నదోదయ విద్యాలయ సమితి ((Navodaya Vidyalaya Samiti)) భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో నవోదయ స్కూళ్లు (Navodaya Vidyalaya Samiti) ఒకటి. కేంద్ర విద్యామంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ స్కూళ్లను నిర్వహిస్తారు. నోయిడా ప్రధాన కేంద్రంగా ఈ స్కూళ్ల నిర్వహణ సాగుతోంది. నవోదయ విద్యాలయ సమితి తాజాగా నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. మొత్తం 1616 ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుల ప్రక్రియ జులై 2వ తేదీ నుంచి ప్రారంభం కానుంది. దరఖాస్తు చేసుకోవడానికి జులై 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT) నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో అభ్యర్థులు సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
ఖాళీలు, విద్యార్హతల వివరాలు: ప్రిన్సిపల్:మొత్తం 12 ప్రిన్సిపల్ పోస్టులు ఖాళీలు ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు అధికారులు. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాస్టర్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. మాస్టర్ డిగ్రీలో 50 శాతం మార్కులు వచ్చి ఉండాలి. దరఖాస్తుదారుల వయస్సు 50 ఏళ్లలోపు ఉండాలి. AP Job Mela: ఏపీలో ఈ రోజు మరో జాబ్ మేళా.. ప్రముఖ సంస్థలో ఉద్యోగాలు.. ఇలా రిజిస్టర్ చేసుకోండి
పీజీటీ (పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్లు-PGT):పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ల విభాగంలో 397 ఖాళీలు ఉన్నాయి. 50 శాతం మార్కులతో రెండేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. టీజీటీ (థర్డ్ లాంగ్వేజ్):ఈ విభాగంలో 343 ఖాళీలు ఉన్నాయి. నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీతో పాటు బీఈడీ చేసి ఉండాలి. సీటెట్ లో అర్హత సాధించి ఉండాలి. AP Govt Jobs: ఏపీలో కొత్తగా 3530 ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్.. పూర్తి వివరాలివే..!
మిసిలీనియస్ కేటగిరీ (ఆర్ట్, పీఈటీ, లైబ్రేరియన్):ఈ విభాగంలో మొత్తం 181 ఖాళీలు ఉన్నాయి. గ్రాడ్యుయేషన్, డిప్లొమా (లైబ్రరీ సైన్స్), బీపీఈడీ, డిప్లొమా (ఫైన్ ఆర్ట్స్), బ్యాచిలర్స్ డిగ్రీ (మ్యూజిక్) ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. సంబంధిత విభాగంలో అనుభవంతో పాటు ప్రాంతీయ భాషలపై అవగాహన ఉండాలి. అభ్యర్థుల వయస్సు 35 ఏళ్లలోపు ఉండాలి.
టీజీటీ(ట్రెయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్లు-TGT):ఈ విభాగంలో 683 ఖాళీలు ఉన్నాయి.
అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.1500 నుంచి రూ.2000 వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.
-అభ్యర్థులు జులై 2వ తేదీ నుంచి నవోదయ విద్యాలయ సమితి అధికారిక వెబ్ సైట్ https://navodaya.gov.in/ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Published by:Nikhil Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.