NEET 2021: నీట్ 2021 పరీక్షల రిజిస్ట్రేషన్ గడువు పెంచిన  NTA.. కొత్త షెడ్యూల్ ఇదే.. 

(ప్రతీకాత్మక చిత్రం)

మొట్టమొదటి సారిగా నీట్ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తోంది NTA. గతంలో ఉన్న భాషలతో పాటు తాజాగా మలయాళం, పంజాబీ కలుపుకొని 13 భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించనుంది.

  • Share this:
NEET-UG 2021 పరీక్ష కోసం దేశవ్యాప్తంగా ఎంతోమంది విద్యార్థులు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ పరీక్షల రిజిస్ట్రేషన్ తేదీని మరో వారం పాటు పొడిగించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA). ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఆగస్టు పదో తేదీ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఆన్ లైన్ లో పేమెంట్ చేయడానికి ఆగస్టు పదో తేదీ రాత్రి 11.50 నిమిషాల వరకు సమయాన్ని అందించింది. ఈ పరీక్ష కోసం అప్లై చేయాలనుకున్న వారు ఎన్‌టీఏ వెబ్ సైట్ neet.nta.nic.inను సందర్శించాల్సి ఉంటుంది. ఎన్‌టీఏ కల్పించిన ఈ అవకాశాన్ని అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ వివరాలను ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ ద్వారా వెల్లడించింది. "NEET-UG 2021 పరీక్షల అప్లికేషన్ గడువును ఆగస్టు 10, 2021 (05:00 PM) వరకు పొడిగిస్తున్నాం. అలాగే ఆన్ లైన్ పేమెంట్ ప్రక్రియ పూర్తి చేసేందుకు గడువును ఆగస్టు 10, 2021 (11:50 PM)వరకు పొడిగిస్తున్నాం. బీఎస్సీ ఆనర్స్, నర్సింగ్ విద్యార్థులతో పాటు ఇతర విద్యార్థులకు ఇది వర్తిస్తుంది" అని వెబ్ సైట్ నోటిఫికేషన్ ద్వారా ప్రకటించింది NTA. అప్లికేషన్‌లో ఏవైనా తప్పులు ఉంటే.. వాటిని సరిచేసుకునేందుకు గడువును కూడా పెంచింది NTA. ఆగస్టు 11 నుంచి ఆగస్టు 14 (02:00 PM) వరకు వీటిని సరిచేసుకునేందుకు వీలుంది. ఆ తర్వాత నీట్ పరీక్షను ఆఫ్ లైన్ పద్ధతిలో సెప్టెంబర్ 12, 2021 న నిర్వహించనుంది.

* 13 భాషల్లో పరీక్ష నిర్వహణ
మొట్టమొదటి సారిగా నీట్ పరీక్షను 13 భాషల్లో నిర్వహిస్తోంది NTA. గతంలో ఉన్న భాషలతో పాటు తాజాగా మలయాళం, పంజాబీ కలుపుకొని 13 భాషల్లో ఈ పరీక్షలు నిర్వహించనుంది. హిందీ, పంజాబీ, అస్సామీస్, బెంగాలీ, ఒడియా, గుజరాతీ, మరాఠీ, తెలుగు, మలయాళం, కన్నడ, తమిళం, ఉర్దూ, ఇంగ్లిష్ భాషల్లో ప్రస్తుతం ఈ పరీక్ష రాసే వీలు ఉంది. నీట్ పరీక్ష దేశంలోని 198 నగరాలు, పట్టణాల్లో జరగనుంది. అంతే కాదు.. ఈ పరీక్ష ఈ సంవత్సరం నుంచి దుబాయ్, కువైట్ లో కూడా నిర్వహించనున్నారు.

ఇవి కూడా చదవండి:

విద్యార్థులకు బ్యాగ్‌లెస్ స్కూల్ డేస్, ఇంటర్న్‌షిప్‌లు..ప్రకటించిన కేంద్ర విద్యాశాఖ మంత్రి

IT Jobs: నిరుద్యోగులకు అలర్ట్... ఐటీ కంపెనీల్లో ఉద్యోగాల జాతర
Published by:Shiva Kumar Addula
First published: