నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( National Eligibility cum Entrance Test) 2021 ఫలితాలు అక్టోబర్-చివరి లేదా నవంబర్ ప్రారంభంలో ప్రకటించే అవకాశం ఉందని అధికార వర్గాల నుంచి సమాచారం వస్తోంది. అన్ని అనుకూలంగా జరిగితే నీట్ స్కోర్ కార్డులను దీపావళి కానుకగా పొందవచ్చని మెడికల్ స్టూడెట్స్ సంబుర పడుతున్నారు. అలాగే ఫెస్-2 రిజిస్ట్రేషన్ ప్రక్రియ అక్టోబర్ 26, 2021 వరకు కొనసాగుతుందని విద్యార్థులు పేర్కొంటున్నారు. నీట్ (NEET)లో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కులు 50 పర్సంటైల్ అయితే, కళాశాలల్లో ప్రవేశం పొందడానికి అవసరమైన మార్కులు ప్రతి సంవత్సరం అలాగే కళాశాల నుంచి కళాశాలకు మారుతూ ఉంటాయి.
గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం మార్కులు తక్కువగా ఉండవచ్చని పలువురు నిపుణులు అంచనా వేస్తున్నారు. 2020లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కటాఫ్ స్కోర్‌లు 720-147 కాగా ఉంది. షెడ్యూల్డ్ కులం, షెడ్యూల్డ్ తెగ అంతే కాకుండా ఇతర వెనుకబడిన తరగతుల విద్యార్థులకు 146-113 స్కోర్లు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో నాలుగేళ్లుగా నీట్ కటాఫ్ వివరాలు ఎలా ఉన్నాయో పరిశీలిద్దాం..
NEET కట్-ఆఫ్ స్కోర్లు 2020
జనరల్ - 720-147
SC, ST, OBC - 146-113
జనరల్ అండ్ PH - 146-129
OBC అండ్ PH - 128-113
SC అండ్ PH - 128-113
ST అండ్ PH - 128-113
NEET కట్-ఆఫ్ స్కోర్లు 2019
జనరల్ - 701-134
SC, ST, OBC - 133-107
జనరల్ మరియు PH - 133-120
SSC Recruitment 2021 : దరఖాస్తు చేశారా..? పది ఇంటర్ విద్యార్హతతో 1,775 ఉద్యోగాలు
ST మరియు PH - 133-120
SC మరియు PH - 133-120
OBC మరియు PH - 133-120
NEET కట్-ఆఫ్ స్కోర్లు 2018
జనరల్ - 691-119
SC, ST, OBC - 118-96
జనరల్ మరియు PH - 118-107
ST మరియు PH - 106-96
SC మరియు PH - 106-96
OBC మరియు PH - 106-96
NEET కట్-ఆఫ్ స్కోర్లు 2017
జనరల్ - 697-131
SC, ST, OBC - 130-107
జనరల్ మరియు PH - 130-118
OBC మరియు PH - 130-107
SC మరియు PH - 130-107
ST మరియు PH - 130-107
NEET కట్-ఆఫ్ స్కోర్లు 2016
SBI Recruitment 2021 : డిగ్రీ అర్హతతో 2056 ఉద్యోగాలు.. దరఖాస్తుకు రెండు రోజులే అవకాశం
జనరల్ - 685 – 145
SC, ST, OBC - 678 - 118
జనరల్ మరియు PH - 474 - 131
OBC మరియు PH - 510 - 118
SC మరియు PH - 415 - 118
ST మరియు PH - 339 - 118
రెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ (DGHS) మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (MCC) తరపున ఆల్ ఇండియా కోటా (AIQ) సీట్లకు NEET కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది. మొత్తం, ప్రతి కళాశాలలో 15% సీట్లు AIQ కొరకు అందించబడతాయి, అయితే, మిగిలిన 85% సీట్లు రాష్ట్రం విద్యార్థులకు కేటాయిస్తారు. అంతే కాకుండా కట్ ఆఫ్ అనేది పరీక్షకు హాజరైన విద్యార్థుల సంఖ్య, సీట్ల నిష్పత్తిపై ఆధారపడి ఉంటుంది. సెప్టెంబర్ 12 న నిర్వహించిన నీట్ 2021 కోసం 16 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యారు, ఇంకా, ఈ సంవత్సరం సీట్ల సంఖ్య కూడా పెరిగింది మరియు క్లిష్టత స్థాయి పెరిగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Medical colleges, NEET 2021, Results