హోమ్ /వార్తలు /జాబ్స్ & ఎడ్యుకేషన్ /

NWDA Recruitment: LDC, UDC, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. పది, ఇంటర్, డిగ్రీ అర్హత..

NWDA Recruitment: LDC, UDC, జూనియర్ ఇంజనీర్ ఉద్యోగాలు.. పది, ఇంటర్, డిగ్రీ అర్హత..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

NWDA Recruitment: నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Telangana, India

నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ వెల్లడైంది. ఈ పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఈ పోస్టులకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం అయింది. కాబట్టి NWDA యొక్క ఈ పోస్ట్‌లకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. దాని కోసం అభ్యర్థులు ఈ నేషనల్ వాటర్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ యొక్క అధికారిక వెబ్‌సైట్ nwda.gov.in సందర్శించొచ్చు. ఈ వెబ్‌సైట్ కాకుండా ఇతర మార్గాల ద్వారా దరఖాస్తు చేయవద్దు. ఆన్‌లైన్ దరఖాస్తులు మాత్రమే అంగీకరించబడతాయి.

మార్చి 18 నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం అయింది. దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీ ఏప్రిల్ 17, 2023గా నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. ఇక ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 40 ఉద్యోగాలను భర్తీ చేస్తారు.

పోస్టుల వివరాలిలా..

1. జూనియర్ ఇంజనీర్ (సివిల్) - 13

2. జూనియర్ అకౌంటెంట్స్ - 01

3. డ్రాఫ్ట్ మెన్ గ్రేడ్ 3 - 06

4. అప్పర్ డివిజిన్ క్లర్క్ - 07

5.స్టెనో గ్రాఫర్ గ్రేడ్ 2 - 09

6. లోయర్ డివిజన్ క్లర్క్ - 04

మొత్తం - 40 పోస్టులు

విద్యార్హతలు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి విద్యార్హతలు పోస్టును బట్టి మారుతూ ఉంటాయి. ప్రతి పోస్ట్ గురించి వివరంగా తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్‌లో ఇచ్చిన నోటీసును తనిఖీ చేయడం మంచిది. ఎక్కువగా.. 12వ తరగతి ఉత్తీర్ణత నుండి సంబంధిత రంగంలో పట్టభద్రులైన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

సివిల్ ఇంజినీరింగ్‌లో డిప్లొమా ఉన్న అభ్యర్థులు జూనియర్ ఇంజనీర్ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

12వ తరగతి ఉత్తీర్ణులు స్టెనోగ్రాఫర్ మరియు లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయోపరిమితి..

ఏ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలనుకున్నా అభ్యర్థి యొక్క వయస్సు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

Jobs In L&T: ఎల్ అండ్ టీ సంస్థలో ఉద్యోగాలు .. దరఖాస్తు చేసుకోండిలా..

ఎంపిక ఎలా ఉంటుంది

ఈ పోస్టుల ఎంపిక అనేక మూడు దశల పరీక్షల తర్వాత ఉంటుంది. రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ మరియు మెడికల్ ఎగ్జామినేషన్ వంటివి ఈ దశల్లో ఉంటాయి. ఇది కూడా పోస్ట్ ప్రకారం నిర్వహించబడుతుంది.

దరఖాస్తు ఫీజు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీల అభ్యర్థులు రూ.890 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. కాగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ కేటగిరీలకు ఫీజు రూ.500 చెల్లించాలి.

వేతనం..

ఎంపికైన అభ్యర్థులకు పోస్టును బట్టి వేతనంలో మార్పు ఉంటుంది. కొన్ని పోస్టులకు నెలకు లక్షకు పైగా వేతనం.. కొందరికి 80 వేల రూపాయల వరకు వేతనం అందుతోంది.

First published:

Tags: Central Government Jobs, Central jobs, JOBS

ఉత్తమ కథలు