Home /News /jobs /

NEET 2019 RESULTS NATIONAL TESTING AGENCY NTA RELEASED NEET 2019 RESULTS KNOW HOW TO CHECK IN NTANEET NIC IN SS

NEET 2019 Results: నీట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా

NEET 2019 Results: నీట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా
(ప్రతీకాత్మక చిత్రం)

NEET 2019 Results: నీట్ 2019 ఫలితాల విడుదల... చెక్ చేసుకోండి ఇలా (ప్రతీకాత్మక చిత్రం)

NEET 2019 Result at ntaneet.nic.in | నీట్ 2019 ఫలితాలను బుధవారం విడుదల చేసింది ఎన్‌టీఏ. ఫలితాలు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి.

    నీట్ 2019 ఫలితాలు విడుదలయ్యాయి. సుమారు 14 లక్షల మంది విద్యార్థులు నెల రోజులుగా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో జాయిన్ కావడానికి నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్-NEET 2019 నిర్వహించింది నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ-NTA. ఫలితాలను బుధవారం విడుదల చేసింది. ఫలితాలు ఎన్‌టీఏ అధికారిక వెబ్‌సైట్‌లో ఉన్నాయి. దేశవ్యాప్తంగా మే 5న, కర్నాటకతో పాటు ఫొని తుఫాను ప్రభావిత ప్రాంతాల విద్యార్థులకు మే 20న నిర్వహించిన నీట్ 2019 పరీక్షకు మొత్తం 14,10,754 మంది హాజరయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 1.2 లక్షల మంది విద్యార్థులు ఉన్నారు. నీట్ ఫలితాలను ఇలా చెక్ చేసుకోండి.

    NTA NEET 2019 Result: ఫలితాలను చెక్ చేసుకోండి ఇలా...


    ముందుగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్‌సైట్ ntaneet.nic.in ఓపెన్ చేయండి.
    హోమ్ పేజీలో 'NEET Result 2019' లింక్ పైన క్లిక్ చేయండి.
    నీట్ రిజిస్ట్రేషన్ ఐడీ, పాస్‌వర్డ్ ఎంటర్ చేయండి.
    కొత్త పేజీలో NEET Result 2019 రిజల్ట్ కనిపిస్తుంది.
    రిజల్ట్‌ను డౌన్‌లోడ్ చేసుకొని ఓ కాపీ ప్రింట్ తీసుకోండి.

    నీట్ 2019 పరీక్షలో క్వాలిఫై అయిన విద్యార్థులు ఎంబీబీఎస్, బీడీఎస్ కాలేజీల్లో సీట్లను పొందొచ్చు. ఆల్ ఇండియా కోటా సీట్లకు ఎంపికైన 15 శాతం లోపు అభ్యర్థులకు సెంట్రలైజ్డ్ కౌన్సిలింగ్ ద్వారా ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్లను కేటాయిస్తుంది మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ-MCC. మిగతా 85 శాతం రాష్ట్ర కోటా కిందకు వస్తుంది. నీట్ స్కోర్ల ఆధారంగా రాష్ట్ర కౌన్సిలింగ్ అథారిటీలు మెడికల్, డెంటల్ సీట్లను కేటాయిస్తాయి. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్(DGHS), ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సంయుక్తంగా నీట్ మెరిట్ లిస్ట్ తయారు చేస్తుంటాయి.

    నీట్ మెడికల్ మెరిట్ లిస్ట్ 2019, నీట్ డెంటల్ మెరిట్ లిస్ట్ 2019 ఆధారంగా అడ్మిషన్ ప్రక్రియ ఉంటుంది. నీట్ 2019 మెరిట్ లిస్ట్‌లో చోటు సంపాదించడానికి జనరల్ కేటగిరీ అభ్యర్థులు 50 పర్సెంటైల్, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు 40 పర్సెంటైల్, వికలాంగులు 45 పర్సెంటైల్ పొందాల్సి ఉంటుంది. ఈసారి ఆర్థికంగా వెనుకబడ్డ వర్గాలకు కూడా 10 శాతం సీట్లు కేటాయించడం విశేషం. ప్రభుత్వ కాలేజీల్లో ఓబీసీలకు 27 శాతం, ఎస్సీలకు 15 శాతం, ఎస్టీలకు 7.5 శాతం, ఈడబ్ల్యూఎస్‌కు 10 శాతం సీట్లు కేటాయించారు. నీట్ 2019 ఫలితాలు విడుదలైన తర్వాత కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. నీట్ కౌన్సిలింగ్ వివరాలను మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ హోమ్ పేజీలో చూడొచ్చు. నీట్ 2018 కౌన్సిలింగ్ గతేడాది ఆగస్ట్ 31 నుంచి సెప్టెంబర్ 3 వరకు జరిగింది. గతేడాది జనరల్ కేటగిరీకి 119, ఎస్సీ ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు 96 మార్కుల కటాఫ్ ఉంది.

    Job News: మరిన్ని జాబ్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

    Redmi K20 Pro: షావోమీ నుంచి కొత్త ఫోన్స్... రెడ్‌మీ కే20, కే 20 ప్రో


    ఇవి కూడా చదవండి:

    Inter Career: ఇంటర్ పాసయ్యారా? తర్వాత చేయాల్సిన కోర్సులివే...

    ఇంటర్ తర్వాత 113 కోర్సులు చేయొచ్చు... సీబీఎస్ఈ కెరీర్ గైడెన్స్

    Budget 2019: స్మార్ట్‌ఫోన్ కొనాలా? రూ.15,000 లోపు టాప్-10 మోడల్స్ ఇవే...
    First published:

    Tags: CAREER, Exams, JOBS, NEET, NOTIFICATION, Results

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు