Home /News /jobs /

NEET 2021 NTA RELEASES INSTRUCTIONS TO FILL OMR SHEET HERE DETAILS NS

NEET 2021: నీట్ అభ్యర్థులకు అలర్ట్.. OMR షీట్ల విషయంలో NTA కీలక సూచనలు.. తెలుసుకోండి

 (ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

సెప్టెంబర్ 12న నీట్ పరీక్షను నిర్వహించేదుకు NTA ఏర్పాట్లు చేసింది. ఈ నేపథ్యంలో ఓఎంఆర్ షీట్లను నింపడంపై కీలక సూచనలు చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

    కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా అనేక ప్రవేశ పరీక్షలను అధికారులు నెలల పాటు వాయిదా వేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో ఆ పరీక్షలన్నింటినీ నిర్వహిస్తున్నారు అధికారులు. సాధ్యమైనంత త్వరగా ఆ పరీక్షలకు సంబంధించిన కౌన్సెలింగ్ లను సైతం పూర్తి చేసి అడ్మిషన్ల ప్రక్రియను పూర్తి చేయాలని యోచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నీట్ 2021 పరీక్షను సెప్టెంబర్ 12న నిర్వహించనున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(NTA) తెలిపింది. తాజాగా పరీక్ష సందర్భంగా విద్యార్థులు OMR షీట్ ను ఎలా నింపాలన్న అంశంపై మార్గదార్శకాలను విడుదల చేసింది. నమూనా OMR షీట్ ను అధికారిక వెబ్ సైట్లో అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. విద్యార్థులు ఓఎంఆర్ షీట్ ను కేవలం బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ తోనే నింపాలని సూచించారు. ఓఎంఆర్ షీట్లను కంప్యూటర్ సాఫ్ట్ వేర్ తో మూల్యాంకనం చేయనున్నట్లు తెలిపారు. అయితే సరిగా నింపిన బ్లాక్ కలర్ బబుల్స్ ను మాత్రమే సాఫ్ట్ వేర్ గుర్తిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్షకు ముందుగా అధికారిక వెబ్ సైట్లో అప్ లోడ్ చేసిన సూచనలను పూర్తిగా చదవాలని సూచించారు.
    NEET-PG 2021: నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్.. NBE కీలక ప్రకటన.. వివరాలివే
    పీజీ చేస్తున్నారా.. అయితే స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోండి

    ఇతర వివరాలు..
    నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ త్వరలోనే NEET UG 2021కి సంబంధించిన అడ్మిట్ కార్డులను విడుదల చేయనుంది. అభ్యర్థులు అప్ డేట్స్ కోసం ఎప్పటికప్పుడు అధికారిక వెబ్ సైట్ ను సందర్శించాలని అధికారులు సూచించారు.

    ఇదిలా ఉంటే.. సెప్టెంబ‌ర్ 12, 2021న జరగాల్సిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్‌) జ‌రుగ‌నుంది. ఈ నేప‌థ్యంలో విద్యార్థుల‌కు నియ‌మ నిబంధ‌న‌ల ప్ర‌కారం పరీక్షకు మూడు రోజుల ముందు అంటే సెప్టెంబర్ 9న నీట్ అడ్మిట్ కార్డులు జారీ చేయబడతాయి. ప్ర‌స్తుతం ఉన్న క‌రోనా ప‌రిస్థితుల్లో రవాణా, ప‌లు చోట్ల క‌ర్ఫ్యూలు ఉన్నాయి. విద్యార్థులు ప‌రీక్ష కేంద్రానికి చేరుకొనేందుకు 3 రోజుల స‌మ‌యం స‌రిపోక‌పోవ‌చ్చ‌ని ప‌రీక్ష నిర్వ‌హించే ఎన్‌టీఏ భావించింది. ఈ నేప‌థ్యంలో హాల్ టికెట్ల‌ను ముందు ఇవ్వ‌కుండా ప‌రీక్ష కేంద్రం మాత్రం విద్యార్థి తెలుసుకొనేలా ఏర్పాటు చేసింది. దీని ద్వారా ప‌రీక్ష రాసే విద్యార్థులు త‌మ ప‌రీక్షా కేంద్రాన్ని తెల‌సుకోనే అవ‌కాశం ఉంది. దీని ద్వారా ప‌రీక్ష రోజున సుల‌భం సెంటర్‌కు వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకోవ‌చ్చు. ఇందు కోసం అధికారులు neet.nta.nic.in వెబ్  సైట్ ను సందర్శించాల్సి ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: Exam Tips, Exams, NEET 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు