నవోదయ విద్యాలయ సమితి (NVS) NVS CBT పరీక్ష (NVS CBT పరీక్ష 2022)ని వాయిదా వేసింది. ఇప్పుడు ఈ కంప్యూటర్ ఆధారిత పరీక్ష డిసెంబర్ 2022 నెలలో నిర్వహించబడుతుంది. ఈ పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు కొత్త షెడ్యూల్‌ను తనిఖీ చేయడానికి నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్‌సైట్‌ను navodaya.gov.in సందర్శించవచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కొత్త పరీక్ష తేదీలు ఇలా..
ఈ రిక్రూట్మెంట్ ఎగ్జామ్ ద్వారా వివిధ విభాగాల్లో ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేస్తారు. ఈ ఖాళీలు డైరెక్ట్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022-23, స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ 2022-23 మరియు JNV యొక్క నార్త్ ఈస్టర్న్ రీజియన్ మరియు డిపార్ట్మెంటల్ ఎగ్జామినేషన్ / లిమిటెడ్ డిపార్ట్మెంటల్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ 2022-23 ద్వారా భర్తీ చేస్తున్నారు. కొత్త షెడ్యూల్ ప్రకారం.. పరీక్ష 10, 11, 15 మరియు 16 డిసెంబర్ 2022 తేదీలలో నిర్వహించబడుతుంది .
వైస్ ప్రిన్సిపాల్ మరియు ప్రిన్సిపాల్ పోస్టుల భర్తీకి NVS CBT పరీక్ష డిసెంబర్ 10 మరియు డిసెంబర్ 11 తేదీల్లో ఢిల్లీలో మాత్రమే నిర్వహించబడుతుంది. మరోవైపు.. డిసెంబర్ 15 మరియు డిసెంబర్ 16, 2022 తేదీలలో పరీక్ష వివిధ నగరాల్లో నిర్వహించబడుతుంది. ఇది త్వరలో తెలియజేయబడుతుంది.
ఇది పాత షెడ్యూల్..
పాత షెడ్యూల్ ప్రకారం.. ముందుగా ఈ మూడు రోజుల్లో రెండు షిఫ్టుల్లో 2022 నవంబర్ 28, 29 మరియు 30 తేదీల్లో పరీక్ష జరగాల్సి ఉంది. ఈ పరీక్షను వాయిదా వేస్తూ.. వెబ్ నోట్ విడుదల చేశారు. అయితే పాత షెడ్యూల్ ప్రకారమే పరీక్షలకు అడ్మిట్ కార్డులు జారీ చేశారు. పరీక్షకు హాజరు కాబోయే అభ్యర్థులు NVS యొక్క అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా అడ్మిట్ కార్డ్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
SSC CGL టైర్ 1 అడ్మిట్ కార్డ్ విడుదల..
ఇదిలా ఉండగా.. మరో పరీక్షకు అడ్మిట్ కార్డులు జారీ అయ్యాయి. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ టెస్ట్ టైర్ I పరీక్షకు అడ్మిట్ కార్డ్‌ను విడుదల చేసింది. ఈ SSC పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ నుండి అడ్మిట్ కార్డ్‌ని డౌన్లోడ్ చేసుకోవచ్చు.
డిసెంబర్ 01వ తేదీన సీజీఎల్ పరీక్ష ఉన్న అభ్యర్థులకు నాలుగు రోజుల ముందు హాల్ టికెట్స్ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్ లింక్ ద్వారా ఇక్కడ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ పరీక్ష సెంటర్, పరీక్ష తేదీ వివరాలను తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ఆ సారి ఎస్సెస్సీ సీజీఎల్ ద్వారా మొత్తం 20,000 పోస్టులను భర్తీ చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వ శాఖలో ఈ అభ్యర్థులను నియమించనున్నారు.
CGL ఎగ్జామ్ ప్యాటర్న్ ఇలా..
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ నిర్వహించే కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్ (CGL) ఎగ్జామ్ కోసం దేశవ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులు ప్రిపేర్ అవుతున్నారు. SSC ఈ ఎగ్జామ్ ద్వారా అకడమిక్ జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తుంది. పరీక్ష టూ టైర్స్‌లో ఉంటుంది. టైర్ 1 పరీక్షలో 200 మార్కులు ఉంటాయి. నెగెటివ్ మార్కులూ ఉన్నాయి. ఒక్క నెగెటివ్ సమాధానానికి 0.5 మార్కులు తీసివేస్తారు. ఇక ఈ పరీక్షలో జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్, రీడింగ్ కాంప్రహెన్షన్, రీజనింగ్, జనరల్ ఇంటెలిజెన్స్ విభాగాల నుంచి ప్రశ్నలు వస్తాయి. టైర్ 2 పరీక్షలో 800 మార్కులు ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: JOBS, Kvs, Nvs, Teacher jobs