నీట్ పరీక్షా విధానం ఈ సంవత్సరం నుంచి కొద్దిగా మారనుంది. ఈ సంవత్సరం నుంచి విద్యార్థులకు ఎక్కువ ఛాయిస్ ఇచ్చేందుకు ఎక్కువ ప్రశ్నలు అందించనున్నారు. అయితే విద్యార్థులు సమాధానం అందించాల్సిన ప్రశ్నల సంఖ్య మాత్రం అలాగేఉంటుంది. ఇంతకుముందు ఇచ్చిన సమయంలోనే ఇప్పుడు ఎక్కువ ప్రశ్నలను చదివి వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి ప్రశ్నకు ఇప్పుడు నిమిషం కంటే తక్కువ సమయం ఉంటుంది. ఇంతకుముందు ఈ పరీక్షలో 180 ప్రశ్నలు ఉంటే ఇప్పుడు ఆ ప్రశ్నల సంఖ్య 200గా మార్చారు. వీటిని 180 ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు అందించాల్సి ఉన్నా.. అన్నింటినీ చదివి వచ్చిన వాటిని సమాధానం చెప్పడానికి ప్రతి ప్రశ్నకు చాలా తక్కువ సమయం కేటాయించాల్సి ఉంటుంది.
ప్రతి పరీక్షలో ముఖ్యంగా ప్రశ్నలను ఎంచుకోవడం, వాటికి వేగంగా సమాధానాలను గుర్తించడం చాలా ముఖ్యమైనది. అందుకే ఏ ప్రశ్నలను ఎంచుకోవాలో.. వేటిని ఎంచుకోకూడదో వేగంగా నిర్ణయించుకోవాలి. ఏ ప్రశ్నలు ఎంచుకోవాలో వేగంగా నిర్ణయించుకునే విద్యార్థులే మంచి మార్కులు సాధించగలుగుతారు. దీనికోసమే ముందుగా ప్రాక్టీస్ టెస్టులు వీలైనన్ని అటెంప్ట్ చేయడం మంచిదని కెరీర్ నిపుణులు వెల్లడిస్తున్నారు. చాలామంది విద్యార్థులు ఈ మార్పు ఆఖరి నిమిషంలో చేయడం మంచిది కాదని.. పరీక్షలు వాయిదా వేయాలని కోరుతున్నారు. అయితే ఈ మార్పును విద్యార్థులు తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు వెల్లడిస్తున్నారు.
పరీక్షల్లో మార్పులు చేయడం పట్ల ఎప్పుడూ అందరూ నెగటివ్ గానే స్పందిస్తుంటారని.. కానీ విద్యార్థులు సరైన స్ట్రాటజీతో దాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.ఇందుకోసం వీలైనన్ని ఎక్కువ మోడల్ పేపర్స్ సాధన చేయాలని సలహాలిస్తున్నారు.పరీక్షా పత్రాలను తక్కువ సమయంలో సాధన చేసేందుకుప్రయత్నించాలని చెబుతున్నారు.ఒకే ప్రశ్నపై ఎక్కువ సమయాన్ని కేటాయించడం సరికాదని వారు వెల్లడిస్తున్నారు. ముందుగా సులువుగా ఉన్న ప్రశ్నలను ఎంచుకోవాలి. వాటిని పూర్తి చేసిన తర్వాత కష్టంగా ఉన్న ప్రశ్నలు ప్రయత్నించాలి. ముందు అన్ని కేటగిరీల్లో సులువైన ప్రశ్నలన్నింటికీ సమాధానం ఇచ్చినతర్వాత మీ బలాల ఆధారంగా ఏ సబ్జెక్టు మీకు కష్టమో దానికి ఎక్కువ సమయాన్ని కేటాయించుకోవాలి.
ముందు బాగా వచ్చిన సబ్జెక్టుతో ప్రారంభించడం వల్ల ఎక్కువ మార్కులు పొందే వీలుంటుంది. అంతేకాదు.. ప్రతి సబ్జెక్టులో వారికి ఏ టాపిక్స్ పై పట్టు ఉందో వాటిని ముందుగా వేగంగా పూర్తి చేసి ఆ తర్వాత మిగిలిన టాపిక్స్ ఎంచుకోవాలి. ఛాయిస్ ఉండడం వల్ల కొన్ని ఛాప్టర్లను వదిలేసినా ఎక్కువ మార్కులు సాధించే వీలుంటుంది. ఈ విధానంతోవిద్యార్థులకుమంచి ఫలితాలుంటాయి.కాబట్టి విద్యార్థులు టెన్షన్ పడకుండా ప్రిపేర్ అవ్వాలని నిపుణులు సలహాలిస్తున్నారు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.