హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2021 Counselling: త్వ‌ర‌లో నీట్ కౌన్సెలింగ్‌.. ఎన్‌టీఏ తాజా ప్ర‌క‌ట‌న‌

NEET 2021 Counselling: త్వ‌ర‌లో నీట్ కౌన్సెలింగ్‌.. ఎన్‌టీఏ తాజా ప్ర‌క‌ట‌న‌

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2021 Counselling | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( National Eligibility cum Entrance Test) 2021 కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అంశానిక సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency), తన తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఇంకా చదవండి ...

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ ( National Eligibility cum Entrance Test) 2021 కౌన్సెలింగ్ త్వరలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ అంశానిక సంబంధించి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency), తన తాజాగా నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఇప్ప‌టికే అభ్యర్థులందరికీ ఆల్ ఇండియా ర్యాంక్ (AIR) అందించింది. అంతే కాకుండా కేంద్ర-రాష్ట్ర ప్ర‌భుత్వాలు కూడా కు చెందిన అధికారులు కూడా వారి ప‌రిధిలో MBBS/BDS కోర్సులలో ప్రవేశాల కోసం కళాశాలల నీట్ ర్యాంక్ ఆధారంగా మెరిట్ జాబితాను సిద్ధం చేస్తారని టెస్టింగ్ ఏజెన్సీ పేర్కొంది. నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ ఇచ్చిన అధికారిక ప్ర‌క‌ట‌న ఇలా ఉంది. ఇప్ప‌టికే ప‌రీక్ష రాసిన అభ్య‌ర్థుల‌కు ఆల్ ఇండియా ర్యాంక్‌ను అందించామ‌ని పేర్కొంది.

కేంద్ర‌, రాష్ట్రాలు వారి ప‌రిధిలోకి వ‌చ్చే సీట్లు, కళాశాల‌ల‌కు సంబంధించిన మెరిట్ జాబితాను సిద్ధం చేస్తున్నాయ‌ని తెలిపారు. రాష్ట్రాల వారీగా వ‌చ్చే మెరిట్‌పై ఎన్‌టీఐకు సంబంధం లేద‌ని తెలిపింది. ఎన్‌టీఏ డేటాలో మార్పు ఉండ‌ద‌ని స్ప‌ష్టం చేసింది.

LTC Recruitment 2021: ల్యాబొరేట‌రీస్ టెక్స్‌టైల్ క‌మిటీలో ఉద్యోగాలు.. అర్హ‌త‌లు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌


DGHS, రాష్ట్రాల వైద్య విద్యా డైరెక్టరేట్‌లు కౌన్సెలింగ్ రౌండ్‌లకు అర్హత సాధించిన వారు సంబంధిత కౌన్సెలింగ్ అధికారులతో ఫార్మాలిటీలను పూర్తి చేయాల‌ని సూచించింది. “కౌన్సెలింగ్ వివరాలు, షెడ్యూల్ మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్‌లలో అందుబాటులో ఉంటాయ‌ని తెలిపింది.

దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎదురుచూస్తోన్న నీట్​ యూజీ కౌన్సెలింగ్ (NEET Counselling 2021)​ త్వరలోనే ప్రారంభం కానుంది. ఈ కౌన్సెలింగ్​ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ((Medical Counselling Committee)) నిర్వహించనుంది. ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్ www.mcc.nic.in ద్వారా నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించనుంది.

విద్యార్థులు ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనే ముందు తమ పేర్లు నమోదు చేసుకోవాలి. అనంతరం ప్రాధాన్యతా క్రమంలో కళాశాల, కోర్సులను ఎంపిక చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ తర్వాత అభ్యర్థుల స్కోర్, కేటగిరీని బట్టి కళాశాలను కేటాయిస్తారు. కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన విద్యార్థులు అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి, గడువు తేదీలోపు ఫీజు చెల్లించి సీటును కన్ఫర్మ్​ చేసుకోవాలి.

ప్రతి సంవత్సరం విద్యా మంత్రిత్వ శాఖ (Ministry of Education) దేశవ్యాప్తంగా ఎన్​ఐఆర్​ఎఫ్​ ర్యాంకింగ్‌ (NIRF rankings) లను విడుదల చేస్తుంది. నీట్ కౌన్సెలింగ్ నేపథ్యంలో.. నేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ర్యాంకింగ్ ఫ్రేమ్‌వర్క్ (NIRF)-2021 వెల్లడించిన టాప్ ఇండియన్ మెడికల్ కాలేజీ (Top Medical colleges)ల జాబితాను పరిశీలిద్దాం.

ఎన్​ఐఆర్​ఎఫ్​- 2021 టాప్ 10 మెడికల్​ కాలేజీలు

ర్యాంక్ 1: ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS), న్యూ ఢిల్లీ

ర్యాంక్ 2: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER), చండీగఢ్

Jobs in PhonePe : మ్యూచ్‌వ‌ల్ ఫండ్ రంగంలో ఉద్యోగ అవ‌కాశాలు.. అప్లికేష‌న్ ప్రాసెస్‌, అర్హ‌త‌లు


ర్యాంక్ 3: క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూరు

ర్యాంక్ 4: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్స్, బెంగళూరు

ర్యాంక్ 5: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, లక్నో

ర్యాంక్ 6: అమృత విశ్వ విద్యాపీఠం

ర్యాంక్ 7: బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి

ర్యాంక్ 8: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి

ర్యాంక్ 9: కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో

ర్యాంక్ 10: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్

ఎన్​ఐఆర్​ఎఫ్​–2021 ప్రకారం టాప్ 10 డెంటల్ కాలేజీలు

ర్యాంక్ 1: మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఉడిపి

ర్యాంక్ 2: డాక్టర్ D. Y. పాటిల్ విద్యాపీఠ్, పూణే

ర్యాంక్ 3: సవీత ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ అండ్ టెక్నికల్ సైన్సెస్, చెన్నై

ర్యాంక్ 4: మౌలానా ఆజాద్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, ఢిల్లీ

ర్యాంక్ 5: కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో

ర్యాంక్ 6: AB శెట్టి మెమోరియల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మంగళూరు

ర్యాంక్ 7: మణిపాల్ కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్, మంగళూరు

ర్యాంక్ 8: శ్రీ రామచంద్ర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై

ర్యాంక్ 9: ఎస్​డీఎం కాలేజ్ ఆఫ్ డెంటల్ సైన్సెస్ & హాస్పిటల్, ధార్వాడ్

ర్యాంక్ 10: ఎస్​ఆర్​ఎమ్​ డెంటల్ కాలేజ్, చెన్నై

నీట్​–2021 ఫలితాలు నవంబర్ 1న విడుదలయ్యాయి. మొత్తం 16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకోగా.. 95 శాతం కంటే ఎక్కువ మంది హాజరయ్యారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు మొదటి ర్యాంక్ సాధించారు.

First published:

Tags: EDUCATION, Medical colleges, NEET, NEET 2021

ఉత్తమ కథలు