• HOME
  • »
  • NEWS
  • »
  • JOBS
  • »
  • NCRTC RECRUITMENT 2021 FOR 23 EXECUTIVE DGM MANAGER SURVEYOR OTHER POSTS HERE FULL DETAILS NS

NCRTC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

NCRTC Recruitment 2021: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ఆ ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

ప్రతీకాత్మక చిత్రం

నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(NCRTC) నుంచి ఉద్యోగ ప్రకటన విడుదలైంది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు ఈ నెల 23లోగా అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    నిరుద్యోగులకు నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(NCRTC) గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ నుంచి నోటిఫికేషన్ విడుదలైంది. సర్వేయర్, సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్, మేనేజర్, అసిస్టెంట్ మేనేజర్, లేబర్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్, సీనియర్ ఎగ్జిక్యూటీవ్, ఎగ్జిక్యూటీవ్, సీనియర్ డీజీఎం, డీజీఎం తదితర ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు సూచించిన ఫార్మాట్లో ఏప్రిల్ 23లోగా అప్లై చేయాలని ప్రకటనలో సూచించారు.

    ముఖ్యమైన తేదీలు..
    ఆన్లైన్ అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీ: ఏప్రిల్ 2
    ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేసేందుకు ఆఖరి తేదీ: ఏప్రిల్ 23

    ఖాళీల వివరాలు..
    సర్వేయర్: 2 పోస్టులు
    సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్/డిప్యూటీ జనరల్ మేనేజర్-4 పోస్టులు
    మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్-11 పోస్టులు
    లేబర్ వెల్ఫేర్ ఇన్స్పెక్టర్-2 పోస్టులు
    సీనియర్ డీజీఎం/డీజీఎం-2 పోస్టులు
    BECIL Recruitment 2021: బీఈసీఐఎల్ లో 1679 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్.. 8వ తరగతి, ఇంటర్, ఐటీఐ అర్హత ఉంటే చాలు..
    NTPC Recruitment 2021: ఎన్టీపీసీలో భారీ వేతనంతో ఉద్యోగాలు.. అప్లై చేయడానికి రేపటి వరకే ఛాన్స్.. వివరాలివే

    అర్హతల వివరాలు..
    -సర్వేయర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు సర్వేయింగ్ లో ఐటీఐ చేసి ఉండాలి.
    -మేనేజర్/అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్ చేసి ఉండాలి లేదా సంబంధిత విభాగంలో డిప్లొమో చేసి ఉండాలి.
    -సీనియర్ డిప్యూటీ జనరల్ మేనేజర్/ప్లానింగ్ లేదా డిప్యూటీ జనరల్ మేనేజర్ ఉద్యోగాలకు అప్లై చేసే అభ్యర్థులు సివిల్ విభాగంలో బీటెక్ చేసి ఉండాలి మరియు కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్/ ప్లానింగ్ విభాగంలో పీజీ డిప్లొమా లేదా డిగ్రీ చేసి ఉండాలి.
    ఇతర పోస్టులు, వాటికి కావాల్సిన విద్యార్హతల వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Official Website-Direct Link

    ఎలా అప్లై చేయాలంటే..
    అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ నుంచి అప్లికేషన్ ఫామ్ లను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం ఆ ఫామ్ లను నింపి Career Cell, HR Department, National Capital Region Transport Corporation, 7/6 Siri Fort Institutional Area, August Kranti Marg, New Delhi-110049 చిరునామాకు పంపించాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ లు ఏప్రిల్ 23లోగా పైన సూచించిన చిరునామాకు చేరాల్సి ఉంటుంది. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.
    Published by:Nikhil Kumar S
    First published: