హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NEET 2021: త్వ‌ర‌లో నీట్ కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే..

NEET 2021: త్వ‌ర‌లో నీట్ కౌన్సెలింగ్‌.. దేశంలోని టాప్ మెడిక‌ల్ కాలేజీలు ఇవే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NEET 2021 : మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) త్వరలో తన అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. ఈ నేప‌థ్యంలో దేశంలోని టాప్ కాలేజీల వివ‌రాలు

ఇంకా చదవండి ...

మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee) త్వరలో తన అధికారిక వెబ్‌సైట్ mcc.nic.in లో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (NEET) 2021 కౌన్సెలింగ్ ప్రక్రియను ప్రారంభించే అవకాశం ఉంది. విద్యార్థులు NEET 2021 అండర్ గ్రాడ్యుయేట్ కౌన్సెలింగ్‌ (Counseling) లో పాల్గొనడానికి ముందుగా నమోదు చేసుకోవాలి అనంత‌రం వారి స్కోర్‌ల ఆధారంగా వారి ఎంపిక, సీట్ల ప్రాధాన్యతను గుర్తించాలి. రిజిస్ట్రేషన్ ప్రక్రియ తర్వాత, సీటు కేటాయింపు చేస్తారు. కేటాయించిన సీట్లతో సంతృప్తి చెందిన విద్యార్థులు (Students) అవసరమైన అన్ని పత్రాలను అప్‌లోడ్ చేసి, గడువు తేదీలోపు ఫీజు చెల్లించి సీట్లను ధ్రువీక‌రించాలి. ఈ ఏడాది దేశ‌వ్యాప్తంగా సుమారు 16 ల‌క్ష‌ల మంది ఈ ప‌రీక్ష రాసారు.

అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేయడానికి ముందు, NIRF ర్యాంకింగ్ ప్రకారం భారతదేశ వ్యాప్తంగా ఉన్న టాప్ కాలేజీల జాబితా వివ‌రాలు చూద్దాం.. ర్యాంక్ వారీగా నంబ‌ర్ల ప్ర‌కారం కాలేజీ వివ‌రాలు ఇలా ఉన్నాయి.

ర్యాంక్క‌ళాశాల పేరు
1ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, న్యూఢిల్లీ
2పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చండీగఢ్
3క్రిస్టియన్ మెడికల్ కాలేజ్, వెల్లూర్
4నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్సెస్, బెంగళూరు
5సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, లక్నో
6అమృత విశ్వ విద్యాపీఠం, కోయంబత్తూర్
7బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
8జవహర్‌లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి
9కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో
10కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
11శ్రీ చిత్ర తిరునల్ ఇనిస్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ, తిరువనంతపురం
12ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్, న్యూఢిల్లీ
13సెయింట్ జాన్స్ మెడికల్ కాలేజ్, బెంగళూరు
14శ్రీ రామచంద్ర ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, చెన్నై
15అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ
16మద్రాస్ మెడికల్ కాలేజ్ & గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్, చెన్నై
17మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్, ఢిల్లీ
18వర్ధమాన్ మహావీర్ మెడికల్ కాలేజ్ & సఫ్దర్‌జంగ్ హాస్పిటల్, ఢిల్లీ
19డాక్టర్ డి వై పాటిల్ విద్యాపీఠ్, పూణే
20SRM ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, చెన్నై
21శిక్ష `ఓ` అనుసంధన్, భువనేశ్వర్
22లేడీ హార్డింగే మెడికల్ కాలేజ్, ఢిల్లీ
23కస్తూర్బా మెడికల్ కాలేజ్, మంగళూరు
24JSS మెడికల్ కాలేజ్, మైసూర్
25జామియా హమ్‌దార్డ్, ఢిల్లీ


NEET 2021 ఫలితాలు నవంబర్ 1న ప్రకటించారు. ఇందులో ముగ్గురు విద్యార్థులు సంయుక్తంగా ర్యాంక్ 1 సాధించారు. 16 లక్షల మంది విద్యార్థులు పరీక్ష కోసం నమోదు చేసుకున్నారు, అందులో 95 శాతం కంటే ఎక్కువ మంది హాజరయ్యారు.

First published:

Tags: EDUCATION, NEET, NEET 2021