Home /News /jobs /

NEET 2020 COUNSELLING 1ST ROUND OF SEAT ALLOTMENT TODAY KNOW HOW TO CHECK SS

NEET Counselling 2020: అలర్ట్... మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఈరోజే... చెక్ చేయండి ఇలా

NEET Counselling 2020: అలర్ట్... మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఈరోజే... చెక్ చేయండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

NEET Counselling 2020: అలర్ట్... మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఈరోజే... చెక్ చేయండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

NEET Counselling 2020 First Round Results | నీట్ కౌన్సిలింగ్‌లో మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఫలితాలు ఈరోజు విడుదల కానున్నాయి.

    దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల కోసం కౌన్సిలింగ్ ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET క్వాలిఫై అయినవారంతా ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ కోసం ఇప్పటికే ఛాయిస్ ఫిల్లింగ్ పూర్తి చేశారు. మొదటి రౌండ్ సీట్ అలాట్‌మెంట్ ఈరోజే జరుగుతుంది. మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ-MCC అధికారిక వెబ్‌సైట్‌ https://mcc.nic.in/ లో సీట్ అలాట్‌మెంట్ వివరాలను చెక్ చేసుకోవచ్చు. పీడీఎఫ్ ఫార్మాట్‌లో సీట్ అలాట్‌మెంట్ వివరాలు విడుదలయ్యే అవకాశం ఉంది. అందులో విద్యార్థులు తమ పేరు, రిజిస్ట్రేషన్ నెంబర్ ద్వారా సెర్చ్ చేయొచ్చు. సీట్ అలాట్‌మెంట్ ఆల్ ఇండియా ర్యాంక్ ద్వారా జరుగుతుంది. మొదటి ర్యాంక్ నుంచి అలాట్‌మెంట్ కొనసాగుతుంది. ఆ విద్యార్థులు ఎంచుకున్న కోర్సులు, కాలేజీలు, అందుబాటులో ఉన్న సీట్లు, రిజర్వేషన్ లాంటి అంశాలను పరిగణలోకి తీసుకొని సీట్లు అలాట్ చేస్తారు.

    NEET 2020 Counselling: నీట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఇదే

    BEL Recruitment 2020: భారత్ ఎలక్ట్రానిక్స్‌లో ఫ్రెషర్స్‌కి 175 జాబ్స్... రూ.50,000 వరకు జీతం

    NEET Counselling 2020 Rount 1 Seat allotment: చెక్ చేయండి ఇలా


    విద్యార్థులు ముందుగా https://mcc.nic.in/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
    హోమ్ పేజీలో ఫస్ట్ రౌండ్ సీట్ అలాట్‌మెంట్‌కు సంబంధించిన లింక్ కనిపిస్తుంది. క్లిక్ చేయాలి.
    సీట్ అలాట్‌మెంట్ వివరాలు పీడీఎఫ్ ఫార్మాట్‌లో ఓపెన్ అవుతాయి.
    పీడీఎఫ్ ఫైల్‌ను కంప్యూటర్‌లోకి సేవ్ చేసుకోవాలి.
    ఆ తర్వాత Ctrl+F ఫైండ్ ఆప్షన్ క్లిక్ చేసి రోల్ నెంబర్ ఎంటర్ చేయాలి.
    రోల్‌ నెంబర్ ప్రకారం పేరు, అలాట్ అయిన కాలేజీ వివరాలు కనిపిస్తాయి.

    Bank Jobs 2020: మూడు నోటిఫికేషన్లు... మొత్తం 12,588 బ్యాంకు ఉద్యోగాలు... అప్లై చేయండిలా

    Aarogyasri Jobs: ఏపీలో ఆరోగ్యశ్రీలో 648 ఉద్యోగాలు... జిల్లాల వారీగా ఖాళీల వివరాలు ఇవే

    మొదటి రౌండ్‌లో సీట్లు అలాట్ అయిన విద్యార్థులు నవంబర్ 6 నుంచి నవంబర్ 12 వరకు రిపోర్ట్ చేయాలి. ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్‌లో సీట్లు వచ్చిన విద్యార్థులతోపాటు రానివాళ్లు కూడా సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్‌లో పాల్గొనొచ్చు. రెండో రౌండ్ కౌన్సిలింగ్‌కు రిజిస్ట్రేషన్ 2020 నవంబర్ 18న మొదలవుతుంది. నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల వరకు రిజిస్ట్రేషన్ చేయొచ్చు. పేమెంట్ సదుపాయం నవంబర్ 22 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. రెండో రౌండ్ చాయిస్ ఫిల్లింగ్ నవంబర్ 19 నుంచి నవంబర్ 22 రాత్రి 11.59 గంటల వరకు ఉంటుంది. ఛాయిస్ లాకింగ్ 2020 నవంబర్ 22 మధ్యాహ్నం 3 గంటల నుంచి 11.59 గంటల వరకు ఉంటుంది. రెండో రౌండ్ సీట్ అలాట్‌మెంట్ నవంబర్ 23, 24 తేదీల్లో పూర్తవుతుంది. ఫలితాలు నవంబర్ 25న విడుదలౌతాయి. 2020 నవంబర్ 26 నుంచి డిసెంబర్ 2 వరకు రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది.

    దేశవ్యాప్తంగా 13,66,945 మంది విద్యార్థులు నీట్ 2020 పరీక్షకు హాజరైతే 7,71,500 మంది విద్యార్థులు క్వాలిఫై అయ్యారు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: NEET, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు