NEET 2019 Counselling : నీట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా అప్లై చేయండి..

NEET 2019 Counselling | కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ కోసం అఫీషియల్ వెబ్‌సైట్ https://www.mcc.nic.in/ లోకి వెళ్లి రిజిస్ట్రిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 12న ది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది. ప్రస్తుతం రెండు విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది.

news18-telugu
Updated: June 19, 2019, 6:35 PM IST
NEET 2019 Counselling : నీట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం.. ఇలా అప్లై చేయండి..
నీట్ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ ప్రారంభం
news18-telugu
Updated: June 19, 2019, 6:35 PM IST
దేశవ్యాప్తంగా వైద్యవిద్యలో 15 శాతం నేషనల్ కోటా సీట్లకు నీట్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. రెండు రౌండ్లలో అఖిలభారత భారతస్థాయిలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగనుంది. ఈ కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్‌ కోసం అఫీషియల్ వెబ్‌సైట్ https://www.mcc.nic.in/ లోకి వెళ్లి రిజిస్ట్రిషన్ చేసుకోవాల్సి ఉంటుంది. జూన్ 12న ది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ. దీనికి సంబంధించిన షెడ్యూల్ విడుదల చేసింది.
ప్రస్తుతం రెండు విడతల వారీగా కౌన్సెలింగ్ ప్రక్రియ ఉంటుంది. ఇందులో సీట్లు ఖరారుకాని వారికి మరోసారి మాప్ అప్ రౌండ్ ఉంటుంది. ఇందులో మొదటి రౌండ్ కౌన్సెలింగ్ ఈరోజు నుంచిప్రారంభమై జూన్ 24తో ముగుస్తుంది.

వీరికి కాలేజ్ ఎంచుకునే ప్రక్రియ జూన్ 25న ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలవరకు ఉంటుంది. విద్యార్థుల స్కోర్ ప్రకారం కాలేజ్‌లను ఎంచుకునే సౌలభ్యం ఉంటుంది. అనంతరం. మొదటిరౌండ్ సీట్ అలాట్ మెంట్ ఫలితాలు జూన్ 27 న ప్రకటిస్తారు. ఇందులోనేసీట్ అలాట్‌మెంట్ లిస్ట్, సీట్ అలాట్‌మెంట్ లెటర్ ఉంటాయి. విద్యార్థులకు సంబంధించిన అన్ని వివరాలు ఇందులోనే ఉంటాయి. మొదటి రౌండ్‌లో సీటు అలాట్‌మెంట్ రిజల్ట్‌లో సీట్ పొందిన అబ్యర్థులు జూన్ 28 నుంచి జులై 3వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేసి అడ్మిషన్ ప్రక్రియపూర్తి చేయాల్సి ఉంటుంది.

నీట్ 2019 కౌన్సెలింగ్ రిజిస్ట్రేషన్ కోసం..
* ముందుగా అభ్యర్థులు.. https://www.mcc.nic.in/ వెబ్‌సైట్‌కి లాగిన్ అవ్వాలి.


* ఇప్పుడు హోంపేజిలో ఎడవైపున పైన లాగిన్‌పై క్లిక్ చేయాలి.
* ఇప్పుడు NEET 2019 Exam credentials పై క్లిక్ చేయాలి.
Loading...
* ఇప్పుడు సూచించిన విషయాలను చదివి కౌన్సెలింగ్ ఫీజు చెల్లించాలి.
* అనంతరం NEET 2019 Counselling డాక్యుమెంట్‌ని ప్రింట్ అవుట్ తీసుకోవాలి.

సెకండ్, థర్డ్ రౌండ్ కౌన్సెలింగ్ షెడ్యూల్ జులై, ఆగస్టు‌లో జరుగుతాయి. సెకండ్ రౌండ్‌కి సంబంధించిన కౌన్సెలింగ్ జులై 6 నుంచి జులై 8 వరకుజరుగనుంది.
First published: June 19, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...