హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

Navodaya Jobs: నవోదయ విద్యాలయాల్లో టీచింగ్, నాన్ టీచింగ్ జాబ్స్.. దరఖాస్తుకు రేపటి వరకే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

ఏప్రిల్ 6 వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు ఏప్రిల్ 7 నుంచి 16 వరకు 1నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

ఏప్రిల్ 6 వరకు ఇదే షెడ్యూల్ కొనసాగుతుందని ప్రభుత్వం వెల్లడించింది. దీంతోపాటు ఏప్రిల్ 7 నుంచి 16 వరకు 1నుంచి 9వ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

నవోదయ విద్యాలయ సమితి హైదరాబాద్ రీజియన్ పరిధిలో పలు ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. వివరాలు ఇలా ఉన్నాయి.

నవోదయ విద్యాలయ సమితి నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. హైదరాబాద్ రీజియన్ పరిధిలోని (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, కేరళ, లక్షద్వీప్, అండమాన్ నికోబార్ దీవులు) పాఠశాలల్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. టీచింగ్, నాన్ టీచింగ్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 2న ప్రారంభం కాగా.. దరఖాస్తులకు ఆఖరి తేదీగా ఈ నెల 11ను నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.

Telangana: తెలంగాణలోని నిరుద్యోగులకు అలర్ట్.. వారంలోగా ఆ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్?

పోస్టులు, అర్హతల వివరాలు..

పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్లు (పీజీటీ), ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు, ఒకేషనల్ టీచర్లు, ఫాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న అభ్యర్థులు 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ, బీఈడీ ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు.

- టీజీటీ అండ్ క్రియేటివ్ స్టాఫ్ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్ తో పాటు బీఈడీ చేసి ఉండాలి. సీబీఎస్ఈ నిర్వహించే సీటెట్ కు అర్హత సాధించిన అభ్యర్థులకు ప్రాధాన్యం ఉంటుది.

-ఫ్యాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ (ఎఫ్సీఎస్ఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులకు గ్రాడ్యుయేషన్ తో పాటు పీజీడీసీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్థుల వయస్సు జులై 1 నాటికి 50 ఏళ్లలోపు ఉండాలి.

వేతనాల వివరాలు: పీజీటీ విభాగంలో ఎంపికైన వారికి నెలకు రూ.45,750 నుంచి రూ. 42,250 వరకు చెల్లిస్తారు. టీజీటీ, క్రియేటివ్ స్టాఫ్, ఫాకల్టీ కమ్ సిస్టం అడ్మినిస్ట్రేటర్ అభ్యర్థులకు నెలకు రూ. 34125 నుంచి రూ. 40,625 వరకు వేతనం చెల్లించనున్నారు. అభ్యర్థులు ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

అధికారిక వెబ్ సైట్: https://navodaya.gov.in/nvs/ro/Hyderabad/en/home/

ఇదిలా ఉంటే.. ఇటీవల బ్యాంకు ఉద్యోగాలకు విపరీతమైన పోటీ పెరిగింది. మంచి వేతనంతో పాటు ఉద్యోగ భద్రత ఉండడంతో ఈ ఉద్యోగాల్లో సాధించేందుకు అనేక మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కోచింగ్ ల కోసం వేలాది రూపాయలను ఖర్చు చేస్తున్నారు. అలాంటి వారికి తెలంగాణ ఎస్టీ స్టడీ సర్కిల్ (Telangana Study Circle for STs-PETC-Hyderabad) శుభవార్త చెప్పింది. ఐబీపీఎస్ పరీక్షలకు సిద్ధమవుతున్న రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు ఉచితంగా ఆన్లైన్ శిక్షణను అందించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు స్టడీ సర్కిల్ నుంచి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 14 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో తెలిపారు.

First published:

Tags: Government jobs, Hyderabad, Job notification, Private teachers

ఉత్తమ కథలు