మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) త్వరలో తన అధికారిక వెబ్సైట్ mcc.nic.in లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. నీట్ 2021లో ఉత్తీర్ణత సాధించిన లక్షలాది మంది విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో (Medical Colleges) అడ్మిషన్ కోసం కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ కౌన్సెలింగ్‌ను మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ నిర్వహిస్తుంది. అయితే కౌన్సెలింగ్ (Counselling) ఎప్పుడు నిర్వహిస్తారో స్పష్టమైన తేదీలు ప్రకటించనప్పటికీ అభ్యర్థుల కోసం పలు సలహాలను ఎంసీసీ (MCC) విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలలో (Guidelines) నీట్ అభ్యర్థులు నకిలీ ఏజెంట్లతో జాగ్రత్తగా ఉండాలని కోరింది. కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ (Registration) ప్రక్రియ కోసం ఏజెంట్ (Agent)ను నియమించుకోకుండా అభ్యర్థులే స్వయంగా దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేసుకోవాలని సూచించింది.
నీట్ కౌన్సెలింగ్ ప్రారంభించే ముందు, కమిటీ, వెబ్సైట్(Website)కు సంబంధించి పూర్తి సమాచారాన్ని అందిస్తుందని తెలిపింది. మోసపూరిత వెబ్సైట్లు ఉంటే ఎంసీసీ పేర్కొంటుందని తెలిపింది. ఎవరైన ఎంసీసీ దృష్టికి తీసుకొస్తే తప్పుడు వెబ్సైట్ నిర్వహకులపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేస్తామని స్పష్టం చేసింది. అంతే కాకుండా విద్యార్థుల్లో ఉండే పలు సందేహాలను నివృత్తి చేసింది.
- ఉత్తీర్ణులైన విద్యార్థులకు DGHS, MCC ద్వారా ఎటువంటి లేఖలు ఇవ్వబడవని తెలిపింది.
- MCC ద్వారా సీట్లు కేటాయించబడిన అభ్యర్థులు MCC వెబ్సైట్ నుండి తాత్కాలిక కేటాయింపు లేఖలను డౌన్లోడ్ చేసుకోవాలి మరియు అడ్మిషన్ కోసం కేటాయించిన కళాశాలలలో నివేదించాలి.
- సీట్ల కేటాయింపుకు సంబంధించి MCC అధికారిక వెబ్సైట్ లేఖనే ప్రామాణికంగా తీసుకోవాలిని సూచించింది.
DGHS, MCC అభ్యర్థులకు మెరిట్, ఎంపికల ఆధారంగా MCC సాఫ్ట్వేర్ ద్వారా సీట్లను కేటాయిస్తుంది, దీనిని MCC వెబ్సైట్ నుండి విజయవంతమైన అభ్యర్థులు మాత్రమే డౌన్లోడ్ చేసుకోవచ్చు. కనీస అర్హత మార్కులను సాధించిన అభ్యర్థులు తప్పనిసరిగా తమ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులు NEET 2021 క్లియర్ చేయడానికి కనీసం 50 పర్సంటైల్ మార్కులు సాధించాలి. SC, STకి చెందిన వారు 40 పర్సంటైల్ మరియు PwD అభ్యర్థులు 45 పర్సంటైల్ సాధించాలని ఎంసీసీ పేర్కొంది.
NEET కౌన్సెలింగ్ 2021కు అవసరమైన పత్రాలు
- నీట్ 2021 అడ్మిట్ కార్డులు
- NEET 2021 ఫలితాలు లేదా ర్యాంక్ కార్డు
- 10వ తరగతి పాస్ సర్టిఫికేట్
- క్లాస్ 12 పాస్ సర్టిఫికేట్
Wipro Recruitment: గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్.. విప్రోలో ఉద్యోగాలు.. దరఖాస్తు విధానం
- ప్రభుత్వం జారీ చేసిన ఫోటో ID
- పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు
- కుల ధ్రువీకరణ పత్రం (అవసరం అయిన వారికి మాత్రమే)
నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను నిలిపివేత
మరోవైపు వైద్య కళాశాలల్లో ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కోటాపై నీట్ పీజీ కౌన్సెలింగ్‌ను నిలిపివేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో, యువ వైద్యులు కౌన్సెలింగ్ తేదీలను పదే పదే వాయిదా వేయడంపై తమ నిరాసను వ్యక్తం చేశారు. వారు #ExpediteNeetPGCounselling2021 అనే హ్యాష్‌ట్యాగ్‌తో ట్విట్టర్లోకి వెళ్లారు మరియు తేదీలను నిర్ణయించడానికి “తక్షణ నిర్ణయం” కోసం పిలుపునిచ్చారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Admissions, EDUCATION, Medical colleges, NEET 2021