Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

Naukari Index: ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు.. నౌకరీ ఇండెక్స్‌ రిపోర్టులో ఏముందంటే..

Naukari Index: ఈ రంగాల్లో భారీగా ఉద్యోగాలు.. నౌకరీ ఇండెక్స్‌ రిపోర్టులో ఏముందంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Naukri job speak index: గత సంవత్సరంతో పోలిస్తే ఈ సెప్టెంబరులో 57 శాతం అధికంగా నియామకాలు జరిగాయని ప్రముఖ ఉద్యోగ పోర్టల్ నౌకరీ జాబ్ స్పీక్ నివేదించింది. కోవిడ్ కు ముందు అంటే 2019 సెప్టెంబరుతో పోలిస్తే పలు కంపెనీలు 21 శాతం అధికంగా ఉద్యోగులను నియమించుకున్నాయి.

ఇంకా చదవండి ...

కరోనా మహమ్మారి (Covid-19 Pandemic) ప్రభావంతో గత కొంత కాలంగా నియామకాలు బాగా తగ్గాయి. అయితే ఇటీవల కాలంలో పరిస్థితులు అదుపులోకి రావడంతో ఉద్యోగుల నియామకాలు ఊపందుకున్నాయి. ముఖ్యంగా గత మూడు నెలలుగా భారత్‌లో జాబ్ మార్కెట్ (Job Market) దూసుకెళ్తుంది. గత సంవత్సరంతో పోలిస్తే ఈ సెప్టెంబరులో 57 శాతం అధికంగా నియామకాలు జరిగాయని ప్రముఖ ఉద్యోగ పోర్టల్ నౌకరీ జాబ్ స్పీక్ (Naukri Job speak) నివేదించింది. కోవిడ్ కు ముందు అంటే 2019 సెప్టెంబరుతో పోలిస్తే పలు కంపెనీలు 21 శాతం అధికంగా ఉద్యోగులను నియమించుకున్నాయి. నౌకరీ జాబ్ స్పీక్ ప్రతి నెలా మాసిక సూచిని(Monthly Index) ప్రచురిస్తుంది. Naukri.com వెబ్ సైట్లో హైరింగ్ యాక్టివిటీలో జాబ్ లిస్టింగ్స్ ఆధారంగా ఈ ఇండెక్స్ రూపొందిస్తారు.

BEL నుంచి మరో జాబ్ నోటిఫికేషన్.. ఇలా అప్లై చేయండి.. వివరాలివే..

* ఏయే రంగాల్లో వృద్ధి నమోదైంది?

ఒక్క ఐటీ రంగంలో నే కాకుండా ఇతర రంగాల్లో నియామకాలను కూడా ఏటా నివేదిస్తారు. ఐటీ రంగంలో అత్యధికంగా 138 శాతం వృద్ధి నమోదు కాగా.. అనంతరం ఆతిథ్య రంగంలో 82 శాతం పెరుగుదల కనిపించిందని ఈ నివేదిక పేర్కొంది. కోవిడ్ కారణంగా ఎక్కువగా ప్రభావితమైన రంగాల్లో నియామకాలు అత్యధికంగా జరిగాయని స్పష్టం చేసింది. ఆతిథ్య రంగం తర్వాత రిటైల్ సెక్టార్ లో 72 శాతం వృద్ధి నమోదైందని తెలిపింది. దేశవ్యాప్తంగా హోటళ్లు, ఫిజికల్ స్టోర్ ఔట్ లెట్లు క్రమంగా తిరిగి తెరుచుకున్నాయని చెప్పింది.

ఏపీలోని నిరుద్యోగులకు అలర్ట్.. ఈ రోజు జాబ్ మేళా.. పూర్తి వివరాలివే..

విద్యా రంగంలో వార్షిక అత్యధిక రికవరీ రేటు నమోదైంది. సెప్టెంబరు 2021లో ఈ రంగంలో నియామకాలు 53 శాతం వృద్ధి చెందింది. సెప్టెంబరు 2019తో పోలిస్తే 32 శాతం అధికమైంది. ఇదే సమయంలో BFSI(43 శాతం), రియల్ ఎస్టేటు(39 శాతం), టెలికాం(37 శాతం), బీమా రంగం(29 శాతం), ఆరోగ్య రంగం(26 శాతం) వృద్ధిని చూశాయి.

సుప్రీం కోర్టు గ్రీన్ సిగ్నల్.. త్వరలోనే​ నీట్ ఫలితాలు.. రిజల్ట్ ఇలా చెక్​ చేసుకోండి..

* ఏయే నగరాల్లో అత్యధిక నియామకాలు జరిగాయి?

దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో అధిక నియామకాలు జరిగాయి. మెట్రోల్లో సెప్టెంబరులో వార్షిక వృద్ధి రేటు 88 శాతం నమోదు కాగా.. టైర్-2 నగరాల్లో 30 శాతం వృద్ధి కనిపించిందని నౌకరీ రిపోర్టు పేర్కొంది. నగరాల వారీగా గమనిస్తే బెంగళూరు(133 శాతం), హైదరాబాద్(110 శాతం), పుణె(95 శాతం), చెన్నై(85 శాతం) ఉన్నాయి. దేశరాజధాని దిల్లీ ప్రాంతంలో 92 శాతం వార్షిక వృద్ధి రేటు నమోదైంది. ముంబయి, కోల్ కతా నగరాలు 60 శాతం వృద్ధిని అందుకున్నాయి.

ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. ఇలా అప్లై చేయండి

* సెప్టెంబరులో ఏయే నియామకాలు జరిగాయి?

క్రితం సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది సెప్టెంబరులో అనుభవజ్ఞులను ఎక్కువగా తీసుకున్నాయి. కోవిడ్ మహమ్మారి ఎదురుదెబ్బల నుంచి కోలుకుంటున్న తరుణంలో నియామక మార్కెట్ సానుకూల పనితీరే ఇందుకు కారణమైంది. 8 నంచి 12 సంవత్సరాల అనుభవం ఉన్న సీనియర్ ప్రొఫెషనల్స్ కు డిమాండ్ పెరుగుతూనే ఉంది. వీరి నియామకాలు సెప్టెంబరు 2021, సెప్టెంబరు 2020 మధ్య 75 శాతం పెరిగాయి. 0 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉన్నవారు(54 శాతం), 4-7 సంవత్సరాలు(65 శాతం), 13 ఏళ్ల కంటే అధిక అనుభవం ఉన్నవారిని(47 శాతం) ఎక్కువగా నియమించుకున్నాయి.

First published:

Tags: Career and Courses, Govt Jobs 2021, IT jobs, Job, Private Jobs

ఉత్తమ కథలు