దేశంలో కరోనా విజృంభన నేపథ్యంలో వైద్య విద్యా అర్హత పరీక్ష అయిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)ను నాలుగు నెలల పాటు వాయిదా వేసింది కేంద్ర ప్రభుత్వం. దీంతో 2021 ఆగస్టు 1న జరగాల్సిన ఈ పరీక్ష వాయిదా పడింది. ఈ పరీక్షను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టిఎ) పెన్- అండే పేపర్ మోడ్‌లో నిర్వహిస్తుంది. కాగా, కరోనా ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో ఈ పరీక్షను నిర్వహించనున్నందున ఎగ్జామ్ హాలులో అనుసరించాల్సిన మార్గదర్శకాలను విడుదల చేసింది. నీట్–2021 పరీక్షకు హాజరయ్యేవారు ఈ నియమ నిబంధనలను కచ్చితంగా పాటించాలి. ఒకవేళ అభ్యర్థులు ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే వారి అభ్యర్థిత్వాన్ని రద్దు చేస్తారు. అందువల్ల, అభ్యర్థులు పరీక్షా హాలులో అనుసరించాల్సిన నిబంధనలపై అవగాహన పెంచుకోవాలి. అవేంటో చూద్దాం.
* పరీక్షా హాల్లో అనుసరించాల్సిన నిబంధనలు
పరీక్ష ప్రారంభమయ్యే ముందు..
1. ప్రతి అభ్యర్థికి నిర్ణీత పరీక్షా కేంద్రం, రోల్ నంబర్ కేటాయించబడుతుంది. పరీక్షా హాల్ లోపలికి వెళ్లిన విద్యార్థులు తమకు కేటాయించిన సీటు వద్ద మాత్రమే కూర్చోవాలి.
2. పరీక్ష ప్రారంభానికి ముందే ఇన్విజిలేటర్ మీరు అనుసరించాల్సిన ముఖ్యమైన సూచనలను తెలియజేస్తారు.
3. ఆ తర్వాత మీకు సీల్ చేసిన పరీక్షా బుక్లెట్, OMR షీట్ అందించబడుతుంది.
4. పరీక్ష సమయం ప్రారంభమైన తర్వాతే విద్యార్థులు బుక్‌లెట్‌ను తెరవాల్సి ఉంటుంది.
5. మీకు కేటాయించిన బుక్‌లెట్‌లో ప్రిటింగ్ మిస్టేక్స్ లేకుండా అన్ని పేజీలు ఉన్నాయని నిర్ధారించుకోవాలి. ఏవైనా మిస్టేక్స్ ఉన్నట్లయితే, వెంటనే ఇన్విజిలేటర్‌కు తెలియజేయాలి.
6. నీట్ అడ్మిట్ కార్డు, పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్, ఐడి ప్రూఫ్, బాల్ పెన్ మాత్రమే పరీక్షా హాల్లోకి తీసుకెళ్లాలి.
* పరీక్ష సమయంలో..
1. ఇతర అభ్యర్థుల నుండి వస్తువులను తీసుకోవడం లేదా అందించడం అనుమతించబడదు.
2. పరీక్ష సమయం ముగిసే వరకు మిమ్మల్ని పరీక్షా హాలు నుండి బయటికి అనుమతించరు.
అటెండెన్స్ షీట్
1. మీకు ఇచ్చిన అటెండెన్స్ షీట్‌పై మీ పాస్‌పోర్ట్ సైజు ఫోటోగ్రాఫ్‌ను అతికించాలి. అలాగే, అటెండెన్స్ షీట్లో మీ పేరు ముందున్న గడిలో ఎడమ చేతి బొటనవేలు ముద్ర వేయాలి.
2. అటెండెన్స్ షీట్లో రెండుసార్లు సంతకం పెట్టాలని గుర్తుంచుకోవాలి. ఒకసారి పరీక్ష ప్రారంభంలో, మరోసారి ఆన్సర్ షీట్‌ని ఇన్విజిలేటర్‌కు సమర్పించే సమయంలో పెట్టాలి.
* పరీక్ష పూర్తయ్యాక..
1. పరీక్ష సమయం ముగిసాక మీకు ఇన్విజిలేటర్ తెలియజేస్తారు. సమయం పూర్తయిన తర్వాత సమాధానాలు గుర్తించడం మానేయాలి.
2. పరీక్ష పూర్తయ్యాక మీరు ఓఎంఆర్ షీట్‌తో పాటు ప్రశ్నపత్రాన్ని ఇన్విజిలేటర్‌కు అందజేయాలి.
* ఇలా చేస్తే మూడేళ్ల పాటు డిబార్..
ఎన్‌టిఎ మార్గదర్శకాల ప్రకారం, కింది పనులు చేసిన అభ్యర్థులు నీల్ పరీక్ష నుండి మూడేళ్లపాటు డిబార్ అవుతారు. వీటిని క్రిమినల్ యాక్టివిటీస్‌గా అధికారులు పరిగణిస్తారు.
1. పరీక్షా హాలు నుంచి ప్రశ్నపత్రం లేదా జవాబు పత్రాలను తీసుకెళ్లడం.
2. జవాబు పత్రం లేదా ప్రశ్నపత్రం చింపివేయడం.
3. జవాబు పత్రంపై కాకుండా ఇతర ప్రాంతల్లో సమాధానాలు రాయడం.
4. ఇతర విద్యార్థులను సమాధానాలు అగడటం లేదా వారికి చెప్పడం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.