సెప్టెంబర్ 12, 2021న నేషనల్ జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) జరుగనుంది. ఈ నేపథ్యంలో విద్యార్థులకు నియమ నిబంధనల ప్రకారం పరీక్షకు మూడు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 9న నీట్ అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల్లో రవాణా, పలు చోట్ల కర్ఫ్యూలు ఉన్నాయి. విద్యార్థులు పరీక్ష కేంద్రానికి చేరుకొనేందుకు 3 రోజుల సమయం సరిపోకపోవచ్చని పరీక్ష నిర్వహించే ఎన్టీఏ భావించింది. ఈ నేపథ్యం హాల్ టికెట్లను ముందు ఇవ్వకుండా పరీక్ష కేంద్రం మాత్రం విద్యార్థి తెలుసుకొనేలా ఏర్పాటు చేసింది. దీని ద్వారా పరీక్ష రాసే విద్యార్థులు తమ పరీక్షా కేంద్రాన్ని తెలసుకోనే అవకాశం ఉంది. దీని ద్వారా పరీక్ష రోజున సులభం సెంటెర్కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవచ్చు.
డౌన్లోడ్ చేసుకొండి ఇలా..
వెబ్సైట్లో అడ్వాన్స్ ఇన్ఫరమేషన్ ఆఫ్ సిటీ సెంటర్ లింక్‌ను క్లిక్ చేయండా.
అనంతరం విద్యార్థి నీట్-2021 దరఖాస్తులో ఇచ్చిన పుట్టిన తేదీ అనంతరం పాస్ వర్డను టైప్ చేయగానే మీ పరీక్షా కేంద్రం సమాచారం మీకు లభిస్తుంది.
దేశీయ విద్యార్థులు మాత్రమే కాకుండా విదేశీ విద్యార్థులకు కూడా ఈ అవకాశం కల్పించనున్నారు. ప్రస్తుతం విదేశీ విద్యార్థుల కోసం దుబాయ్‌లో పరీక్ష కేంద్రం ఏర్పాటు చేశారు. తమిళనాడు విద్యార్థుల కోసం అదనంగా చెంగల్పేట్, విరుధునగర్, దిండిగల, తిరుప్పూర్ ప్రాంతాల్లో అదనంగా పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ కారణంగా పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల భద్రతను దృష్టిలో పెట్టుకొని అన్ని ఏర్పాట్లు చేసినట్టు నీట్ నిర్వహకులు తెలిపారు. ఈ ఏడాది నీట్ పరీక్షా కేంద్రాలు నిర్వహించే నగరాల 155 నుంచి 198కి పెంచినట్టు వెల్లడించారు.
పరీక్ష సెంటర్ తెలుసుకొనేందుకు - క్లిక్ చేయండి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: NEET 2021