హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2021 MDS: నీట్ ఎండీఎస్ అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

NEET 2021 MDS: నీట్ ఎండీఎస్ అభ్యర్థులకు అలర్ట్.. కౌన్సెలింగ్ గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మెడికల్ కళాశాల్లో​ డెంటల్​ మాస్టర్​ డిగ్రీ (ఎండీఎస్​) ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్​ ప్రక్రియ ప్రారంభమైంది. నీట్​ ఎండీఎస్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ, తీసుకెళ్లాల్సిన డాక్సుమెంట్ల వివరాలు మీ కోసం..

దేశవ్యాప్తంగా వివిధ మెడికల్ కళాశాల్లో​ డెంటల్​ మాస్టర్​ డిగ్రీ (ఎండీఎస్​) ప్రవేశాలకు సంబంధించి కౌన్సిలింగ్​ ప్రక్రియను ప్రారంభించింది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ (ఎంసీసీ). నీట్​ ఎండీఎస్​ ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు ఈ కౌన్సెలింగ్​ నిర్వహిస్తోంది. ఆయా అభ్యర్థులు www.mcc.nic.in వెబ్​సైట్​లో మాస్టర్ ఆఫ్ డెంటల్ సర్జరీ (MDS) అడ్మిషన్​ కౌన్సెలింగ్​ కోసం రిజిస్ట్రేషన్​ చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు వ్యాలిడ్​ ఈ–మెయిల్ ఐడీ, మొబైల్ నంబర్​తోనే రిజిస్ట్రేషన్​ చేసుకోవాలి. దీనికి సంబంధించి కమిటీ తన అధికారిక వెబ్‌సైట్‌లో షెడ్యూల్‌ను ఇప్పటికే విడుదల చేసింది. షెడ్యూల్ ప్రకారం, రిజిస్ట్రేషన్​ విండో ఆగస్టు 24 వరకు ఓపెన్​ చేసి ఉంటుంది. నీట్​ ఎండీఎస్​ కౌన్సెలింగ్​ను మొత్తం రెండు రౌండ్లలో నిర్వహిస్తారు. నీట్​ ఎండీఎస్​ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ, తీసుకెళ్లాల్సిన డాక్సుమెంట్లను పరిశీలిద్దాం.

NEET-PG 2021: నీట్ పీజీ అభ్యర్థులకు అలర్ట్.. NBE కీలక ప్రకటన.. వివరాలివే

కౌన్సెలింగ్​ రిజిస్ట్రేషన్​ ప్రాసెస్..​

1. విద్యార్థులు ఎంసీసీ అధికారిక వెబ్‌సైట్‌ www.mcc.nic.in ను సందర్శించాలి.

2. హోమ్‌పేజీకి వెళ్లి ఎండీఎస్​ కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ 2021 లింక్‌పై క్లిక్ చేయండి.

3. ఆ తర్వాత, వ్యాలిడ్​​ మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడితో సహా అవసరమైన అన్ని వివరాలను నమోదు చేయండి.

4. రిజిస్ట్రేషన్ ఫీజు రూ .1000 చెల్లించి సబ్​మిట్ చేయండి. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మీ లాగిన్ వివరాలను సేవ్​ చేసుకోండి.

విజయవంతంగా రిజిస్ట్రేషన్ పూర్తి చేసిన తర్వాత, అందుబాటులో ఉన్న కళాశాల, కోర్సును ప్రాధాన్యతల క్రమంలో ఎంచుకోవాలి.

అవసరమయ్యే డాక్యుమెంట్స్..​

కౌన్సెలింగ్​కు హాజరయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా తమ అకడమిక్​, ఇతర సర్టిఫికెట్లను సబ్​మిట్​ చేయాల్సి ఉంటుంది. జిరాక్స్​తో పాటు ఒరిజినల్​ సర్టిఫికెట్లను కూడా తీసుకెళ్లాలి. ఏఏ సర్టిఫికెట్లు తీసుకెళ్లాలో చూద్దాం.

1. నీట్ ఎండీఎస్​​ ఎంట్రన్స్​ టెస్ట్​ అడ్మిట్ కార్డ్

2. నీట్​ ఎండీఎస్​ రిజల్ట్​/ర్యాంక్ లెటర్

3. ఎంబీబీఎస్​/బీడీఎస్​ 1, 2 & 3 వ సంవ్సరానికి సంబంధించిన ప్రొఫెషనల్ మార్క్స్​ మెమోలు.

4. ఎంబీబీఎస్​/బీడీఎస్​ డిగ్రీ సర్టిఫికెట్

5. ఇంటర్న్‌షిప్ కంప్లీషన్ సర్టిఫికెట్/ఇన్‌స్టిట్యూషన్ హెడ్ లేదా కాలేజీ నుండి అప్రోవల్ సర్టిఫికెట్

6. ఎంసీఐ లేదా డీసీఐ/స్టేట్ మెడికల్ లేదా డెంటల్ కౌన్సిల్ జారీ చేసిన పర్మనెంట్​/టెంపరరీ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్

7. హైస్కూల్/హయ్యర్ సెకండరీ సర్టిఫికెట్/పుట్టిన తేదీ రుజువు కోసం జనన ధృవీకరణ పత్రం

8. ఐడీ ప్రూఫ్​ కోసం పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడి, పాస్‌పోర్ట్ లేదా ఆధార్ కార్ట్​లలో ఏదైనా ఒకటి సబ్​మిట్​ చేయాలి.

9.కాస్ట్ సర్టిఫికెట్ (జనరల్​ కేటగిరీకి తప్ప మిగతా వారికి)

రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత, విద్యార్థులు తమ కోర్సు, కాలేజీని ఎంచుకునే అవకాశం ఉంటుంది. కాలేజీ, కోర్సును ఎంపిక చేసుకోవడానికి ఆగస్టు 24 వరకు అవకాశం ఉంటుంది. అభ్యర్థుల స్కోర్, ఎంపిక చేసుకన్న కాలేజ్​, కేటగిరీని బట్టి సీట్ల కేటాయింపు ఉంటుంది. ఆగస్టు 25న సీట్లు కేటాయింపు జాబితాను వెబ్​సైట్​లో అప్‌లోడ్ చేస్తారు.

Published by:Nikhil Kumar S
First published:

Tags: Exams, NEET, NEET 2021

ఉత్తమ కథలు