Home /News /jobs /

NEET 2020 AND JEE MAIN 2020 EXAM DATES TO BE FINALISE ON FRIDAY CLARIFIES HRD MINISTER SS

NEET JEE exams 2020: నీట్, జేఈఈ పరీక్షలపై సస్పెన్స్... నిర్ణయం ఎప్పుడంటే

NEET JEE exams 2020: నీట్, జేఈఈ పరీక్షలపై సస్పెన్స్... నిర్ణయం ఎప్పుడంటే
(ప్రతీకాత్మక చిత్రం)

NEET JEE exams 2020: నీట్, జేఈఈ పరీక్షలపై సస్పెన్స్... నిర్ణయం ఎప్పుడంటే (ప్రతీకాత్మక చిత్రం)

NEET 2020 and JEE Main 2020 Exam Dates | నీట్ 2020, జేఈఈ 2020 పరీక్షల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకు గుడ్ న్యూస్. పరీక్షల నిర్వహణపై క్లారిటీ ఇవ్వనుంది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ.

    నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2020, జేఈఈ మెయిన్ 2020 పరీక్షలపై సస్పెన్స్ కొనసాగుతోంది. దేశమంతా కరోనా వైరస్ మహమ్మారి ప్రభావం కొనసాగుతుండటంతో పరీక్షల నిర్వహణ సాధ్యం కాకపోవచ్చన్న వాదన ఉంది. దీంతో ఈ పరీక్షల్ని ఎప్పుడు నిర్వహిస్తారని, స్పష్టత ఇవ్వాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతోపాటు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సోషల్ మీడియా హ్యాండిల్స్‌లో ప్రశ్నిస్తున్నారు విద్యార్థులు. దీంతో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ స్పందించారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీతోపాటు ఇతర నిపుణులతో కూడిన కమిటీ పరిస్థితిని సమీక్షించి శుక్రవారం రోజు నిర్ణయం ప్రకటిస్తుందని అన్నారు.

    Jobs: తెలంగాణలోని ఎయిమ్స్‌లో 141 ఉద్యోగాలు... ఖాళీల వివరాలివే

    SSC Jobs: 8582 ఖాళీలను ప్రకటించిన స్టాఫ్ సెలక్షన్ కమిషన్


    2020 జూలై 18 నుంచి జూలై 23 వరకు జేఈఈ మెయిన్ ఎగ్జామ్, జూలై 26న మెడికల్ ఎంట్రెన్స్ ఎగ్జామినేషన్ నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తామని గతంలో కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ ప్రకటించింది. నీట్ ఎగ్జామ్‌కు దేశవ్యాప్తంగా 15 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా. అయితే ఇటీవల సీబీఎస్ఈ బోర్డు పరీక్షల్ని రద్దు చేయడంతో నీట్ 2020, జేఈఈ మెయిన్ 2020 పరీక్షల్ని నిర్వహిస్తారా లేదా అన్న ఆందోళన విద్యార్థుల్లో మొదలైంది.
    First published:

    Tags: CAREER, Exams, Jee, JEE Main 2020, NEET, NEET 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు