• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NEET 2021 EXAM WILL BE HELD ON AUGUST 1 IN OFFLINE MODE WITH PEN AND PAPER NTA RELEASES OFFICIAL NOTICE FULL DETAILS HERE NK

NEET 2021: ఆగస్ట్ 1న ఆఫ్‌లైన్‌లో నీట్ ఎగ్జామ్... అధికారిక నోటీస్ రిలీజ్ చేసిన NTA

NEET 2021: ఆగస్ట్ 1న ఆఫ్‌లైన్‌లో నీట్ ఎగ్జామ్... అధికారిక నోటీస్ రిలీజ్ చేసిన NTA

NEET 2021: ఆగస్ట్ 1న ఆఫ్‌లైన్‌లో నీట్ ఎగ్జామ్... అధికారిక నోటీస్ రిలీజ్ చేసిన NTA (ప్రతీకాత్మక చిత్రం)

NEET 2021: ఈసారి నీట్ ఎగ్జామ్ పెన్, పేపర్‌తో జరగబోతోంది. NTA రిలీజ్ చేసిన నోటీస్‌లో పూర్తి వివరాలు తెలుసుకుందాం.

  • Share this:
    NEET 2021: జాతీయ అర్హత కమ్ ప్రవేశ పరీక్ష (National Eligibility cum Entrance Test - NEET 2021) నీట్ 2021... ఆగస్ట్ 1న జరగబోతోంది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ - NTA... నిన్న తన అధికారిక వెబ్‌సైట్ nta.ac.in లో నోటీస్ రిలీజ్ చేసింది. ఏటా 16 లక్షల మందికి పైగా అభ్యర్థులు... మెడికల్, డెంటర్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ రాస్తున్నారు. మరి నీట్ 2021కి సంబంధించిన పూర్తి వివరాల షెడ్యూల్ త్వరలోనే ntaneet.nic.in లో విడుదల కానుంది. ఐతే... ఈ పరీక్ష గురించి చెబుతూ... NTA కీలక విషయం తెలిపింది. ఈ ఎగ్జామ్‌ని ఆఫ్‌లైన్ విధానంలో ఒకే ఒక సారి ఈ సంవత్సరం నిర్వహిస్తామని తెలిపింది. మెడికల్, డెంటల్ కోర్సుల్లో అంటే BSMS, BUMS, BHMSలో అడ్మిషన్ల కోసం నిర్వహించే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్‌ను 11 లాంగ్వేజీల్లో నిర్వహిస్తామని తెలిపింది. వాటిలో ఇంగ్లీష్, హిందీ కూడా ఉన్నాయి. పరీక్షా విధానంలో మార్పులు ఉంటాయన్న ప్రచారానికి తెరదించుతూ... పరీక్షలో ఎలాంటి మార్పూ ఉండదని తెలిపింది.















    ఎగ్జామ్ జరిగే తేదీ
    నీట్ 2021 ఎగ్జామ్ ఆగస్ట్ 1, 2021 ఆదివారం
    రిజిస్ట్రేషన్ ప్రారంభం/అప్లికేషన్ విధానం త్వరలో రానున్న ప్రకటన

    ఈ ఎగ్జామ్ వివరాలు, సిలబస్, వయసు అర్హతలు, రిజర్వేషన్ వంటి పూర్తి వివరాల బులిటెన్‌ను... ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రక్రియ ప్రారంభం కాగానే... ntaneet.nic.in లో రిలీజ్ చేస్తామని NTA తెలిపింది. ఐతే... ఎప్పుడు రిలీజ్ చేసేదీ వివరాలు, తేదీ వెల్లడించలేదు.

    ఈ ఎగ్జామ్‌ రాయాలనుకునే అభ్యర్థులంతా... తరచూ అధికారిక వెబ్‌సైట్లు nta.ac.in ... ntaneet.nic.in లో చెక్ చేసుకుంటూ ఉండాలి. NEET ఎగ్జామ్ అధికారిక నోటీస్ వివరాల్ని మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. ఈ లింక్ (Link) క్లిక్ చెయ్యండి.

    ఇది కూడా చదవండి: Vegetarian Food: శాఖాహారమే శ్రేష్టం... మీకు కలిగే 5 ఆరోగ్య ప్రయోజనాలు

    NEET 2021 వివరాలు:
    నీట్ లేదా జాతీయ అర్హత కమ్ ప్రవేశ పరీక్షను... నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ లేదా NTV నిర్వహిస్తోంది. దీని ద్వారా ఇండియాలో MBBS, BDS కోర్సులకు అడ్మిషన్ లభిస్తుంది. ఇంగ్లీష్, హిందీ, ఉర్హూ సహా 8 భాషల్లో పెన్, పేపర్ విధానంలో ఈ పరీక్షను నిర్వహించబోతున్నారు. 2020 నుంచి అన్ని మెడికల్, డెంటల్ కోర్సుల్లో... AIIMS, JIPMER తో సహా... అన్నింటినీ NEET కిందకు తెచ్చారు. 2020లో దాదాపు 16 లక్షల మంది పరీక్ష రాసేందుకు రిజిస్టర్ అయ్యారు.
    Published by:Krishna Kumar N
    First published:

    అగ్ర కథనాలు