నావల్ షిప్ రిపేర్ యార్డ్ అండ్ నావల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్(Aircraft Yard) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్(Notification) విడుదలైంది. దీని ప్రకారం 180 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తారు. ఆసక్తి మరియు అర్హత కలిగిన అభ్యర్థులు Apprenticeship apprenticeshipindia.gov.in యొక్క అధికారిక సైట్ను సందర్శించడం. దీనిలోనే ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ ఎంప్లాయ్మెంట్ న్యూస్లో ప్రకటన ప్రచురించబడిన తేదీ నుండి 30 రోజులలోపు.
ఖాళీల వివరాలు ఇలా..
నావల్ షిప్ రిపేర్ యార్డ్, కార్వార్: 150 పోస్టులు.
నావల్ ఎయిర్క్రాఫ్ట్ యార్డ్ (గోవా), దబోలిమ్, గోవా: 30 పోస్టులు.
మొత్తం 180- పోస్ట్లు.
అర్హత ప్రమాణాలు..
నేషనల్/స్టేట్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ (NCVT/SCVT) ద్వారా గుర్తింపు పొందిన సంబంధిత ITI ట్రేడ్లో మెట్రిక్యులేషన్ లేదా తత్సమానంలో 50 శాతం కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
వయోపరిమితి
నోటిఫికేషన్ ప్రకారం అభ్యర్థి వయస్సు 14 నుండి 21 సంవత్సరాల మధ్య ఉండాలని పేర్కొన్నారు.
అంటవీ శాఖలో ఉద్యోగాలు ..
గుజరాత్ అటవీ శాఖ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 823 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ అనేది నవంబర్ 1, 2022 నుంచి ప్రారంభం అవుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 15 నవంబర్ 2022. ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ గార్డ్ పోస్టులను భర్తీ చేస్తారు.
ఆసక్తి మరియు అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ojas.gujarat.gov.in ని సందర్శించడం ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుండి 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Career and Courses, Central Government Jobs, JOBS, Naval