Home /News /jobs /

NEET 2020 LIVE UPDATES NOW EVERYTHING IS OVER SAYS SUPREME COURT AS IT REFUSES TO ENTERTAIN PLEAS ON DEFERMENT SS

NEET 2020 Updates: నీట్ 2020 విద్యార్థులకు అలర్ట్... పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు

NEET 2020 Updates: నీట్ 2020 విద్యార్థులకు అలర్ట్... పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు
(ప్రతీకాత్మక చిత్రం)

NEET 2020 Updates: నీట్ 2020 విద్యార్థులకు అలర్ట్... పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు (ప్రతీకాత్మక చిత్రం)

NEET 2020 Live Updates | సెప్టెంబర్ 13న నీట్ 2020 పరీక్ష జరగాల్సి ఉంది. దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు రిజిస్టర్ చేసుకున్నారు. పరీక్ష వాయిదాపై సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

    నీట్ 2020 పరీక్షలు జరుగుతాయా లేదా అన్న సస్పెన్స్‌కు తెరపడింది. షెడ్యూల్ ప్రకారమే నీట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) 2020 పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దాఖలైన పిటిషన్లను సుప్రీం కోర్టు తిరస్కరించింది. పరీక్ష వాయిదా వేయాలంటూ దాఖలయ్యో పిటిషన్లను స్వీకరించబోమని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. జేఈఈ, నీట్, యూజీసీ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ విద్యార్థులు కొంత కాలంగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తున్న సంగతి తెలిసిందే. జేఈఈ 2020, నీట్ 2020 పరీక్షల్ని వాయిదా వేయాలని గతంలో దాఖలైన పిటిషన్లను ఆగస్ట్ 17న సుప్రీం కోర్టు కొట్టేసింది. విద్యార్థుల కెరీర్ ప్రమాదంలో పడుతుందన్న కారణంతో పరీక్షల్ని వాయిదా వేయడం సాధ్యం కాదని తేల్చి చెప్పింది. అయితే ఆగస్ట్ 17న ఇచ్చిన ఆదేశాలను సమీక్షించాలంటూ విపక్ష పాలన ఉన్న రాష్ట్రాలకు చెందిన మంత్రులు మరిన్ని రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. వాటిని కూడా సెప్టెంబర్ 4న కొట్టేసింది సుప్రీం కోర్టు. దీంతో జేఈఈ మెయిన్స్ పరీక్షలు పూర్తయ్యాయి.

    Bank Jobs 2020: పంజాబ్ నేషనల్ బ్యాంకులో 535 ఉద్యోగాలు

    IBPS Clerk 2020: ప్రభుత్వ బ్యాంకుల్లో 1557 క్లర్క్ ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

    అయితే సెప్టెంబర్ 13న నీట్ 2020 పరీక్ష జరగాల్సి ఉంది. అండర్ గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే పరీక్ష ఇది. ఈ ఎగ్జామ్ వాయిదా వేయాలంటూ మళ్లీ రివ్యూ పిటిషన్లు దాఖలు చేశారు. అంతా ముగిసిపోయిందని వ్యాఖ్యానించిన కోర్టు తాజాగా దాఖలైన రివ్యూ పిటిషన్లను కూడా తిరస్కరించింది. బీహార్‌లో వరదల్ని దృష్టిలో పెట్టుకొని పరీక్ష వాయిదా వేయాలని కొందరు, కోవిడ్ 19 పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ఎగ్జామ్ వాయిదా వేయాలని మరికొందరు పిటిషన్లు దాఖలు చేశారు. అయితే అధికారులు పరీక్ష నిర్వహణకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటారని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. దీంతో సెప్టెంబర్ 13న నీట్ 2020 ఎగ్జామ్ జరగడం ఖాయం. దేశవ్యాప్తంగా సుమారు 15 లక్షల మంది విద్యార్థులు నీట్ పరీక్షకు హాజరవుతారని అంచనా. ఇప్పటికే నీట్ 2020 అడ్మిట్ కార్డు రిలీజైంది. https://ntaneet.nic.in/ వెబ్‍సైట్‌లో అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Corona, Corona virus, Coronavirus, Covid-19, Exams, NEET, NEET 2020, Supreme Court

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు