హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? ఎగ్జామ్ తేదీలు మారుతాయా..? వివరాలివే..

NEET 2021: నీట్ పరీక్ష వాయిదా పడుతుందా..? ఎగ్జామ్ తేదీలు మారుతాయా..? వివరాలివే..

గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు జరగలేదు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

గత రెండేళ్లుగా కరోనా కారణంగా ఇంటర్ పరీక్షలు జరగలేదు. విద్యార్థుల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పరీక్ష ఫీజు చెల్లించిన వారందరినీ పాస్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

కరోనా నేపథ్యంలో దేశ వ్యాప్తంగా వివిధ పరీక్షలు రద్దు కావడంతో పాటు మరికొన్ని వాయిదా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో నీట్ పరీక్ష కూడా వాయిదా పడుతుందన్న ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి.

మెడికల్ అండర్ గ్రాడ్యూయేట్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నీట్(National Eligibility cum Entrance Test) పరీక్ష నిర్వహిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. ఈ ఏడాది నీట్ 2021 పరీక్షను ఆగస్టు 01 నుంచి నిర్వహించనున్నట్లు ఇప్పటికే NTA(National testing Agency) ప్రకటించింది. అయితే పరీక్ష తేదీల షెడ్యూల్ ఇంకా ప్రకటించలేదు. అయితే ఈ తేదీలు మారే అవకాశముంది. కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తోన్న తరుణంలో పరీక్ష నిర్వహణపై స్పష్టత కొరవడింది. జులై వరకు కోవిడ్ ప్రభావం ఉండే అవకాశమున్న కారణంగా పరీక్ష నిర్వహణపై అనుమానాలు తావిస్తున్నాయి. అభ్యర్థులు గందరగోళానికి గురికాకుండా మరిన్ని వివరాలకు అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.in ను సందర్శించాలని అధికారులు సూచిస్తున్నారు.

TS EAMCET 2021: ఎంసెట్ పరీక్షకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్.. అధికారుల కీలక ప్రకటన

పరీక్షా తేదీలను వాయిదా వేస్తారా..

దేశవ్యాప్తంగా బోర్డు పరీక్షలు వాయిదా పడటంతో నీట్ 2021 పరీక్ష తేదీలను సవరించే అవకాశముంది. విశ్వసీయనీయ వర్గాల సమాచారం ప్రకారం కరోనా సెకండ్ వేవ్ పై స్పష్టత వచ్చిన తర్వాత నీట్ 2021 నిర్వహించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. దేశంలో అండర్ గ్యాడ్యూయేషన్ మేడికల్ కోర్సుల ప్రవేశానికి నీట్ యూజీ పరీక్షను నిర్వహిస్తారు. దరఖాస్తుదారుల సంఖ్యా పరంగా దేశంలో ఎక్కువమంది రాసే ప్రవేశ పరీక్షల్లో నీట్ ఒకటి. ప్రతి ఏడాది దాదాపు 15 లక్షల మంది విద్యార్థులు ఈ పరీక్ష కోసం దరఖాస్తు చేసుకుంటారు. నీట్ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలంటే ఈ కింద ప్రక్రియను ఫాలో అవ్వండి.

నీట్ కు ఎలా అప్లై ఎలా చేసుకోవాలి..

-ముందుగా నీట్ అధికారిక వెబ్ సైట్ ntaneet.nic.in ను సందర్శించాలి. అనంతరం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.

-రిజిస్ట్రేషన్ పూర్తయిన తర్వాత ఆ వివరాలతో అప్లికేషన్ ఫామ్ కోసం లాగిన్ అవ్వాలి.

-అనంతరం సంబంధిత పత్రాలు అప్ లోడ్ చేయాలి. ఇందులో స్కాన్ చేసిన ఫోటోతో పాటు మార్క్ షీట్లు, ఇతర సర్టిఫికేట్లు కూడా ఉంటాయి.

-అప్ లోడ్ చేసిన తర్వాత అప్లేకేషన్ ఫీజు చెల్లించాలి. ఆన్ లైన్ పేమేంట్ మోడ్ లో మాత్రమే ఫీజు చెల్లించాలి.

-ఫీజు చెల్లించిన తర్వాత నీట్ 2021 అప్లికేషన్ ను సబ్మిట్ చేయాలి. అనంతరం భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్ ను ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

నీట్ 2021 స్కోర్ బీఎస్సీ నర్సింగ్, లైఫ్ సైన్సెస్ కోర్సుల్లో చేరడానికి కూడా విద్యార్థులకు ఉపయోగపడతాయని ఎన్టీఏ ఈ ఏడాది ప్రకటించింది. నీట్ 2021 సిలబస్ లో మాత్రం ఎలాంటి మార్పు లేదని తెలిపింది. పరీక్ష పేపర్ లో మొత్తం 720 మార్కులకు గాను 180 ప్రశ్నలు ఉంటాయి. ప్రస్తుతం ఆగస్టు 1న పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అభ్యర్థులు మరిన్ని వివరాల కోసం నీట్ 2021 అప్లికేషన్ కు సంబంధించి అధికారిక వెబ్ సైట్లో చెక్ చేసుకోవాలి.

First published:

Tags: Exams, Exams postponed, NEET 2021

ఉత్తమ కథలు