హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Entrance Exam 2021: ఆ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 11న ఎంట్రన్స్​​ టెస్ట్.. వివరాలివే..

Entrance Exam 2021: ఆ విద్యాలయాల్లో ప్రవేశాలకు షెడ్యూల్ విడుదల.. ఆగస్టు 11న ఎంట్రన్స్​​ టెస్ట్.. వివరాలివే..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021–22 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్​ కార్ట్​లు, ఇతర వివరాలను కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని నోటీసుల్లో పేర్కొంది.

ఇంకా చదవండి ...

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2021–22 విద్యాసంవత్సరానికి గాను ఆరోతరగతి ప్రవేశాలకు నిర్వహించే ప్రవేశ పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు కేంద్ర విద్యా శాఖ ప్రకటించింది. ఈ ప్రవేశ పరీక్షను తొలుత మిజోరాం, నాగాలాండ్, మేఘాలయ మినహా అన్ని రాష్ట్రాలు, యూటీల్లో నిర్వహించాలని అధికారులు భావించారు. అయితే అప్పటి కరోనా తీవ్రత నేపథ్యంలో పరీక్షను జూన్ 19కి వాయిదా వేశారు. కానీ జూన్​ 19 నాటికి కూడా కొన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమల్లో ఉండటంతో రెండోసారి కూడా ఈ పరీక్షను వాయిదా వేశారు. ప్రస్తుతం, దేశంలో కరోనా కేసులు తగ్గడం, లాక్​డౌన్​ ఆంక్షలు సడలించడంతో తాజా షెడ్యూల్​ను విడుదల చేసింది కేంద్ర విద్యా శాఖ. దేశవ్యాప్తంగా ఆగస్టు 11న ఈ పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపింది. పరీక్షకు సంబంధించిన అడ్మిట్​ కార్ట్​లు, ఇతర వివరాలను కనీసం 15 రోజుల ముందు విద్యార్థులకు తెలియజేస్తామని నోటీసుల్లో పేర్కొంది. అడ్మిట్​ కార్డులు, పరీక్షా విధానం కోసం విద్యార్థులు నవోదయ అధికారిక వెబ్‌సైట్ navodaya.gov.in ను సందర్శించాలని కోరింది.

ఈ వెబ్​సైట్​లో ఎన్‌విఎస్ ఎగ్జామ్​ బుక్‌లెట్‌ను కూడా పొందుపర్చింది. కాగా, దేశవ్యాప్తంగా ఈ పరీక్ష నిర్వహణకు 11,182 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2021–22 విద్యాసంవత్సరంలో 47,320 సీట్లకు గాను 24,17,009 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్​ నిబంధనలకు అనుగుణంగా దేశవ్యాప్తంగా ఈ పరీక్షలను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. జేఎన్​వీ ప్రవేశ పరీక్షను హిందీ, ఇంగ్లిష్​తో పాటు ఆయా రాష్ట్రాల ప్రాంతీయ భాషల్లో నిర్వహిస్తారు.

ఏటా లక్షలాది మంది పోటీ..

నవోదయ విద్యాలయ సమితి పరిధిలోని వివిధ పాఠశాలల్లో 6, 9 తరగతులకు ప్రతి ఏటా నవోదయ ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఈ ప్రవేశ పరీక్ష సమయం 2 గంటలు. ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతారు. నవోదయ విద్యాలయాలను కేంద్ర నిధులతో నిర్వహిస్తున్నారు. వీటిలో ప్రవేశం పొందిన విద్యార్థులకు రెసిడెన్షియల్ విధానంలో ఉచిత విద్యను అందిస్తారు. సాధారణంగా ఈ పరీక్షను జనవరి, మార్చి నెలల్లో ఏటా రెండు సార్లు నిర్వహిస్తారు. నాణ్యమైన ఉచిత విద్య అందిస్తుండటంతో వీటిలో ప్రవేశానికి ఏటా లక్షలాది మంది విద్యార్థులు పోటీపడతారు.

First published:

Tags: Admissions, Exams, Students

ఉత్తమ కథలు