Shravan Kumar BommakantiShravan Kumar Bommakanti
|
news18-telugu
Updated: July 26, 2019, 6:48 PM IST
ప్రతీకాత్మక చిత్రం
కేంద్రీయ జవహార్ నవోదయ విద్యాలయాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులకు సదావకాశం దక్కింది. విద్యాలయాల్లో 2020-2021 విద్యాసంవత్సరానికి గానూ ఆరో తరగతిలో ప్రవేశాలకు 'నవోదయ విద్యాలయ సమితి' దరఖాస్తులు కోరుతోంది. ప్రస్తుత విద్యా సంవత్సరం (2019-20)లో ప్రభుత్వ/ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 5వతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. 2007 మే 1 నుంచి 2011 ఏప్రిల్ 30 మధ్య జన్మించి ఉండాలి. సెప్టెంబరు 15లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకునేందుకు
www.navodaya.gov.in వెబ్సైట్ను సందర్శించండి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కనీసం 75 శాతం సీట్లు, బాలికలకు 1/3వ వంతు సీట్లు కేటాయించినట్లు నవోదయ విద్యాలయ సమితి తెలిపింది.
గుర్తుంచుకోవాల్సిన తేదీలు:దరఖాస్తుల ఆహ్వానం- 01 జూలై 2019
దరఖాస్తుకు చివరి తేది- 15 సెప్టెంబరు 2019
జేఎన్వీఎస్టీ అర్హత పరీక్ష- 11 జనవరి 2020 (ఫేజ్-1), 11 ఏప్రిల్ 2020 (ఫేజ్-2)
ఇక్కడ దరఖాస్తు చేసుకోండి..
ప్రవేశాలకు దరఖాస్తు
పరీక్ష విధానం:మొత్తం 80 ప్రశ్నలు ఉంటాయి. వాటికి 100 మార్కులు కేటాయిస్తారు. కేటాయించే సమయం: 2 గంటలు
- మెంటల్ ఎబిలిటీ- 40 ప్రశ్నలు
- ఆర్థమెటిక్ పరీక్ష- 20 ప్రశ్నలు
- లాంగ్వేజ్ పరీక్ష - 20 ప్రశ్నలు
Published by:
Shravan Kumar Bommakanti
First published:
July 26, 2019, 6:48 PM IST