NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 జాబ్స్... దరఖాస్తుకు ఆగస్ట్ 31 చివరి తేదీ

NTPC Recruitment 2019 | ఆసక్తిగల అభ్యర్థులు ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 1న ప్రారంభం కాగా ఆగస్ట్ 31న ముగుస్తుంది.

news18-telugu
Updated: August 29, 2019, 1:34 PM IST
NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 జాబ్స్... దరఖాస్తుకు ఆగస్ట్ 31 చివరి తేదీ
NTPC Jobs: ఎన్‌టీపీసీలో 79 జాబ్స్... దరఖాస్తుకు ఆగస్ట్ 31 చివరి తేదీ
news18-telugu
Updated: August 29, 2019, 1:34 PM IST
ఐటీఐ, అసిస్టెంట్ ట్రైనీ, ల్యాబ్ అసిస్టెంట్, డిప్లొమా ట్రైనీ పోస్టుల భర్తీకి  చత్తీస్‌గఢ్‌లోని నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్-NTPC దరఖాస్తుల్ని ఆహ్వానిస్తోంది. ఐటీఐ, అసిస్టెంట్ ట్రైనీ, ల్యాబ్ అసిస్టెంట్, డిప్లొమా ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఎన్‌టీపీసీ. మొత్తం 79 ఉద్యోగాలున్నాయి. ఐటీఐ పోస్టులకు 10వ తరగతితో పాటు సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ పాస్ కావాలి. డిప్లొమా ట్రైనీ పోస్టులకు సంబంధిత ట్రేడ్‌లో డిప్లొమా ఉండాలి. ఇక అసిస్టెంట్ జనరల్ ట్రైనీకి డిగ్రీ, ల్యాబ్ అసిస్టెంట్ కెమిస్ట్రీ ట్రైనీ పోస్టుకు కెమిస్ట్రీతో బీఎస్సీ పాస్ కావాలి. ఆసక్తిగల అభ్యర్థులు ఎన్‌టీపీసీ అధికారిక వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఆగస్ట్ 1న ప్రారంభం కాగా ఆగస్ట్ 31న ముగుస్తుంది. ట్రైనీ పోస్టుల భర్తీకి నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్-NTPC జారీ చేసిన నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.  దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

NTPC Recruitment 2019: నోటిఫికేషన్ వివరాలివే...


మొత్తం పోస్టులు- 79

ఐటీఐ (ఎలక్ట్రీషియన్) ట్రైనీ- 30
ఐటీఐ (ఫిట్టర్) ట్రైనీ- 16
ఐటీఐ (ఇన్‌స్ట్రుమెంట్) ట్రైనీ- 12


అసిస్టెంట్ జనరల్ ట్రైనీ- 05
Loading...
ల్యాబ్ అసిస్టెంట్ (కెమిస్ట్రీ) ట్రైనీ- 06
డిప్లొమా ట్రైనీ (ఎలక్ట్రికల్)- 05
డిప్లొమా ట్రైనీ (మెకానికల్)- 05

దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం- 2019 ఆగస్ట్ 01
దరఖాస్తు ముగింపు- 2019 ఆగస్ట్ 31
మొదటి స్టేజ్ పరీక్షకు అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్- సెప్టెంబర్ చివరి వారం
మొదటి దశ పరీక్ష- అక్టోబర్ మూడో వారం
రెండో దశ పరీక్ష- నవంబర్ మూడో వారం
రెండో దశ టెక్నికల్, స్కిల్ టెస్ట్- డిసెంబర్ రెండో వారం

వయస్సు: ఐటీఐ, అసిస్టెంట్ జనరల్ ట్రైనీ, ల్యాబ్ అసిస్టెంట్ పోస్టుకు 37 ఏళ్లు. డిప్లొమా ట్రైనీకి 35 ఏళ్లు.

Job News: మరిన్ని జాబ్స్ & ఎడ్యుకేషన్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Revolt: మార్కెట్‌లోకి వచ్చిన కొత్త ఎలక్ట్రిక్ బైక్... ఎలా ఉందో చూడండి



ఇవి కూడా చదవండి:

Jobs: కేంద్రీయ హిందీ సంస్థాన్‌లో ఉద్యోగాలు... ఖాళీల వివరాలు ఇవే

SBI Jobs: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగాలు... నోటిఫికేషన్ వివరాలివే

Army Jobs: ఆర్మీ ఉద్యోగాలకు కరీంనగర్‌లో రిక్రూట్‌మెంట్ ర్యాలీ... మొదలైన దరఖాస్తు

 
First published: August 29, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...