NEET 2021 : నీట్ క‌ట్ఆఫ్ గ‌తేడాది కంటే త‌క్కువ ఉంటుందా?.. అంచనా వివ‌రాలు

ప్రతీకాత్మక చిత్రం

Neet Exam: దేశ వ్యాప్తంగా నీట్ ఎంట్రెన్స్ పరీక్ష జరగనుంది. 16 ల‌క్ష‌ల మంది ద‌ర‌ఖాస్తు చేసుకొన్న ఈ ప‌రీక్ష‌కు 90శాతం మంది హాజ‌ర‌య్యారు. ఈ నేప‌థ్యంలో క‌ట్ఆఫ్ అంచ‌నా వివ‌రాలు తెలుసుకోండి.

  • Share this:
    MBET, BDS, BAMS, BSMS, BUMS మరియు BHMS లలో ప్రవేశానికి NEET 2021 నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నుంచి మెడికల్ ఎంట్రన్స్(Medical entrance) స్కోర్లు కూడా BSc నర్సింగ్ ప్రోగ్రామ్‌లో ప్రవేశాలకు వ‌ర్తించ‌నున్నాయి. ఈ సంవత్సరం 16 లక్షల మంది విద్యార్థులు నీట్ ప‌రీక్ష‌కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే ప‌రీక్ష వాయిదా వేయాల‌ని కొంత మంది విద్యార్థులు డిమాండ్ కూడా చేశారు. నీట్ రద్ద చేయాల‌ని డిమాండ్లు వ‌చ్చాయి. ఇన్నింటి మ‌ధ్య ఈ ఏడాది నీట్ (NEET) ప‌రీక్ష జ‌రిగింది. అయితే ఎంత‌క క‌ట్ ఆఫ్ ఉండొచ్చు అని చాలా మంది విద్యార్థులు ఎదురు చూస్తున్నారు. అయితే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కోసం కట్-ఆఫ్ ఈ సంవత్సరం తక్కువగా ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు.

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) 2021 లో ఉత్తీర్ణత సాధించడానికి అవసరమైన కనీస మార్కులు 50 శాతంగానే ఉన్నాయి, అయితే, టాప్ కాలేజీలలో అడ్మిషన్ పొందడానికి, గత సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం అవసరమైన మార్కులు తక్కువగా ఉండవచ్చని నిపుణుల అభిప్రాయం. పరీక్షలో పాల్గొన్న విద్యార్థుల సంఖ్య, అందుబాటులో ఉన్న మొత్తం సీట్లు మరియు పరీక్ష క్లిష్టత స్థాయి వంటి అనేక అంశాలపై కట్-ఆఫ్ స్కోరు ఆధారపడి ఉంటుంది. ఈ సంవత్సరం పరీక్షకు దరఖాస్తు చేసుకునే విద్యార్థుల సంఖ్య 16 లక్షలకు పైగా ఉండగా, అయితే, సీట్ల సంఖ్య పెరుగుదలతో పాటు క్లిష్టత స్థాయి కూడా పెరిగింది.

    TCS iON : గ్రాడ్యుయేట్లకు గుడ్ న్యూస్‌.. టీసీఎస్ ఐఓన్ 15 రోజుల ఉచిత కోర్సు


    క‌టాఫ్ అంచ‌నా..
    "ఈ సంవత్సరం నీట్ ప‌రీక్ష‌లో ఫిజిక్స్ పేపర్ కొంచెం కఠినంగా ఉంది. ఈ నేప‌థ్యంలో జ‌న‌ర‌ల్ క్యాట‌గిరీ అభ్య‌ర్థుల‌కు 530-540 మధ్య ఉన్న స్కోరు వ‌స్తే టైర్‌-2కి అర్హ‌త పొంద‌వ‌చ్చు.అయితే మెడిక్ కాలేజీలో ప్ర‌వేశం పొందాలంటే 580 అంత కంటే ఎక్కువ స్కోర్ చేయాలి." అని మోషన్ ఎడ్యుకేషన్ ఫౌండ‌ర్ అండ్ ఎండీ నితిన్ విజ‌య్ పేర్కొన్నారు. జ‌న‌ర‌ల్ క్యాట‌గిరి విద్యార్థుల‌కు క‌టాఫ్ స్కోర్ 715 - 130 వరకు ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. OBC అభ్యర్థులకు కటాఫ్ 129-107 అలాగే SC, ST అభ్యర్థులకు ఇది 129 - 100 క‌టాఫ్ PH కోసం 104 - 98 క‌టాఫ్ ఉండొచ్చ‌ని నిపుణులు అంచ‌నా వేస్తున్నారు.

    రిజ‌ర్వేష‌న్ విధానం..
    కేంద్రం వెనుకబడిన తరగతి వర్గాల (OBC) అభ్యర్థులకు 27% రిజర్వేషన్లు అలాగే ఆర్థికంగా వెనుకబడిన విభాగం (EWS) నుండి విద్యార్థులకు 10% రిజర్వేషన్లను అందిస్తోంది. అంతే కాకుండా ఆల్ ఇండియా కోటా (AIQ) కింద రిజర్వేషన్ అందించబడుతుంది. ఇది ఎస్సీలకు 15% రిజర్వేషన్ మరియు ఎస్టీ కేటగిరీ విద్యార్థులకు 7.5% రిజర్వేషన్‌కి అదనంగా ఉంటుంది.

    ECIL Jobs : హైదరాబాద్ ఈసీఐఎల్‌లో టెక్నిక‌ల్ ఆఫీస‌ర్ ఉద్యోగాలు.. జీతం రూ.23,000


    సీట్ల వివ‌రాలు..
    దేశంలో ఆరు సంవత్స‌రాల కాలంలో ఎంబీబీఎస్ (MBBS) సీట్లు 2014 లో 54,348 సీట్ల నుంచి 2020లో 56% పెరిగాయి. 2014లో 54,348 సీట్లు ఉంటే ప్ర‌స్తుతం 84,649 మెడిక‌ల్ సీట్లు ఉన్నాయి. అంతే కాకుండా పీజీ సీట్లు కూడా 80శాతం పెరిగాయి. 2014 లో 30,191 సీట్లు ఉంటాయి. ప్ర‌స్తుతం 54,275 సీట్లు ఉన్నాయి. ఈ ఆరేళ్ల‌లో కొత్త‌గా 179 కొత్త కాలేజీలు వ‌చ్చాయి. ప్ర‌స్తుతం దేశంలో 558 మెడిక‌ల్ కాలేజీలు ఉన్నాయి.

    NEET 2021 ని రద్దు చేసి, పరీక్షను మళ్లీ నిర్వహించాలనే డిమాండ్ కూడా ప్ర‌స్తుతం చాలా మంది నుంచి వ‌స్తోంది. మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్‌లో జరిగిన చీటింగ్ కేసులను ఉదహరిస్తూ విద్యార్థుల బృందం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ ఏడాది 16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు, అందులో 90% పైగా విద్యార్థులు హాజరయ్యారు.
    Published by:Sharath Chandra
    First published: