కరోనా నేపథ్యంలో ఈ ఏడాది పరీక్షల ప్రక్రియ అంతా ఆలస్యంగా సాగుతోంది. అయితే కరోనా ఎఫెక్ట్ తగ్గడంతో పరీక్షల ప్రక్రియను అధికారులు సాధ్యమైనంత త్వరగా ముగించాలన్న లక్ష్యంతో పని చేస్తున్నారు. దీంతో వీవిధ పరీక్షల కోసం వరుసగా ప్రకటనలు విడుదలవుతున్నాయి. ఈ నేపథ్యంలో NEET PG 2021 పరీక్షల ప్రకటన కూడా విడుదలైంది. ఈ రోజు నుంచి పరీక్షకు రిజిస్ట్రేషన్ ప్రక్రియను నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్(NBE) ప్రారంభించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ nbe.edu.inలో రిజిస్టర్ చేసుకోవచ్చు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం NEET PG 2021 పరీక్ష ఏప్రిల్ 18, 2021న నిర్వహించే అవకాశం ఉంది.
ముఖ్యమైన తేదీలు..
అప్లికేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే తేదీ: ఫిబ్రవరి 23
అప్లికేషన్ల ప్రక్రియ ఆఖరి తేదీ: మార్చి 15
NEET PG 2021 అడ్మిట్ కార్డులు విడుదలయ్యే తేదీ: ఏప్రిల్ 12
NEET PG 2021 పరీక్ష తేదీ: ఏప్రిల్ 18
పరీక్ష ఫలితాలు విడుదల: మే 31 లోపు
పరీక్షకు సంబంధించిన వివరాలు..
-NEET PG పరీక్ష మల్టిపుల్ ఛాయిస్ రూపంలో ఉంటుంది.
-300 మల్టిపుల్ ఛాయస్ ప్రశ్నలు ఉంటాయి.
-పరీక్షకు 3 గంటల 30 నిమిషాల సమయం ఉంటుంది.
-ప్రశ్న పత్రంలో A,B,C మూడు పార్ట్ లు ఉంటాయి. ఈ పార్ట్ లలో 50, 100, 150 ప్రశ్నలు ఉంటాయి.