈఈ మెయిన్ పరీక్ష తేదీలు కూడా విడుదలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో NEET పరీక్ష తేదీలపై సైతం ప్రకటన వస్తుందని విద్యార్థులు ఆశించినా ఇంకా ఆ వివరాలు వెలువడలేదు. పరీక్ష ఎప్పుడు ఉంటుంది? ఎన్ని సార్లు ఉంటుందన్న అంశంపై ఇంకా విద్యార్థుల్లో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈ ప్రకటన ఎందుకు ఆలస్యం అవుతుందనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. ఈ అంశంపై విద్యా మంత్రిత్వ శాఖ, ఆరోగ్య శాఖ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) మధ్య చర్యలు జరిగాయి. అయితే విద్యార్థుల నుంచి వచ్చిన వినతులతో విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖను పరీక్షను ఆన్లైన్లో, ఒకటి కంటే ఎక్కువ సార్లు నిర్వహించడం తదితర  అంశాలను పరిశీలించాలని కోరారు. అయితే ఈ విషయంపై ఇంకా నిర్ణయం జరగలేదు.

    అయితే.. ఆరోగ్య మంత్రిత్వ శాఖ సైతం ఈ విషయాలను పరిగణలోకి తీసుకుందని తెలుస్తోంది. నేషనల్ మెడికల్ కమిషన్(NMC) వద్ద ఈ విషయం పెండింగ్ లో ఉన్నట్లు సమాచారం. మెడికల్ ఎడ్యుకేషన్ NMC పరిధిలోకి వస్తుంది. పరీక్ష విధానం, సిలబస్ తదితర వివరాలపై నిర్ణయం తీసుకునే అధికారం వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖకు ఉంటుంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కేవలం పరీక్షను మాత్రం నిర్వహిస్తుంది. అయితే ఈ విభాగాల మధ్య ఏకాభిప్రాయం రాకపోవడంతోనే పరీక్ష నిర్వహణపై ప్రకటనకు ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే జూలైలో పరీక్ష ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే తేదీపై మాత్రం ఇంకా ప్రకటన రాలేదు.

    ఎన్ని అటెంప్ట్స్ ఉంటుంది?
    JEE Main 2021 పరీక్షను నాలుగు సార్లు నిర్వహించనున్నట్లు NTA ప్రకటించినప్పటి నుంచి NEET పరీక్షను సైతం ఒకటి కన్నా ఎక్కువ సార్లు నిర్వహిచాలని విద్యార్థుల నుంచి విద్యాశాఖకు వినతులు వస్తున్నాయి. అయితే ఈ అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు.
    Published by:Nikhil Kumar S
    First published: