NEET 2021 COUNSELING MCC KEY ANNOUNCEMENT ON NEET COUNSELING REPLACEMENT OF MEDICAL SEATS BY ALL FOUR ROUNDS GH EVK
NEET Counselling: నీట్ కౌన్సెలింగ్‌పై MCC కీలక ప్రకటన.. మొత్తం నాలుగు రౌండ్ల ద్వారా మెడికల్ సీట్ల భర్తీ
ప్రతీకాత్మక చిత్రం
NEET 2021 | నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్)–2021 కౌన్సెలింగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరగనుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ప్రకటించింది. ఈ కౌన్సెలింగ్‌ను ఆన్లైన్ మోడ్‌లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపింది.
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test)–2021 కౌన్సెలింగ్ మొత్తం నాలుగు రౌండ్లలో జరగనుందని మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (MCC) ప్రకటించింది. ఈ కౌన్సెలింగ్‌ను ఆన్లైన్ (Online) మోడ్‌లోనే నిర్వహిస్తున్నట్లు తెలిపింది. 2021–22 విద్యా సంవత్సరం నుంచి ఆల్ ఇండియా కోటా(ఏఐక్యూ) సీట్లను రౌండ్ 1, రౌండ్ 2, మాప్- అప్ రౌండ్, స్ట్రే వేకెన్సీ రౌండ్ ఇలా మొత్తం నాలుగు రౌండ్లలో భర్తీ చేయనున్నారు. మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ ( Medical Counselling Committee) 15 శాతం అండర్ గ్రాడ్యుయేట్ (యూజీ) సీట్లకు కౌన్సెలింగ్ నిర్వహిస్తుంది. అయితే, సీట్ల ప్రక్రియలో భిన్నమైన ప్రక్రియను అనుసరిస్తారు. రౌండ్ 2 పూర్తయిన తర్వాత మిగిలిన సీట్లను మాప్- అప్, స్ట్రే వెకెన్సీ ద్వారా భర్తీ చేస్తారు.
ఈ స్ట్రే వేకెన్సీ రౌండ్ కోసం అభ్యర్థులు ఎటువంటి రిజిస్ట్రేషన్ (Registration) చేసుకోవాల్సిన పనిలేదు. అయితే, రౌండ్ 1లో సీటు దక్కించుకున్న వారికి మాత్రమే అప్‌గ్రేడేషన్, కోర్సు నుంచి ఉచితంగా ఎగ్జిట్ (Free Exit) అయ్యే అవకాశం ఉంటుంది. ఈ అవకాశం రౌండ్ 2, రౌండ్ 3లో సీటు దక్కించుకున్న వారికి ఉండదు. ఇక, రౌండ్ 2, రౌండ్3ల్లో సీట్లు దక్కించుకున్న వారికి రౌండ్ 4 కౌన్సెలింగ్‌లో పాల్గొనడానికి అనుమతి ఉండదు.
జనవరి 6 తర్వాతే కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం..
నీట్–2021 ఫలితాలు నవంబర్ 1న విడుదలయ్యాయి. అయితే ఈడబ్ల్యూఎస్ (EWS), ఓబీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ కొంత మంది విద్యార్థులు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై సుప్రీం కోర్డు (Supreme Court) లో విచారణ జరుగుతున్నందుకున కౌన్సెలింగ్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. పిటిషన్‌పై తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది. తుది తీర్పు వెలువడ్డ తర్వాతే కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది.
ర్యాంక్ 2: పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (PGIMER), చండీగఢ్
ర్యాంక్ 3: క్రిస్టియన్ మెడికల్ కాలేజీ, వెల్లూరు
ర్యాంక్ 4: నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ & న్యూరో సైన్స్, బెంగళూరు
ర్యాంక్ 5: సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, లక్నో
ర్యాంక్ 6: అమృత విశ్వ విద్యాపీఠం
ర్యాంక్ 7: బనారస్ హిందూ యూనివర్సిటీ, వారణాసి
ర్యాంక్ 8: జవహర్‌లాల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్, పుదుచ్చేరి
ర్యాంక్ 9: కింగ్ జార్జ్ మెడికల్ యూనివర్సిటీ, లక్నో
ర్యాంక్ 10: కస్తూర్బా మెడికల్ కాలేజ్, మణిపాల్
నీట్లో కనిష్టంగా 50 పర్సంటైల్ స్కోర్ సాధించిన అభ్యర్థులు మాత్రమే కౌన్సెలింగ్‌కి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎస్సీ, ఎస్టీ కేటగిరీకి చెందిన వారు తప్పనిసరిగా 40 పర్సంటైల్, పీడబ్ల్యూడీ అభ్యర్థులు 45 పర్సంటైల్ స్కోర్ సాధించాల్సి ఉంటుంది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.