NBE NEET PG 2021: మరోసారి నీట్ పీజీ రిజిస్ట్రేషన్, ఎడిట్ విండో ఓపెన్.. ఆగస్టు 20 వరకు మార్పులకు అవకాశం

(ప్రతీకాత్మక చిత్రం)

దేశవ్యాప్తంగా వివిధ మెడికల్​, డెంటల్​ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నేషల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (నీట్​ పీజీ) పరీక్షకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్​ 11న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విండోను మరోసారి తెరిచింది.

  • Share this:
దేశవ్యాప్తంగా వివిధ మెడికల్​, డెంటల్​ పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు ఏటా నిర్వహించే నేషల్​ ఎలిజిబిలిటీ కమ్​ ఎంట్రన్స్​ టెస్ట్​ (నీట్​ పీజీ) పరీక్షకు సంబంధించి నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ (NBE) కీలక ప్రకటన చేసింది. సెప్టెంబర్​ 11న జరిగే ఈ పరీక్షకు సంబంధించిన రిజిస్ట్రేషన్ విండోను మరోసారి తెరిచింది. దీంతో పాటు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తు సవరణల కోసం కరెక్షన్​ విండోను కూడా ఓపెన్​ చేసింది. ఇప్పటికే తెరుచుకున్న రిజిస్ట్రేషన్​, కరెక్షన్ విండోలు ఆగస్టు 20 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. ఇప్పటివరకు రిజిస్ట్రేషన్ చేసుకోని వారితో పాటు రిజిస్ట్రేషన్​లో తప్పులు చేసిన వారు సవరించుకోవడానికి మరోసారి అవకాశం కల్పిస్తున్నట్లు స్పష్టం చేసింది. నీట్ పీజీ–2021 జనవరిలోనే జరగాల్సి ఉంది. అయితే కరోనా సెకండ్​ వేవ్​ కారణంగా ఏప్రిల్‌కు వాయిదా పడింది. అప్పటికీ కరోనా కంట్రోల్​​ కాకపోవడంతో ఆగస్టుకి వాయిదా వేశారు. తాజాగా ఈ పరీక్షను సెప్టెంబర్​ 11న నిర్వహిస్తామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్​ మాండవీయ స్పష్టం చేశారు.

ఎలా దరఖాస్తు చేయాలి?

నీట్ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి.

నీట్ పీజీ–2021 రిజిస్ట్రేషన్ లింక్‌పై క్లిక్ చేయండి.

యూజర్ రిజిస్ట్రేషన్​​ ఫారమ్​ను పూరించి మీ ఐడీ, పాస్‌వర్డ్‌ను క్రియేట్ చేసుకోండి.

లాగిన్ అయ్యి దరఖాస్తు ఫారమ్‌ను పూర్తి చేయండి. అవసరమయ్యే డాక్యుమెంట్స్​ను అప్‌లోడ్ చేయండి.

మీ ఎగ్జామినేషన్ సెంటర్​ను ఎంచుకోండి. ఆ తర్వాత పరీక్ష ఫీజు చెల్లించండి.

డిక్లరేషన్‌ను అంగీకరించి దరఖాస్తు ఫారమ్‌ను సబ్​మిట్ చేయండి.

నీట్​ తాజా మార్గదర్శకాల ప్రకారం, జూలై 21 నుంచి సెప్టెంబర్ 30 ఇంటర్న్‌షిప్ పూర్తి చేయనున్న విద్యార్థులకు కూడా రిజిస్టేషన్ చేసుకోవచ్చు. మొదట రిజిస్ట్రేషన్​ ప్రారంభించినప్పుడు వారికి అవకాశం కల్పించలేదు. అయితే ఇంటర్న్​షిప్​ చేస్తున్న విద్యార్థుల నుంచి డిమాండ్లు రావడంతో వారిని కూడా పరీక్షకు అనుమతిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. కొత్త వారితో పాటు ఇప్పటికే రిజిస్ట్రేషన్​ చేసుకున్న అభ్యర్థులు తమ దరఖాస్తు కేటగిరీలో ఏమైనా తప్పులు చేసి ఉంటే ఈ విండో ద్వారా సరిచేసుకోవచ్చు. అయితే, కేటగిరీ మినహా మిగతా వివరాలను సరిచేసుకునేందుకు అవకాశం లేదని ఎన్​బీఈ స్పష్టం చేసింది. కేంద్రం ఇటీవల మెడికల్ సీట్లలో రిజర్వేషన్లపై కొత్త మార్గదర్శకాలు విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని కింద ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను వర్తింపజేసింది. దీంతో, అభ్యర్థుల కేటగిరీ స్టేటస్​ మార్చుకునేందుకు ఈ అవకాశం కల్పించింది.
Published by:Krishna Adithya
First published: