NEET EXAM 2019 : నీట్ ఎగ్జామ్ వాయిదా.. ఫణి ప్రభావంతో నిర్ణయం..

NEET Exam 2019| దేశవ్యాప్తంగా మే 5న నీట్ ఎగ్జామ్ జరుగనుంది. అయితే, ఒడిశాలో ఫణి ఎఫెక్ట్ తీవ్రంగా ఉండడంతో అక్కడ నీట్ ఎగ్జామ్‌ని వాయిదా వేశారు.

news18-telugu
Updated: May 4, 2019, 5:57 PM IST
NEET EXAM 2019 : నీట్ ఎగ్జామ్ వాయిదా.. ఫణి ప్రభావంతో నిర్ణయం..
ప్రతీకాత్మక చిత్రం
news18-telugu
Updated: May 4, 2019, 5:57 PM IST
ఒడిశా రాష్ట్రంపై ఫణి సైక్లోన్ ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ కారణంగా... మే 5న జరుగనున్న ఆలిండియా స్థాయి మెడికల్ ఎంట్రెన్స్ టెస్ట్ నీట్ ఎగ్జామ్‌ని వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే ఫణి తుపాను కారణంగా ఒడిశాలోని తీరప్రాంత జిల్లాలు అతలాకుతలం అయ్యాయి. దాదాపు 12 లక్షల మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎక్కడికక్కడ జనజీవనం స్తంభించిపోయింది. ఈ కారణంగా..నీట్ ఎగ్జామ్ నిర్వహిస్తే అభ్యర్థులు ఇబ్బందులకు గురవుతారనే ఉద్దేశ్యంతోనే అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు.

అయితే, త్వరలోనే మరో తేదీ ప్రకటించి ఒడిశాలో నీట్ నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు. ఒడిశా ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఆలిండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(ఎయిమ్స్) పోస్టు గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ కూడా వాయిదా పడింది.

ఇవి కూడా చదవండి..

CPGET Notification : 7 వర్సిటీలకు ఒకటే ఎంట్రెన్స్ టెస్ట్.. నోటిఫికేషన్ రిలీజ్...

First published: May 4, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...